టోక్యోలో జరిగిన ఒలింపిక్స్’లో పి వి సింధు (P V Sindhu) కాంస్యం పధకం సాధించింది. రాబోయే ఒలింపిక్స్’లో పసిడిని ముద్దాడుతుందా? బంగారు పథకాన్ని (Gold Medal) సాధించాలి అనే కలను సింధు నెరవేర్చుకుంటుందా? లేదా అనే విషయాన్నీ పక్కన పెడితే, సింధుని అభినందించాలి. వరుసగా రెండు ఒలింపిక్స్’లలోను రెండు పధకాలను సింధు సాధించింది. అయిదేళ్ల క్రితం రియోలో ఫైనల్లో మారిన్ చేతిలో ఓడి రజిత పధకాన్ని దేశానికి అందించింది. టోక్యోలో కాంస్యంతో మరోసారి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. ఒలింపిక్స్‌లో (Olympics) సింధు పసిడి కల తీరేందుకు మరో అవకాశం కనిపిస్తోంది. కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడ్డ టోక్యో క్రీడలు 2021లో జరగడంతో.. 2024లో ఆరంభమయ్యే పారిస్ ఒలింపిక్స్‌కు ఇంకో మూడేళ్ల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం 26 ఏళ్లున్న సింధుకు… అప్పటికీ 29 ఏళ్లు వస్తాయి. ప్రస్తుత ఫామ్, ఫిట్‌నెస్ చూస్తుంటే ఆమె పారిస్ ఒలింపిక్స్’లోను స్వర్ణానికి పోటీదారే అని అనడంలో ఆశించ వచ్చు.
ఇది ఇలా ఉండగా దేశ నలుమూలలనుండి పి వి సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.