Ambati RambabuAmbati Rambabu

కూల్చి పారదొబ్బడానికి ఇదేమన్నా సినిమా సెట్టింగా: అంబటి

ఇప్ప‌టం గ్రామంలో అక్రమ ప్రహరీలు కూలిస్తే ప్రభుత్వాన్ని కూల్చాలా? అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను (Pawan Kalyan) ప్ర‌శ్నించారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటం గ్రామాన్ని (Ippatam Village) జనసేన (Janasena) అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఒక ఉన్మాదిలా, బరి తెగించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చి పారదొబ్బండి అని కూడా అన్నారు. అంటే ఆయన ఎంత ఫ్రస్టేషన్‌లో ఉన్నాడో, ఎంత అవివేకంగా ఉన్నాడో, ఎంత అర్థ రహితంగా ఉన్నాడో ఆ ఒక్క మాటతోనే అర్ధం అవుతుంది. గత నెల 17వ తేదీన కూడా దాదాపు అలాగే మాట్లాడాడు అని అంబటి రాంబాబు ఆరోపించారు.

కూల్చి పారదొబ్బడానికి ఇదేమన్నా సినిమా సెట్టింగా? షూటింగ్‌ కాగానే కూల్చి వేయడానికి. ఇది ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వం. అది ప్రజలకు మాత్రమే ఉంది. కానీ ఆ ఎన్నికలకు ఇంకా చాలా దూరం ఉంది. ఆలోగానే చంద్రబాబు సహకారంతో ఈ ప్రభుత్వాన్ని కూల్చేయాలని ఒక ఉన్మాదిలా పవన్‌ మాట్లాడుతున్నాడు అని అంబటి రాంబాబు జనసేనానిపై విరుచుకు పడ్డారు.

కూల్చివేతలు అంటూ పవన్ పిచ్చి కూతలు-బాబు చెత్త ట్వీట్లు: జోగి రమేష్

చంద్రబాబు- పవన్ కల్యాణ్ కుట్ర రాజకీయాల్లో భాగంగానే.. పార్ట్‌–1 రెక్కీ, పార్ట్‌ –2 రాయి, పార్ట్‌–3 ఇప్పటంలో పిచ్చి కల్యాణ్ పిచ్చికూత‌లు మూడు రోజులుగా ఒక సీరియ‌ల్ ప్ర‌కారం న‌డుస్తున్నాయ‌ని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్ (Jogi Ramesh) అన్నారు. ఇప్పటంలో ఒక్క ఇల్లు కూడా తొలగించలేదన్నారు. రోడ్డు విస్తరణ కోసం ఆక్రమణలు మాత్రమే తొలగించామ‌ని స్ప‌ష్టం చేశారు. రోడ్ల నిర్మాణంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. పవన్‌ కల్యాణ్‌ పనికిమాలిన పిచ్చి కూతలు కూస్తున్నాడని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నాడని జోగి రమేష్ మండిప‌డ్డారు.

సానుభూతి కోసమే చంద్రబాబు, పవన్‌ తాపత్రయం: వెల్లంపల్లి శ్రీనివాస్

ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేనఅధినేత పవన్‌ కళ్యాణ్‌లు సానుభూతి కోసం తాపత్రయ పడుతున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ (Vellampalli Srinivas) మండిపడ్డారు. పవన్‌ లేఖ ఇవ్వడం..చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టడం, అసాంఘిక కార్యక్రమాలు సృష్టించడం అలవాటైపోయిందని ధ్వజమెత్తారు. రెండు చోట్ల ఓడిపోయిన పవన్‌ మాకు పోటీనా అని ఎద్దేవా చేశారు. ఎక్కడ పోటీ చేస్తాడో తెలియని పవన్‌ గురించి ఎవరైనా ఆలోచిస్తారా అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు.

పోలీసు ఆంక్షలు-పూలవర్షం మధ్య సేనాని ఇప్పటం పర్యటన