Case against Sunil Kumar

న్యాయం దృక్కోణంలో రఘు రామ Vs పోలీసు!

కత్తులతో ఆడేవాడు ఆ కత్తులకే బలవుతాడు. పాములతో ఆడుకొనేవాడి జీవితం పాము కాటుకే బలి అవుతుంది. దీన్నే విధి అంటారు. దీన్ని నుండి తప్పించుకోవడం ఎవ్వరి వల్ల కాదేమో అంటున్న సీనియర్ న్యాయవాది, శింగలూరి శాంతి ప్రసాద్. అది ఏమిటంటే …

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలుపైన ఒక క్రిమినల్ కేసులు ప్రాక్టీస్ చేస్తున్న ఒక న్యాయవాదిగా నా అభిప్రాయాలు నిర్ద్వంద్వంగా చెప్పదలుచుకున్నాను. వాటిలో ఉన్న వాస్తవ, అవాస్తవాలను మీరే స్వయంగా పరిశీలించిన తరువాత నిర్ణయించుకోవాలని కోరుతున్నాను.

ఓడలు బళ్ళు అవతాయంటే ఏమిటో?

Karma is Bitch అని ఏందుకు అంటారో, ఇప్పుడు కింద ఇచ్చిన సమాచారం ద్వారా మనకి అర్ధం అవుతుంది. ఓడలు బళ్ళు అవతాయంటే ఏమిటో అనుకున్నా? కానీ ఇప్పుడు పూర్తిగా అవగతం అవుతోంది. ఇక విషయం ఏమటో పరిశీలన చేద్దాము.

పివి సునీల్ కుమార్ (P V Sunil Kumar) ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర సిఐడీ విభాగం (CID) అదనపు డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ (ADG, AP CID). రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishna Raju)పైన సిఐడీ పోలీసు స్టేషన్, మంగళగిరిలో (Mangalagiri) పెట్టిన కేసు నంబరు 12/2021 ది.14-05-2021 కి సునీల్ కుమార్ పిర్యాదుదారుడు. అనగా కోన్ని మీడియా (Media) సంస్థల సహకారంతో రఘురామకృష్ణరాజు రాష్ట్రంలో ఉన్న కులాలు, మతాల మథ్యన విభేదాలు సృష్టించటానికి తద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరచటానికి ప్రయత్నాలు చేస్తూన్నారు అని అయనంతట అయనే ఒక నివేదిక తయారు చేసి. స్వయంగా తానే పిర్యాదుదారుడుగా పలు బైయిల్ దోరికే ఐపీసీ సెక్షన్లతో పాటు, బైయిల్ దోరకకుండా ఉండటం కోసం సెక్షన్. 124-ఏ ఐపీసీ సెక్షన్’తో కూడా కేసు పెట్టటం జరిగింది. దానితో అత్యవసరంగా 14-05-2021న రఘురామకృష్ణరాజు పుట్టిన రోజు సందర్భంగా అయనను హైదరాబాదు నివాసం నుంచి బలవంతంగా అరెస్టు చేయటం, తదనంతర పరిణామాలు రాష్ట్ర ప్రజలు అందరికీ కరతలామలకమే.

సునీల్ కుమార్’పై పిర్యాదు?

ఇప్పుడు అదే విథమైన అభియోగాలతో, ఇదే పివి సునీల్ కుమార్ పైన నిన్నటి రోజున మహరాష్ట్ర లోని Legal Rights Protection Forum (@Legal LRO) పిర్యాదు చేసింది. ఆ సంస్థ కన్వీనరు వినయ్ జోషీ, కేంద్ర ప్రభుత్వం హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ గారికి పిర్యాదు చేయడం జరిగింది. మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు నేపథ్యంలో, సునీల్ కుమార్’పై కేసు దాఖలు చేసి, సదరు సునీల్ కుమార్’ని సర్వీసు నుంచి తొలగించమని కోరటం కూడా జరిగింది.

