Pawan kalyanPawan kalyan

రాష్ట్ర ప్రయోజనాల కోసం చాలాసార్లు తగ్గాం
ఇప్పుడు మీరు తగ్గండి
2024లో జనసేన పార్టీయే ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది
వైసీపీ విచ్ఛిన్నకర పాలన పోవాలంటే అంతా ఏకమవ్వాలి
వైసీపీ తప్పులను చెప్పినవారినీ వర్గ శత్రువులుగా ప్రకటిస్తున్నారు
మహిళలను లక్ష్యం చేసుకొని వేధిస్తే సహించేది లేదు
శాంతిభద్రతలు బాగుంటే పెట్టుబడులు వాటంతట అవే వస్తాయి
అవినీతి ఆరోపణలపై జైలుకెళ్లిన వ్యక్తే అవినీతి అంతం అంటున్నాడు

ఇక తగ్గేదే లే అంటూ పొత్తులపై జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టత నిచ్చారు. మంగళగిరి విస్తృతస్థాయి సమావేశంలో జనసేన (Janasena) అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చంద్రబాబు (Chandra Babu) తేలికోలేని విధంగా స్పష్టం చేశారు అని చేప్పాలి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీనే (Janasena party) ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది అని పవన్ కుడ్డబద్దలు కొట్టినట్లు చెప్పారు. ప్రభుత్వాన్ని స్థాపించేది ఒంటరిగానా? లేక బీజేపీతో (BJP) కలిశా అన్నది కాలమే నిర్ణయిస్తుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.

2014లో రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ (TDP), బీజేపీతో (BJP) కలసి పని చేశామన్నారు. ఇప్పుడు జనసేన (Janasena) ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయనీ పవన్ చెప్పారు. ఒకటి బీజేపీ తో కలసి వెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. రెండవది జనసేన, బీజేపీ, టీడీపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. మూడవది జనసేన ఒక్కటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అని జనసేనాని తెలిపారు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనే బైబిల్ వాక్కును 2014, 19 సార్వత్రిక ఎన్నికల్లో పాటించామని, ఇప్పుడు రాష్ట్ర ప్రజల క్షేమం కోసం మిలిగిన పార్టీలు తగ్గితే బాగుంటుందని పవన్ పిలుపునిచ్చారు.

బహుజన సిద్దాంతంపై దాడి

రౌడీ మూక, గూండాల గుంపు అయిన వైసీపీ నాయకులు (YCP Leaders) పకడ్బందీగా రేపిన గొడవ కోనసీమ అల్లర్లు అని, ఇది ముమ్మాటికి జహుజన సిద్ధాంతం, ఐక్యతపై జరిగిన దాడిగానే జనసేన పార్టీ (Janasena Party) భావిస్తుందని జనసేనాని వైసీపీని దుయ్య బట్టారు. శనివారం సాయంత్రం మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ… “భారతదేశం కులాలతో నిర్మితమైన సమాజం. ఇక్కడి రాజకీయాలు కులాలతో ముడిపడి ఉంటాయి. ప్రస్తుత రాజకీయాలు (Current Politics) గుణ ప్రధానంగా కాకుండా కుల ప్రధానంగా సాగుతున్నాయి. కుల నిర్మూలనతోనే సమాజం బాగుంటుందని డాక్టర్ అంబేద్కర్ (Ambedkar) చెప్పారు. ఆయన వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకొనే పార్టీ ఏడు సిద్ధాంతాల్లో ఒకటిగా కులాలను కలిపే ఆలోచన విధానం అని పెట్టాను. కుల నిర్మూలన జరగాలంటే ముందు ఆ కులాల మధ్య ఐక్యత ఉండాలని నమ్ముతాను. అందుకే కోనసీమలో బలమైన సామాజిక వర్గాలైన కాపు (Kapu), శెట్టిబలిజ (Setty Balija), ఎస్సీ (SC) వర్గాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడానికి సమావేశాలు నిర్వహించాను. కుల నిర్మూలన అనేది ఒక్క రోజులో జరిగే ప్రక్రియ కాదు. కుల రాజకీయాలు చేయకూడదనే ఉద్దేశంతోనే 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి మద్దతు ఇచ్చాను.

