Udyogula dharna at VJAUdyogula dharna at VJA

ఎక్కడికక్కడే పోలీసుల అడ్డగింపులు?
అయినా వేలాది మందితో ధర్నా
చివరకు చేతులెత్తేసిన పోలీసులు!

దద్దరిల్లిన ఉద్యోగుల ధర్నా
విజయం దిశగా ఉద్యోగుల ధర్నా

ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఛలో విజయవాడ (Chalo Vijayawada) విజయవంతం అయ్యింది. ఉప్పెనలా తరలివచ్చిన ఉద్యోగులతో వీరు తలపెట్టిన ధర్నా (Dharna) గొప్ప సక్సెస్ అయ్యింది. దశాబ్ద కాలంలో ఆంధ్రాలో విజయం సాధించిన ధర్నాగా దీన్ని చెప్పాలి. నాటి తెలుగుదేశం (Telugudesam), నేటి వైసీపీ (YCP) ప్రభుత్వాల అణచివేతలకు భయపడి ఉద్యమాలు విఫలం అవుతూ వచ్చాయి. అయితే నేటి ఉద్యోగుల, ఉపాధ్యాయుల ధర్నా ఉద్యమాలకు, ధర్నాలకు ఒక ఊపుని ఇచ్చింది అని చెప్పాలి.

పోలీసులతో ఎక్కడికక్కడ అష్టదిగ్బంధనం చేసినప్పటికీ, ఉద్యోగులతో బెజవాడ (Bezawada) నగరం కిక్కిరిసిసోయింది. ఉద్యోగస్తులు భారీగా తరలిరావడంతో బి.ఆర్.టి.ఎస్ రోడ్డు పొడవునా సుమారు మూడున్నర కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఉపాధ్యాయులు (Teachers), ఉద్యోగులతో (Employees) రహదారులు మూసుకుపోయాయి. దీంతో పోలీసులు పలు మార్గాలు నుంచి ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. చివరకు చేసేది లేక పోలీసులు కూడా చేతులు ఎత్తేసినట్లు తెలుస్తున్నది.

ఛలో విజయవాడ విజయవంతం

ఉద్యోగులది బల ప్రదర్శన కాదని. ఇది మా ఆవేదన అని ఉద్యోగుల సంఘ నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినప్పటికీ మా చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అయ్యింది అని ఉద్యోగ సంఘ నాయకులూ ప్రకటించారు.

ప్రభుత్వం దిగివచ్చే వరకు మా ఈ ఉద్యోగుల ఉద్యమం కొనసాగుతుందని పీఆర్సీ సాధన సమితి నాయకులూ వెంకట్రామి రెడ్డి అన్నారు.

ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవాలని పీఆర్సీ సమితి (PRC samithi) నేత బండి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

ధర్నా విజయంపై సీఎం…?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్ (Y S Jagan) పోలీసు ఉన్నతాధికారులపై సీరియస్ అయిఉండవచ్చు అని తెలుస్తున్నది. విజయవాడకు (Vijayawada) భారీగా ఉద్యోగులు తరలి రావడంతో పోలీసుల వైఫల్యమే కారణమని జగన్ (Jagan) అభిప్రాయపడినట్లు సమాచారం అందుతున్నది? దాదాపు పది హేను రోజుల ముందే ఉద్యోగులు ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపు నిచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. ప్రభుత్వ పెద్దలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇంటలిజెన్స్ ఏమైనట్లు?

ఎన్ని నిర్బంధాలు పెట్టినప్పటికీ, ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు విజయవాడ చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బల ప్రదర్శన చేశారు. దీన్ని పోలీసు వైఫల్యంగానే పరిగణించాలని చెబుతున్నారు. దీనిలో ప్రభుత్వ, పోలీసు వైఫల్యం ఉందా అనేది చూడాలి. వైఫల్యం ఉంటే ఈ వైఫల్యానికి బాధ్యులను గుర్తించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. దీనిపై మరికాసేపట్లో ప్రభుత్వ పెద్దలు సమీక్ష జరిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.

రాజ్యాంగం రద్దుకు దొరలు కుట్ర పన్నుతున్నారా?