అనగా హిందూ (Hindu), క్రైస్తవ (Christian) మతాల మథ్యన, దళితేతరులు దళితులు మథ్యన ఘర్షణ వచ్చేలా వ్యాఖ్యలు చేశారు అని ఆరోపించారు. అలానే అంబేద్కర్’వాదం పైన కించ పరుస్తూ కూడా పలు వాఖ్యలు చేశారు అని కేంద్రానికి పిర్యాదు చేయడం జరిగింది. అంటే కులాలు, మతాల మథ్యన ఘర్షణ వాతావరణం సృష్టించటానికి ప్రయత్నాలు చేయటం. దీనికి పలు వీడియోలను కూడా అథారాలుగా రిపోర్టు చేయటం జరిగినట్లు తెలుస్తున్నది.

దీని సారాంశం ఏమిటంటే?

రఘురామకృష్ణరాజు పైన ఏ ఏ సెక్షన్లతో క్రిమినల్ కేసులు పెట్టారో, ఖచ్చితంగా అవే సెక్షన్లతో సునీల్ కుమార్ పైన కూడా కేసు పెట్టినందున, అత్యవసరంగా అరెస్టు చేయటం జరగాలి. కానీ అటువంటిది ఏమీ ఇంతవరకు జరగలేదు. పైగా అయన చేసాడని చెబుతున్న వివాదాస్పద వీడియోలు పూర్తిగా సోషల్ మీడియా నుంచి సునీల్ కుమార్ మాయం చేయటం జరిగింది అని అతనిపైన రిపోర్టు చేసిన సంస్థ, ఈరోజు మరోక అరోపణ చేసింది. కానీ తాము సదరు వీడియో సాక్ష్యం పూర్తిగా ముందు గానే రికార్డు చేసి, హోం శాఖకు రిపోర్టు చేశామని చెబుతున్నారు.

ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి. రఘురామకృష్ణరాజు పైన సాక్ష్యం కావాలంటూ అయన అపిల్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు సిఐడీ పోలీసులు. కానీ వాస్తవానికి సదరు ఫోన్ స్వాధీనం చేసుకునే అవసరం లేదు. కారణం, వారు చెబుతున్న విషయాలు టీవీ డిబెట్లు ద్వారా అని చెప్పిన తరువాత, అవి యూట్యూబ్ లో చక్కగా లభిస్తాయి లేదా చట్టపరంగా సదరు మీడియా సంస్థల నుండి కోర్టు ఉత్తర్వులు ద్వారా సంపాదించవచ్చు.

ఇక్కడ మరొక్క విషయం కూడా మనం గమనించాలి. యుశ్రారైకాపా అథికార ప్రతినిధిలు ఈమథ్యన ఒక వాదన లేవదీయటం జరిగింది. అదేమిటంటే రఘురామకృష్ణరాజు డూప్లికేట్ సిమ్ ద్వారా, స్వాథీనం చేసుకున్న సెల్ ఫోన్ లోని సమాచారం పూర్తిగా మాయం చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ అరోపణలు చేయటం జరిగింది. నిజంగా అది జరిగిందో, లేదో మనకు తెలియదు. కానీ పివీ సునీల్ కుమార్ మాత్రం ఏదైతే నేరపూరిత ప్రసంగాలు అని రిపోర్టు ఇచ్చారో, వాటన్నిటినీ పూర్తిగా తొలగించటం ద్వారా, ఇప్పుడు అయన సాక్ష్యాలు మాయం చేయటానికి ప్రయత్నాలు చేయటం జరిగింది అని నిర్థారణ అవ్వవచ్చు. అనగా రఘురామకృష్ణరాజు పైన పెట్టిన కేసులో ఉన్న సెక్షన్.120-బీ ఐపీసీ (నేరపూరితకుట్ర) బదులు, సెక్షన్. 201ఐపీసీ (కేసు సాక్ష్యం తారుమారు చేయటం) అనేది సునీల్ కుమార్ పైన కూడా రావచ్చు. అంతే తేడా తప్పితే, మిగిలినదంతా సెమ్ టు సెమ్.

