Modi struck in traffic-fModi struck in traffic-f

ఫ్లైఓవర్‌పై నిలిచిపోయిన కాన్వాయ్‌..
ఘటనపై కేంద్ర హోం శాఖ సీరియస్‌
తీవ్ర భద్రతా లోపమని ఆగ్రహం
ప్రాణాలతో బఠిండా చేరుకున్నా
మీ సీఎంకు ధన్యవాదాలు: మోదీ

ఫ్లైఓవర్’పై ప్రధాని మోదీ (Prime Minister Modi) కాన్వాయ్ (Canvoy) నిలిచిపోవడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. మన దేశప్రధాని (India Prime Minister మార్గ మధ్యంలో 20 నిముషాలు పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

ఆ గందరగోళం మధ్యనే మోదీ (Modi) వెనుతిరిగారు. పంజాబ్‌ (Punjab) పర్యటనలో ప్రధానికి నిరసనల సెగ తగిలింది. భగత్‌సింగ్‌కు (Bhagat Singh) నివాళులు అర్పించేందుకు ప్రధాని (Prime Minister) వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఆందోళనకారులు బైఠాయించడంతో ఆయన కాన్వాయ్‌ ఫ్లైఓవర్‌పై ఆగిపోయింది. బ్లాకేడ్‌ను తొలగించకపోవడంతో ఆయన అక్కడకు వెళ్లకుండానే వెనుతిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఫిరోజ్‌పూర్‌ (Firozpur) ర్యాలీకి కూడా హాజరు కాలేకపోయారు. దేశ చరిత్రలో ఏ ప్రధానికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు అని భావన.

పంజాబ్‌ ప్రభుత్వంపై (Punjab Government) కేంద్ర హోం శాఖ Central Home Ministry)  ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇది తీవ్ర భద్రతాలోపమేనని ఆరోపించింది. దీనిపై వివరణివ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా కేంద్ర హోమ్ శాఖ ఆదేశించింది. అయితే ఫిరోజ్‌పూర్‌ ర్యాలీ ఫ్లాప్‌ అయ్యింది. మోదీ సభలో జనం లేకపోవడం వల్లే వెనక్కి వెళ్లారని పంజాబ్‌ ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) వర్గాలు ఆరోపిస్తున్నారు.

రూ.వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి.. శంకుస్థాపనలు చేయడానికి ఆయన ఉదయం బఠిండా విమానాశ్రయంలో దిగారు. తొలుత భగత్‌సింగ్‌ (Bhagat Singh) తదితర అమరవీరుల జాతీయ స్మారక మందిరం వద్ద నివాళులు అర్పించేందుకు హెలికాప్టర్లో హుస్సేనీవాలాకు వెళ్లాల్సి ఉంది. అక్కడి నుంచి ఫిరోజ్‌పూర్‌ సభకు బయల్దేరాలి. కానీ వర్షం, పొగమంచు ఉండడం, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఎయిర్‌పోర్టులోనే కొద్దిసేపు వేచిచూశారు. చివరకు రోడ్డుమార్గాన స్మారకం వద్దకు వెళ్లాలని నిర్ణయించారు.

రోడ్డు ప్రయాణానికి రెండు గంటల సమయం పడుతుంది. అన్ని భద్రతా ఏర్పాట్లు (Security arrangements) చేశామని పంజాబ్‌ డీజీపీ (DGP) తెలపడంతోనే మోదీ కాన్వాయ్‌ అక్కడకు బయల్దేరింది. మెమోరియల్‌కు (Memorial) కొద్ది దూరంలో ఉండగా కాన్వాయ్‌ ఓ ఫ్లైఓవర్‌పైకి చేరుకుంది. అయితే కొందరు ఆందోళనకారులు ఆ రోడ్డును బ్లాక్‌ (Road Block) చేయడంతో 15-20 నిమిషాలు ప్రధాని ఫ్లైఓవర్‌పైనే ఉండివలసి వచ్చింది. ప్రధాని భద్రతా ఏర్పాట్లలో పంజాబ్‌ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. ఈ కారణంగా మెమోరియల్‌ వద్దకు వెళ్లకుండానే వెనక్కి మళ్లాలని కాన్వాయ్‌ నిర్ణయించింది. ఫిరోజ్‌పూర్‌ ర్యాలీకి కూడా ప్రధాని వెళ్లలేకపోయారు అని కేంద్ర హోం శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

బండి సంజయ్‌ జైలు నుండి విడుదల

Spread the love