Pawan Kalyan on EmployeesPawan Kalyan on Employees

నష్టపోయిన ఉద్యోగులపట్ల జనసేన అండ: పవన్ కళ్యాణ్

ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదు – జనసేనాని

ప్రభుత్వ ఉద్యోగుల (Government Employees) జీతభత్యాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం (State Government) చిత్తశుద్ధి కనపరచలేదు. ప్రభుత్వం ఆధిపత్య ధోరణిలో వెళ్లింది. ఫలితంగా ఉద్యోగులకు ఊరట లభించలేదు అని జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆవేదన వ్యక్తం చేసారు.

ఫిట్మెంట్ (Fitment), గత హెచ్.ఆర్.ఏ. (HRA) కొనసాగింపు, అశుతోష్ మిశ్రా (Ashutosh mishra) నివేదిక ఇవ్వడం లాంటి ప్రధాన డిమాండ్లతో విజయవాడలో ఉద్యోగులు ఉవ్వెత్తున భారీ ర్యాలీ (Employees Rally) చేశారు. ఆ భారీ ర్యాలీ ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసింది. కానీ ఉద్యోగుల డిమాండ్లు ఏవీ నెరవేరలేదు. ఐ.ఆర్. హెచ్.ఆర్.ఏ., క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రికవరీని పాక్షికంగానే అమలు చేస్తున్నారు. అయినా సరే సమ్మె ఉపసంహరించుకొని, ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాల్సిన పరిస్థితిని పి.ఆర్.సి. స్టీరింగ్ కమిటీ నాయకులకు ప్రభుత్వం కల్పించింది అని జనసేనాని విమర్శించారు.

ఈ ఉపసంహరణ ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు విభేదించిన విషయాన్ని, వారు ప్రస్తావిస్తున్న అంశాలను జనసేన (Janasena) పరిగణనలోకి తీసుకొంటుంది. ప్రభుత్వ వైఖరితో నష్టపోయిన ఉద్యోగ వర్గంపట్ల జనసేన పార్టీ సానుకూల దృక్పథాన్నికనబరుస్తుంది. వారి భావోద్వేగాలకు విలువ ఇస్తుంది అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకనలో ఉద్యోగులకు మద్దతు ప్రకటించారు.

గానకోకిల లతా మంగేష్కర్ అస్తమయం బాధాకరం