రఘు రామ కృష్ణరాజు పైన పెట్టిన కేసు ఏంత బలహీనమైనదో అనేది ఇప్పుడు చెప్పండి? కారణం అదే విథమైన అరోపణలు ఎదుర్కొనే వ్యక్తి అటువంటి అరోపణలతో మరోక వ్యక్తి పైన ఏలా పిర్యాదు చేయగలడు? ఇది నిజంగా రఘురామకృష్ణరాజు కేసు మూలాన్ని దెబ్బ తీసే చర్య. ఇది ఎలా ఉంది అంటే తన దోంగ విథానాలు రూపుమాపుకోని ఒక దోంగ, ఎదుటివారిని దోంగ అంటూ అరచినట్లుగా ఉన్నది.

ఇవన్నీ పరిశీలించిన తరువాత ఒక క్రిమినల్ కేసులు చేసే న్యాయవాదిగా నాకు అర్ధమైన విషయం ఏమిటంటే, రఘురామకృష్ణరాజుపైన పెట్టిన కేసు దాదాపుగా, పూర్తిగా బలహీన పడిపోయింది అని భావించాల్సి వస్తోంది. ఇక కేవలం నామమాత్రంగా మాత్రమే అయన పైన కేసు నడవ వచ్చు. చివరకు పూర్తిగా కోట్టి కొట్టివేయడం కూడా జరగవచ్చు..

ఇరుక్కునేది ఎవరు?

కాకపోతే ఈ కేసులో అత్యుత్సాహంతో రఘురామకృష్ణరాజుని అరెస్టు చేసి, మూడో డిగ్రీ ప్రయోగం చేసిన ఆరోపణలు కొంతమంది అధికారులపై ఉన్నాయి. అప్పుడు అటువంటి పోలీసులు మరియు తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ జారీచేసిన వారు (నిరూపణ అయితే) పూర్తిగా ఇరుక్కుపోయే అవకాశం ఉంది.

హనుమాన్ జంక్షన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. “నేను గుప్పెడంత చిద్దామని మొదలు పెడితే, చివరకు అది చిరిగి చాటంత అవుతుంది” అని. ఇప్పుడు అదే జరిగింది. సిఐడీ పోలీసులు పెట్టిన కేసు ఏలాగూ బలహీన పడవచ్చు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు పెట్టబోయే కోర్టు థిక్కారం కేసు, అక్రమ అరెస్టు కేసు, కస్టడీలో ఉండగా కోట్టిన కేసు, తన సెల్ ఫోన్ దురుపయోగం కేసు. అలానే పరువు నష్టం కేసు, పార్లమెంట్ సభ్యుడిగా తన హక్కులు ఉల్లంఘన కేసుతో పాటు, ఇంకా పలు కేసులు అయన పెట్టటం అంటూ చేస్తే, ఖచ్చితంగా అథికారులు ఇరుక్కునే అవకాశం మెండుగా ఉంది.

అందుకే చెప్పేది, రాజకీయ నాయకులు అండ ఉన్నది అని అథికారులు రెచ్చిపోవటం చేస్తే , రాజకీయ నాయకులకు ఊడేదేమి ఉండదు. కానీ వారి మాటలు పట్టుకోని అతి చేసిన అథికారులు మాత్రం ఖచ్చితంగా దాని ఫలితాలను అనుభవిస్తారు. ఇప్పటికే చాలామంది ఐఏయస్ అథికారులు బలై, కోర్టుల చుట్టూ తిరుగుతున్నా, దానిని చూసి కూడా తెలిసికోలేని, తెలిసికోని ఉన్నత అధికారులు ఈసారి బలయ్యే అవకాశం మాత్రం ఉంది.

అందుకే మొదటిగా నేను చెప్పింది Karma is Bitch. ఏవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు. కత్తులతో అడేవాడు కత్తులకే బలవుతాడు. కర్మ ఏవరినీ వదలదు ఖర్మాయ్.

Center declared support prices to various agri products

–శింగలూరి శాంతి ప్రసాద్ (Shanti Prasad Singaluri), సీనియర్ న్యాయవాది, జనసేన లీగల్