Durga PoojaDurga Pooja

మహిషాసురుడు అంతనికే దుర్గావతారం

పూర్వం మహిషాసురుడు (Mahishasurudu) అనే పెద్ద రాక్షసుడు (Rakshasudu) ఉండేవాడు. మహిశం అంటే దున్నపోతు. దున్నపోతు రూపంలో ఉండడంవల్లనే మహిషాసురుడు అని పిలిచేవారు. ఇతడు రాక్షసులలో అతి బలవంతుడు. అందుచేతనే ఎలాగైనా ముల్లోకాలను జయించాలనే కోరిక మహిషాసురుడికి కలిగింది. దీనికోసం బ్రహ్మ దేవుని (Brahma) వరం కోసం ఘోరమైన తపస్సుని ఇతడు మొదలు పెట్టాడు. కొన్ని ఏళ్ళ పాటు ఘోరమైన తపస్సు చేయసాగాడు. మహిశాసురిని తపస్సుకి మెచ్చి బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఈ ప్రపంచంలోని ఏ పురుషుని చేతిలో నాకు చావు ఉండకూడదు అని మహిషాసురుడు బ్రహ్మ దేవుణ్ణి వరం కోరుకున్నాడు. ఆడవాళ్ళు తనని ఓడించలేరనే నమ్మకంతోనే మహిషాసురుడు ఇటువంటి కోరుకున్నాడు.

వరప్రసాదుడైన మహిశారుడి పీడన!

వరగ్రహీత అయిన మహిశారుడు ముల్లోకాలలో ఉన్న ప్రజలను పీడించడం మొదలు పెట్టాడు. సాక్షాత్తు బ్రహ్మ (Brahma), విష్ణు (Vishnu), మహేశ్వరులు (Maheswara) కూడా ఏమీ చేయలేక పోయారు. దీనితో బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించారు. మహిశాసురిడి చావు ఒక స్త్రీ చేతిలో ఉంది. కాబట్టి మనం అంతకంటే ఎక్కువ శక్తివంతురాలిని సృష్టించాలి అని వారు అనుకున్నారు. అలా సృస్టించబడినదే దుర్గాదేవి.

18 చేతులతో సిద్ధమైన దుర్గాదేవి

దుర్గా దేవి (Durga Devi) 18 చేతులతో సిద్దమైనది. ఆలా సిద్దమైనప్పుడు, యుద్ధానికి సరిపడా ఆయుధాలను దేవతలు అందించారు. విష్ణుమూర్తి (vishnu murthy) తన విష్ణు చక్రాన్ని, మహేశావరుడు త్రిశూలాన్ని, మహేంద్రుడు వజ్రాయుదాన్ని అందించారు. ఇలా అన్ని ఆయుధాలను ధరించిన దుర్గా దేవి, సింహాన్ని వాహనంగా చేసుకొని మహిషాసురుని మీదకు యుధ్ధానికి బయల్దేరింది. మహిషాసురుడు కూడా దుర్గా మాతను ఎదుర్కోవడానికి లక్షల సైన్యం తో వచ్చాడు.

సింహ వాహనధారి అయిన దుర్గా దేవి తన ఆయుదాలతో మహిషాసురుని లక్షల సైన్యాన్ని నాశనం చేసేసింది. అలా తొమ్మిది రోజులు భీకరంగా యుద్ధం కొనసాగింది. ఆ తరువాత దుర్గాదేవి మహిశాసురున్ని వధించడం జరిగింది. మహిశారుడు మరణించడంతో దేవతలు పండుగ జరుపుకున్నారు. ఈ విధంగా పండుగ చేసుకోవడమే విజయదశమికి నాంది అని పురాణాల ప్రకారం తెలుస్తున్నది. వారి ఇవువురి మధ్య యుద్ధం ఇలా 9 రోజులు జరగడంతో దానికి చిహ్నంగా మనం నవ రాత్రులను జరుపుకుంటున్నాం. తరువాత రోజునే మనం దసరా లేదా విజయదశమి (Vijaya Dasami) గా జరుపుకుంటాం.

చెడుపై మంచి గెలిచింది అనే దానికి నిదర్శనంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఒక మనిషికి ఎన్ని సుగుణాలు ఉన్నా ఒక దుర్గుణం ఉంటె చాలు. అది అతని వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది అని అనడానికి ఈ విజయ దశమి గాదని ఉదాహరణగా చెబుతూ ఉంటారు.

Spread the love