నాడు నీ టాలెంటుతో విలక్షణ నటుడువి అయ్యావు
నేడు పెద్దరికపు పిచ్చితో ఏకాకివి అయ్యావు
పెద్దరికం అనేది భ్రమ – టాలెంటు అనేది వాస్తవం
వాడుకొనే అంకుల్స్ కంటే ఆదుకొనే ప్రేక్షకులు ముద్దు
మోహన్ బాబు (Mohan Babu) మంచి నటుడు. చక్కటి డైలాగ్ డెలివరీ. కొన్ని కొన్ని క్యారెక్టర్స్ అయన తప్ప వేరే వారు చెయ్యలేరు అనే మ్యానరిజం ఉన్న ఒక గొప్ప నటుడు. అయితే అయన సన్ అఫ్ ఇండియా (Son of India) సినిమా (Cinema) మంచి టాక్ తెచ్చుకోలేదు అని తెలుస్తున్నది. ఇది ఆయన నోటి దురుసుతనం. వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్న అతి. వెరసి ఇది వారి స్వయంకృతాపరాధం అని సోషల్ మీడియా (Social Media) నేడు కోడై కూస్తున్నది.
సినిమా ఫెయిల్ అవ్వడం సహజం. తప్పు కాదు. అది ట్రోల్ చెయ్యాల్సినంత బూతు కాదు. ప్రతీ హీరో, నిర్మాత జీవితంలో ఫెయిల్యూర్స్ ఉంటాయి. భాధ పడకుండా మరొక హిట్ కోసం ప్రయతించాలి. అయితే ఆ తపన కసి మోహన్ బాబు ఫామిలీ ఉన్నట్లు నేడు కనపడడం లేదు. తప్పులు ఎక్కడ దొర్లుతున్నాయి అనే వాస్తవాన్ని అయన తెలిసికొన్నట్లు అనిపించడం లేదు.
ఒకప్పుడు కసితో, పట్టుదలతో, తనలో ఉన్న టాలెంటుకి పదును పెట్టాడు. విలక్షణ నటుడయ్యాడు. కలెక్షన్ కింగ్ (Collection King) అయ్యాడు. కానీ నేడు పెద్దరికం అనే బోర్డు కోసం వెంపర్లాడుతూ టాలెంటుని మరుగున పెడుతున్నాడు. దురుసు మాటలతో జనాల్లో పలుచనై పోతున్నాడు. సన్ అఫ్ ఇండియాకి వచ్చిన ఆదరణే దీనికి సజీవ సాక్ష్యం అని మన కలెక్షన్ కింగ్ తెలుసుకోగలగాలి.
మన చిరకాల ప్రత్యర్థులను తిట్టినంత మాత్రాన మన సినిమాలు హిట్ కాలేవు. మన చిరకాల ప్రత్యర్థులను గట్టిగా తిడితే కొన్ని పార్టీలకు మనం దగ్గర కావచ్చు. తద్వారా మనకి కొన్ని పెద్ద పదవులు దక్కవచ్చు. కానీ మన సినిమాలకు జనాలు మాత్రం రాలేరు. జనాలు రావాలంటే టాలెంటుతో పాటు, ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. సహనమే విజయానికి సోపానం. అంతే గాని పెద్దరికం అనే బోర్డులు మేడలో పెట్టుకొని తిరిగితే విజయం సాధించలేము అనేది మంచు ఫామిలీతో పాటు ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి.
ఒక సినిమా ఫెయిల్ అయితే ఆ నిర్మాత కుటుంబం ఎంత కష్టాలు పాలవుతుందో చాలా దగ్గరగా చుసిన వాడిని.
ఒక సినిమా హిట్ (Cenema Hit) అయితే మరొక సినిమా వస్తుంది. దానితో ఎన్నో కుటుంబాలకి ఉపాధి దొరుకుతుంది. ప్రతీ సినిమా హిట్ అవ్వాలి. అప్పుడే సినిమా రంగం బతికి బట్టకడుతుంది.