మీరెంత రుద్దాలనుకొన్నా మాకు అంటుకోదు

వైకాపా (YCP) అనేది.. రౌడీల మూక, గూండాల గుంపు.. నిరసనలు జరుగుతుంటే హోం మంత్రి ఏం చేస్తున్నారు? గొడవలు జరగాలని వైకాపా నేతలు కోరుకున్నారు. కోనసీమలో ఉన్న చక్కటి వాతావరణాన్ని కలుషితం చేయాలని కంకణం కట్టుకున్నారు. కోనసీమ అల్లర్లతో జనసేనకు ఏదో అవుతుందనుకుంటే అది మీ తెలివితక్కువ తనమే.. నేను కులాలను కలిపేవాడిని.. విడదీసే వాడిని కాదు. మీరు ఎంత రుద్దాలనుకున్నా మాకు అంటుకోదు.

వైసీపీది విచ్ఛిన్నకరమైన ఆలోచన

దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉన్న సామాజిక వర్గాలన్నీ కలిసి ఒక తాటిపైకి రావడాన్ని జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు కోనసీమ అల్లర్లకు తెరలేపాయి. ఇది ముమ్మాటికీ జహుజన సిద్ధాంతం, ఐక్యత మీద జరిగిన దాడిగానే భావిస్తాం. వైసీపీ నాయకులది విచ్ఛిన్నకరమైన ధోరణి. కులాలు కుంపటి రాజేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. అందులో భాగంగానే శెట్టి బలిజలను వ్యక్తిగతంగా దూషించారు. రాజ్యాంగంపై గౌరవం ఉన్న ఏ వ్యక్తి కూడా జిల్లాకు అంబేద్కర్ పేరు పెడతామంటే గొడవ పెట్టరు.

ఇద్దరు స్థానిక వైసీపీ నాయకుల మధ్య గొడవను రాజకీయ లబ్ధికోసం వైసీపీ పార్టీ (YCP Party) ఈ స్థాయికి తీసుకెళ్లి… మంత్రి, ఎమ్మెల్యేలను బాధితులను చేసింది. పేరు మీరే ప్రతిపాదించి, గొడవలు మీరే సృష్టించి అమయకులైన జనసైనికులను అరెస్టు చేస్తున్నారు. అల్లర్లు జరుగుతాయని ముందే హెచ్చరికలు వచ్చినా హోమ్ మంత్రి, డీజీపీ (DGP), పోలీస్ వ్యవస్థ (Police Department) ఏం చేస్తున్నాయి. గొడవలు జరగాలని మీరు కోరుకున్నారు కాబట్టే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కులాలు, మతాల మధ్య గొడవలు పెట్టి లబ్ధిపొందాలని జనసేన పార్టీ ఏ రోజు భావించదు. నేను కులాలను కలిపే వాడినే తప్పితే విడదీసే వాడిని కాదు. అంబేద్కర్ గారిపై అభిమానం ఉంది కనుకే పోరాటయాత్రను విశాఖపట్నం అంబేద్కర్ భవన్ (Ambedkar Bhavan0 నుంచి ప్రారంభించాను. మా పార్టీ లీగల్ సెల్ కు అంబేద్కర్ లీగల్ సెల్ అని పేరు పెట్టుకున్నాం అని పవన్ విరుచుకు పడ్డారు.

ఆడబిడ్డలను అడ్డుపెట్టుకొని మాట్లాడవద్దు

ఒక విమర్శ వస్తే ఆడబిడ్డలను అడ్డుపెట్టుకొని మాట్లాడవద్దు. గొడవలను అడ్డుపెట్టుకొని, రాజకీయ వేధింపులకు దిగుతూ మహిళలను లక్ష్యంగా చేసుకొన్నా, వారి జోలికి వచ్చినా మేం ఏ మాత్రం సహించబోం. మా మీదకు వస్తే భరిస్తాం… మా పార్టీ మీద విమర్శలు చేస్తే సమాధానం చెబుతాం… అంతేగానీ మహిళలను లక్ష్యంగా చేసుకొని వేధిస్తే ఊరుకొనేది లేదు. గడప గడపకు కార్యక్రమంలో ధాన్యం కొనుగోలులో అక్రమాలను ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నంలో ప్రశ్నించిన మహిళపై దుర్భాషలకు దిగారు. ధాన్యం కొనుగోలులో అక్రమాల గురించి వైసీపీ ఎంపీయే స్వయంగా చెప్పారు. ఒక క్వింటాల్ బస్తా మీద రూ.వెయ్యికి పైగా అవినీతి చేస్తున్నారు అని తెలిసింది.

