అణగారిన వర్గాల పరిరక్షకా! ఓ జనసేనాని (Janasenani Pawan Kalyan)
అటి మొన్నటి (2014) మీ త్యాగం మీకు రాజకీయాలు (AP Politics) అర్ధంకాక అనుకొన్నారు.
మొన్నటి (2019 ) మీ త్యాగం మీకు క్షుద్ర రాజకీయాలు (Cunning Politics) అవగాహన కాక అని సరిపుట్టుకొన్నారు.
నిన్నటి (2024 లో 21 కే సరిపెట్టుకోవడం) మీ త్యాగం రాజ్యాన్ని పట్టి పీడిస్తున్న రాక్షస పాలన అంతానికి మీ బలిదానం అని సర్ది చెప్పారు. అన్నగారైన వర్గాలు సర్దుకు పోయాయి కూడా…
కానీ కానీ కానీ…
నేటి మీ త్యాగం ఏదైనా ఉంటే, మీరు మరిన్ని త్యాగాలు చేయబోతే, అది ముమ్మాటికీ అణగారిన వర్గాల (Suppressed classes) చేతకాని తనమే కావచ్చు. మిమ్ములను నమ్ముకొన్న వర్గాల ఆశనిపాతమే అవ్వచ్చు.
సర్వసంగ పరిత్యాగులుగా మీకు రాజ్య కాంక్ష లేక పోవచ్చు. కానీ మేము సర్వ నాశనం అయిన బాధితులుగా మాకు ముమ్మాటికీ రాజ్య కాంక్ష ఉంది. మీ ద్వారా మార్పు రావాలనే కోరిక ఉంది అని మిమ్ములనే నమ్ముకొన్న అణగారిన వర్గాలు భావిస్తున్నాయి.
ఆలోచించండి… ఇది అక్షర సత్యం ఆవేదన కాదు. సమస్త తాడిత పీడిత బాధిత వర్గాల ఆక్రందన. (It’s from Akshara Satyam)