Telanagana MapTelanagana Map

ఓం యంత్ర తంత్రాయ నమః అని EVM దేవుళ్ళ అనుగ్రహం కోసం జపిస్తున్న దొర సారు?

అరవంత్ రెడ్డి అనే నేను… అంటూ పదవీ స్వీకారానికి ప్రాక్టీస్ మొదలు పెట్టేసిన హస్తం అధినేత అరవంత్ సారు?

మాకు డిపాజిట్లు రాకపోయినా పరవాలేదు. కానీ కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రాకూడదు అని హోమాలు చేస్తున్న పువ్వు పార్టీ?

నేను మంత్రిని కాక పోయినా పర్వాలేదు, మా బుడ్డోడు సీఎం కాకూడదు అని అసమ్మతి ప్రెస్ మీట్లకు సిద్ధమవుతున్న హస్తం పార్టీలోని పెద్ద తల కాయలు?

ఢిల్లీకి వెళ్లి అధిష్టానం అనుగ్రహం కోసం సిద్దమవుతున్న కర్మిల అక్క.

ఏ పార్టీకి అధికారం వస్తాది నో, ఎవరు సీఎం అవుతారో. అందరికంటే ముందుగా ఎలా వెళ్లి ప్రసన్నం చేసుకోవాలో అర్థం కాక సతమతం అవుతున్న బ్యూరో క్రాట్స్.

ఏ పార్టీ వస్తాది. ఏ పార్టీకి అనుకూలంగా మనమే అందరి కంటే ముందు బాకాలు వూదడం మొదలు పెట్టాలో అని సన్నద్ధం అవుతున్న మీడియా సంస్థలు.

ఇదిగో ఎన్నికల ఫలితాల కోసం టీవీ చూసి చచ్చింది చాలు. ఈ పార్టీ వచ్చినా కిలో చికెన్ కూడా ఇచ్చి సచేది లేదు గానీ, పోయి చికెన్ గట్రా తీసికొని రా అని పెళ్ళాం సతాయింపులు భరించ లేని మొగుళ్ళు.

ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నా కులి పనిలో మార్పు లేదు. నా బిక్షటనలో మార్పు లేదు అని తమ పనులకు తాము సిద్దమవుతున్న సగటు కూలీ/ బిక్షగాల్లు.

ఆలోచించండి… నిన్నటి వరకు పాలిస్తున్న దొరకి ఫార్మ్ హౌస్ తప్ప సెక్రటేరియట్ ఎక్కడ ఉందో కూడా తెలీదు? కనీసం నేడు గెలవబోతున్న కొత్త దొర అయినా ఫార్మా హౌజ్ దాటి వచ్చి పాలన చేస్తాడా లేక ఢిల్లీ చుట్టూ మాత్రమే చక్కర్లు కొడుతూ ఉంటాడా? (It’s from Akshara Satyam)

గమనిక: సమకాలీన రాజకీయాలు, ఎన్నికల సరళిపై వూహించి రాసిందే తప్ప ఎవ్వరినీ ఉద్దేశించి కాదు.

బాధితుల ఆశలసౌధం జనసేనానికి అక్షర సందేశం

Spread the love