కానీ సినిమా తీస్తున్నాను కదా అని కన్ను మిన్ను కాకుండా రెచ్చిపోకూడదు అని మంచు ఫామిలీ కూడా తెలిసికోవాలి. ఒక కళాకారుడికి అహం ఉంటే ఆ కళాకారుడు నిలదొక్కుకోలేడు. ప్రేక్షకుల ఆదరణ కూడా పొందలేడు. రాజకీయాలు వేరు సినిమా వేరు అని మంచు ఫామిలీ నేటికైనా తెలిసికోవాలి.
వాళ్ళ నుండి మరిన్ని సినిమాలు రావాలి. అవి మంచి పేరు తెచ్చికోవాలి. అలా జరగాలి అంటే కళాకారుడు భూమికి ఒదిగి ఉన్నప్పుడే ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తారు అని మంచు ఫ్యామిలి ఇప్పటికైనా తెలిసికోవాలి.
పెద్దరికపు పిచ్చితో ఏకాకివి?
సినిమా పెద్దని అవ్వాలి అనే ఆశ మీకు ఉందొ లేదా అనే దాన్ని చంటి కుర్రోడిని అడిగినా చెబుతాడు. అందుకే మీ మీద ఇంత విపరీతమైన ట్రోలింగ్ జరుగుతున్నది. ఇది మీరు తెలిసుకొని మసలుకోవాలి. కానీ అలా జరగడం లేదు.
గురువు దాసరి (Dasari Narayana Rao) కుటుంబానికే మీరు పెద్దవి కాలేక పోయారు. వారి ఆస్తుల గొడవలను తీర్చలేక పోయారు. ఒక కుటుంబానికే పెద్ద కాలేక పోతే మొత్తం సినిమా పరిశ్రమకి ఎలా పెద్ద కాగలుగుతారు అని సోషల్ మీడియా గొగ్గోలు పెడుతున్నది. ఇది గమనించండి.
అయినా నేను పెద్దని. నేను పెద్దని అని చెప్పుకొంటే పెద్దరికం రాదు. కొనుక్కొంటే అధికారం కొనుకొంటే వస్తుందేమో గాని పెద్దరికం అలా రాదు. మన ప్రయత్నాలు మనం చేసుకొంటూ అందరితో మంచిగా ఉంటూ ముందుకు సాగాలి. అప్పుడు సినిమా పరిశ్రమే మన దగ్గరకు రావచ్చు. కానీ అందుకు ముందు మనం కఠోర పరిశ్రమ చెయ్యాలి. టాలెంటుని నమ్ముకోవాలి. కానీ అహంకారాన్ని కాదు అని మంచు ఫామిలీతో పాటు అందరూ గమనించాలి.
చివరగా ఒక్క మాట:
మనల్ని వాడుకొనే అంకుల్స్, బావలు ఎంతోమంది ఉండవచ్చు. వాళ్ళు ఎన్ని పదవులు అయినా కట్టబెట్టగలరు. లేదా ఉపశమనానికి కొబ్బరి బొండాలు అయినా పంపగలరు? కానీ మన సినిమాకి జనాన్ని మాత్రం పంపలేరు అని ఇప్పటికైనా అర్ధం చేసికోవాలి.
పెద్దరికంతో సినిమాలు హిట్ కాలేవు. మన సినిమాకి జనం కావాలి అంటే మనలో టాలెంటు అయినా ఉండాలి. లేక మన సినిమాలో కంటెంట్ అయినా ఉండాలి. లేదా ప్రేక్షక దేవుళ్ళకి ఒదిగి అయినా ఉండాలి అనేది మంచు ఫామిలీ సాక్షిగా ప్రతీ కళాకారుడు ఎంత తొందరగా తెలుసుకొంటే అంత మంచిది?
ప్రేక్షక దేవుళ్ళు దయ ఉంటేనే మన సినిమా ఆడుతుంది అనే సత్యాన్ని మరిచి కన్ను మిన్ను కాకుండా మాట్లాడితే ఇలానే ఉంటుంది. ఇది మంచు ఫామిలీకే కాదు ప్రతీ ఒక్కరికీ వర్తిస్తుంది అని గమనించాలి. ఆలోచించండి.