ఓటు వేయని వారిని వర్గ శత్రువులుగా ప్రకటించుకున్నారు

ఒక కులాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయలేము. అన్ని కులాలు ఓట్లు వేస్తేనే ఈ రోజు వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఒక రెడ్డి సామాజిక వర్గామో, ఎస్సీ సామాజిక వర్గ ఓట్లతోనో అందలం ఎక్కలేదు. అన్ని వర్గాలు కలిసి ఓట్లు వేస్తేనే అధికారంలోకి వచ్చారు. నిజంగా కాపుల మొత్తం జనసేన పార్టీకే ఓట్లు వేస్తే ఈ రోజు జనసేన పార్టీయే అధికారంలో ఉండేది. అధికారంలోకి రాగానే కమ్మ సామాజిక వర్గాన్ని వర్గ శత్రువుగా వైసీపీ ప్రకటించుకుంది. కమ్మవారి (Kamma votes) ఓట్లు కోసం ఈ మాట మాట్లాడటం లేదు. సమాజ హితవు కోరుకునే వాడిగా ఈ మాట చెబుతున్నాను. కమ్మ సామాజిక వర్గానికి చేయాల్సిన నష్టం అంతా చేసేసీ ఒక జిల్లాకు ఎన్టీఆర్ (NTR) పేరు పెడితే సరిపోతుందా?

వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడారని సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్టంరాజుపై (Raghu Rama Krishan Raju) మాటల దాడికి, కేసులతో దాడికి దిగి క్షత్రియ వర్గాన్ని వర్గ శత్రువులుగా ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో తమ వైసీపీ నాయకుల తప్పిదాలను ఎత్తి చూపించిన వైశ్య సామాజిక వర్గానికి చెందిన వైసీపీ సానుభూతిపరుడ్ని వేధించి వైశ్యులని వర్గ శత్రువులుగా ప్రకటించారు.

కోనసీమ ఘటనతో బీసీ వర్గాలను వర్గ శత్రువులుగా ప్రకటించారు. ఇప్పుడు పరిస్థితులను విశ్లేషిస్తే ఉభయ గోదావరి జిల్లాలను ఇక వైసీపీ మరచిపోవచ్చు.

అవినీతి ఆరోపణలతో జైలుకెళ్ళి…

వైసీపీ అధినాయకుడికి 44 ఏళ్లు ఉంటాయి. మరో పాతికేళ్లు రాజకీయ భవిష్యత్తు ఉంది. ఆయన నాన్న గారు ఉన్నత పదవిలో ఉన్నప్పుడు ఈయన బాగా సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ అవినీతి ఆరోపణలతోనే జైలుకు కూడా వెళ్లారు. ఇప్పుడు ఆయన అవినీతి అంతం చేస్తామని, దానికోసం ప్రత్యేక యాప్ లాంచ్ చేయడం విడ్డూరంగా ఉంది అని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు.

అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం  (abolition of liquor) అని చెప్పి ప్రభుత్వమే స్వయంగా రేట్లు పెంచి మరి మద్యాన్ని అమ్ముతోంది. ఒక ప్రైవేటు కంపెనీకి ఇసుక టెండర్ మొత్తం కట్టబెట్టి… దాని ముసుగులో మొత్తం డబ్బులు ఒకరి జేబులోకి వెళ్లేలా ప్లాన్ చేశారు. ఈ అవినీతి గురించి కూడా చెప్పాలి అని పవన్ డిమాండ్ చేశారు.

వైఎస్ఆర్సీపీ అంటే ఏమిటో తెలుసా?

వైఎస్ఆర్సీపీ (YSRCP) అంటే యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక యువజనులకు ఉద్యోగాలు లేవు. శ్రామికులకు ఉపాధి లేదు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని జనసేన పార్టీ స్వాగతిస్తుంది. అయితే కోనసీమ ప్రజలు అభిప్రాయాలను కూడా తీసుకోవాలి. ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కోనసీమ అల్లర్లు తాలుకా కోపతాపాలు తగ్గడానికి పార్టీ తరఫున శాంతి కమిటీలు వేస్తాం అని పవన్ (Pawan Kalyan) తెలిపారు.

