ఆంధ్రాలో (Andhra) కాంగ్రెస్ పార్టీ (Congress Party) మనుగడ సాధించాలి అంటే కాపులకు పీసీసీ అధ్యక్ష పదవి (PCC President) నివ్వాలి. కాంగ్రెస్ తన తప్పులను సరిదిద్దుకోవాలి. లేకపోతే ఏపీలో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించలేదు.
ఆంధ్రాలో, దేశంలో కాంగ్రెస్ పరిస్థితి నేడు అంతంత మాత్రంగానే ఉంది. తెలంగాణా విభజన (Division of AP) తర్వాత నేటి వరకు కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని నిలబెట్టుకోలేక పోతున్నది.
2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 44 స్థానాల్లో మాత్రమే జాతీయ కాంగ్రెస్ పార్టీ (National Congress) గెలిచింది. దేశంలోని 19.5 శాతం ఓట్లను మాత్రమే కాంగ్రెస్ పార్టీ సాధించింది.
2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 52 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో 19 శాతం మాత్రమే దేశం మొత్తం మీద ఓట్లు పడ్డాయి.
ఏ.పి.లో శాశన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కు ఒక్క సీటు కూడా రాలేదు.
కాపులను (Kapu) విస్మరించిన కాంగ్రెస్ పార్టీ
1988లో విజయవాడ కాంగ్రెస్ శాశన సభ్యులు వంగవీటి మోహన రంగా రావు (Vangaveeti Mohana Ranga) హత్య జరిగింది. ఆ తరువాత 1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ సాధించిన ఈ విజయం కాపులు కాంగ్రెస్’కి ఇచ్చిన మద్దతుపైన అనే విషయాన్నీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గమనించలేదు. కాపులను నాడు మరిచిపోయింది.
ఓటింగ్ లో 28శాతం ఉన్న కాపులను పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం నాడు ఇష్టం చూపలేదు.కేవలం రెండు, మూడు శాతం ఉన్న మున్నూరు కాపు, తూర్పు కాపు లకు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చి బి.సిలకు ఇచ్చినట్లు గొప్ప గా ప్రచారం చేసుకుంది. కానీ వారు కాపులపై ప్రభావం చూపలేక పోయారు. స్వాతంత్ర్య సమర కాలంలో మాత్రమే మల్లి పూడి మంగపతి పల్లంరాజుకు పిసిసి అధ్యక్ష పదవి దక్కింది. ఆ తరువాత కాపులకు పీసీసీ అధ్యక్ష పదవి నివ్వలేక పోయింది.
ఆ తర్వాత కాపులను ఎఐసిసి విస్మరించింది. వి.హనుమంతరావు,డి, శ్రీనివాసు, పొన్నాల లక్ష్మయ్య, బొత్స సత్యనారాయణలకు మాత్రమే పిసిసి అధ్యక్ష పదవి లభించింది.
1989 ఎన్నికల ఫలితాలు అనంతరం కాపులకు పిసిసి అధ్యక్ష పదవిని కట్టబెట్టలేదు.
గత 33 సంవత్సరాలుగా ఎపి విషయం లో కాంగ్రెస్ చారిత్రాత్మక తప్పిదమే చేసిందని చెప్పవచ్చు.
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో గోదావరి జిల్లాలలో ఉన్న కాపులకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే కాంగ్రెస్ పరిస్థితి మెరుగు పడవచ్చు. 2024 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని పుంజుకోవాలంటే ప్రస్తుతం అధిష్టాన వర్గానికి అత్యంత సన్నిహితంగా ఉన్న మల్లిపూడి మంగపతి పళ్లంరాజు (కాకినాడ), కెబిఆర్ నాయుడు (అమలాపురం) లలో ఒకరిని పిసిసి అధ్యక్షులుగా నియమిస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు పెరుగుతుంది.
పల్లం రాజుకి కాంగ్రెస్ హై కమాండ్’తో మంచి సంబంధాలు ఉన్నాయి. పళ్లంరాజు తాత పెద్ద పళ్లంరాజు, తండ్రి సంజీవ రావు కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు అనే మంచి పేరు కూడా ఉంది.
కాపు సంఘాలతో విస్తృతంగా సంబంధాలు
అలానే వీరి ఇద్దరికీ కూడా కాపుల సమస్యలపట్ల అవగాహన ఉంది. గత మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో వివిధ కాపు సంఘాలతో విస్తృతంగా సంబంధాలు కలిగి ఉన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలతో సత్ సంబంధాలు కలిగి ఉన్నారు. వీరు ఇరువురిలో ఒకరిని పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తే 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకు మనుగడ ఉండే అవకాశాలు ఉన్నాయి.
రాష్ట్రంలోని మెజారిటీ సామజిక వర్గాలను కాంగ్రెస్ దశాబ్దాలుగా విస్మరిస్తూ వచ్చింది. కొద్దీ శాతమే ఉన్న ఒక వర్గానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తూ వచ్చింది. ఇప్పటికైనా కాంగ్రెస్ తాను చేసిన చారిత్రాత్మక తప్పిదం నుండి బయట పడాలి. రాష్ట్రంలోని మెజారిటీ వర్గమైన కాపు, తెలగ, బలిజ ఒంటరి లాంటి సామజిక వర్గాలను దగ్గర చేసికొనే ప్రయత్నాలను కాంగ్రెస్ ఇప్పటికైనా చేస్తుందని ఆశిద్దాము.
అయితే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పళ్లంరాజుకి ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం అనేక పర్యాయాలు గతంలో అడగడం జరిగింది. పళ్లం రాజుకి ఇష్టం లేకపోవడం వల్లనే వేరే వ్యక్తులకు ఇవ్వడం జరిగింది అని గమనించగలరు. పళ్లంరాజు ఏపీ కాంగ్రెస్ అధినేతగా ఈ సారి అయినా తీసికొంటే కాంగ్రెస్ పార్టీ భవితకు మంచిదని భావిస్తున్నాం.
–టి వి గోవిందరావు, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్