బీజేపీతో కలిసి పని చేస్తాం

భారతీయ జనతా పార్టీతో (Bharateeya Janata Party) కలిసి ఎందుకు కార్యక్రమాలు చేయడం లేదు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కచ్చితంగా భారతీయ జనతా పార్టీ తో కలిసి కార్యక్రమాలు ఉంటాయి. నేను ఉమ్మడి సీఎం అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు ఎవరు నాకు చెప్పలేదు. కొన్ని వార్తా కథనాలు చూసి స్పందించడం తగదు. కచ్చితంగా భారతీయ జనతా పార్టీ తో కలిసి మా ప్రయాణం ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి రోడ్డు మ్యాప్ (Road Map) కూడా త్వరలోనే అందుతుంది అని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

బీజేపీ (BJP) జాతీయ నాయకులతో రాష్ట్రంలోని శాంతిభద్రతలు, అప్పులు, రాజకీయాలు ఇలా అనేక అంశాలపై ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉన్నాం. గెలుపు అనేది మన ఐక్యత మీద ఆధారపడి ఉంటుంది. కానీ చాలామంది ఎదుట వారి శక్తి అనుకుంటారు. కచ్చితంగా ఐక్యంగా పోరాడండి. పొరపొచ్చాలు లేకుండా గెలుపు కోసం పని చేద్దాం అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

అందరి అభ్యున్నతే జనసేన విధానం

సామాన్యునికి భారంగా, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కష్టంగా మారిన ఇసుకను జనసేన పార్టీ ప్రభుత్వంలో అల్పాదాయ వర్గాలకు ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ప్రతి ఏడాది లక్ష మంది యువతను వ్యాపారులుగా మలిచి, వారి ద్వారా ఉపాధి పొందే వారిని తయారు చేస్తాం. దీని కోసం జనసేన ప్రభుత్వంలో సౌభాగ్య నిధి కింద పదివేల కోట్ల రూపాయలు కేటాయిస్తాం. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని కచ్చితంగా రద్దు చేస్తాం. దీనికి జనసేన కట్టుబడి ఉంది. రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణం సరైన గిట్టుబాటు ధర రాక పోవడం.. జనసేన ప్రభుత్వంలో రైతుకు తాను పండించే పంటకు కచ్చితంగా మద్దతు ధర వస్తుంది. దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. ప్రజా సంక్షేమం లక్ష్యంగా జనసేన పార్టీ అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది అని జనసేనాని (Janasenani) వివరించారు.

పెట్టుబడులు రావాలంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

అదానీ, గ్రీన్ కో, అరబిందో వంటి సంస్థలతో ఎంఓయూ లు కుదిర్చుకునేందుకు దావోస్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడ ఒకరికి ఒకరు బొకేలు ఇచ్చుకుని, సూట్ లతో ఫోటోలు దిగడానికి ప్రజాధనం వృధా చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. రాష్ట్రం సమైక్యంగా ఉంటే పెట్టుబడులు అవే వస్తాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు చక్కగా ఉంటూ, లంచాలు అడగని ప్రభుత్వం ఉంటే, ఉద్యోగులకు భద్రత ఇచ్చే పాలన ఉంటే, ముఖ్యంగా ఆడబిడ్డలకు రక్షణ ఇచ్చి వారికి ఆర్థిక స్వావలంబన చూపే పాలన వుంటే విదేశీ పెట్టుబడిదారులు వారే వస్తారు. రాష్ట్రంలో వద్దన్న పెట్టుబడులు పెడతారు. చక్కగా ఉపాధి మార్గాలను సృష్టిస్తారు. దానిని ప్రస్తుత పాలకులు తెలుసుకోవాలి. అలా కాకుండా దావోస్ కు వెళ్లి ఎంఓయూ అంటే పరిశ్రమలు రావు అని పవన్ తెలిపారు.

భావోద్వేగాలు తగ్గించుకోండి

రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో కొన్ని అసహజ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు కులాలు, భావోద్వేగాలతో రగిలి పోతున్నారు. దీనివల్ల వ్యక్తిగతంగా గాని రాష్ట్రానికి గాని ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అణువులన్నీ కలిసి అణుశక్తి గా ఏర్పడితే దాని విస్పోటనం ఎంతగా ఉంటుందో, ప్రజలంతా కలిసి అణుశక్తి గా మారితే అంతటి శక్తి సాధ్యం. దీనిని గుర్తుంచుకోవాలి. శత్రు దేశాల సైనికులే పరస్పరం మిత్రులుగా మారి పోతున్న సమయంలో ఆంధ్రాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అంతా ఒక్కటి అవుదాం. కులాలు, మతాల కుంపట్లలో మనం ఉంటే కొందరు దాన్ని మంచి అడ్వాంటేంజ్ గా తీసుకుని ఆడుకుంటారు.. గుర్తుంచుకోవాలని” అని జనసేనాని అన్నారు.

అవినీతి నిర్మూల‌న‌కు ఏసీబీ 14400 యాప్‌

Spread the love