Mudragada nippuMudragada nippu

ముద్రగడ (Mudragada) భోళా శంకరుడు (Bhola Shankar). నిప్పులాంటోడు. ఏ శత్రువు అయినా ఆ నిప్పుతో తన “చుట్ట” అయిన కాల్చుకోవాలని చూస్తాడు. లేదా పక్కోడి కొంప అయినా తగుల బెట్టాలని చూస్తాడు. నిప్పులాంటి ముద్రగడ విషయంలో అదే జరుగుతున్నది. ఆయనని వాడుకొని పారేయాలి అనే పాలక పార్టీలే గాని ఆయన్ని కలుపుకొని వెళదాం అనే పార్టీలు నేడు లేకపోవడం విచారం.

ముద్రగడని తన పార్టీలోకి తీసికొందాం అనే పార్టీలు నేడు లేవు. ఎందుకంటే? నిప్పుని (Fire) జేబులోగాని, పార్టీలో గాని పెట్టుకొంటే అది దహించివేస్తాది అని ఆ పార్టీ పెద్దలకు తెలుసు. అయినా మన పెద్దాయన వాళ్ళకి మాత్రమే ఆ వరాలు ఇస్తూనే ఉన్నారు. కులం (Kapu Caste) బలి అవుతూనే ఉన్నది. దీనికి పాలక పార్టీల మోసం, స్వార్ధం, ముద్రగడ వ్యవహార శైలి ప్రధాన కారణాలు అని చెప్పాలి.

ముద్రగడ అనుభవంతో పోల్చితే మాజీ సీఎం బాబు (Chandra Babu), ప్రస్తుత సీఎం జగన్ (Jagan) కూడా బచ్చాలే? ఇంతటి అనుభజ్ఞుని అనుభవాన్ని సరి అయిన విధంగా వాడు కోకపోవడం వల్లనే ఆయన తీసికొంటున్న నిర్ణయాలు నేడు కాపుజాతి ప్రగతికి అడ్డుగా కనిపిస్తున్నాయి? నిప్పుకి ఆజ్యం పొసే పాలక పార్టీలు ఉన్నంతవరకు నిప్పు జ్వలిస్తూనే ఉంటుంది. దీన్ని జనసేన (Janasena) అర్ధం చేసికొని చక్కదిద్దే చర్యలు తీసికోవాలి. నిప్పుని శాంత పరిచేలా పవనాలు (Pavanalu) ఉండాలి.  అలానే పవనాల శిష్య గణం కూడా నిప్పుని రెచ్చగొట్టేలా  ఉండకూడదు. జనసేనాని (Janasenani) రాజకీయాల్లో కలుపుకొని వెళ్ళాలి గాని కెలుక్కొంటూ వెళ్లడం మంచిది కాదు.

చిరు రంగంలోకి దూకాలి?

జాతి ప్రయోజనాలను, జాతికి చెందిన పార్టీలను దహించివేస్తున్న ఈ నిప్పుని శాంతపరచాలి. జనసేన లాంటి పార్టీలు (Janasena Party) ఎదగాలి అంటే ఇటువంటి వారిని సముదాయించాలి. లేకపోతే పాలకులకు పెద్దాయన (Pedhayana) వరంగా మారుతున్నాడు. అందుకే నిప్పుని శాంత పరచే చర్యలను చిరు లాంటివారు తక్షణమే తీసికోవాలి. నిప్పుని ప్రసన్నం చేసికొనే ప్రయత్నాలు కాపు యువత (Kapu yuvatha) కూడా చేయాలి. నిప్పుని శాంత పరచని ఎడల, నిప్పు జ్వలిస్తూనే ఉంటుంది.  తన వ్యక్తిగత ఆవేదనతో, అవమాన భారంతో, జ్వలిస్తున్న ఆ నిప్పుల కొలిమిలో మన అణగారిన వర్గాల (Suppressed classes) ఆశలు మసకబారవచ్చు.  ఈ కుల విభజన (Caste wise division) రేఖల గోడల్లో బాధిత వర్గాల భవిత కూడా అగమ్యగోచరంగా మారవచ్చు.

నిప్పుతో కాపుల (Kapu) కొంపకే నిప్పు పెట్టాలని స్వార్ధ పాలకులు కొందరు చూస్తున్నారు. నిప్పు నిర్ణయాలు కూడా వాళ్ళకే అనుకూలంగా ఉంటున్నాయి. మన మేధావులు (Intellectuals) కూడా  బయటకి వచ్చి పరిస్థితులను అర్ధం చేసికోవడానికి ప్రయత్నం చెయ్యాలి. చర్యలు తీసికోవాలి. చర్యలు తీసికోకపోతే పవన్’కి (Pawan Kalyan) గాని లేదా జనసేనకుగాని (Janasena) వచ్చే నష్టం ఉండకపోవచ్చు.  అయితే ఈ కుల నాయకుల అహం వల్ల మా లాంటి వారి ఆశలు అడియాశలుగానే మిగిలిపోతాయేమో?

Bottom Line…

వాస్తవం ఏమిటంటే నిప్పు అధర్మాన్ని మాత్రమే దహిసంచి వేస్తుంది. కానీ మన నిప్పు ధర్మం అయినా అధర్మం అయినా సరే స్వజాతీయులను మాత్రమే దహించి వేస్తుంది అనే అనుమానాలు ముద్రగడకి (Mudragada) మంచిది కాదు. నిప్పు జాతిని దయించి వేస్తున్నది అనే ముద్ర (Mudra) పెద్దాయనకి (Pedhayana) మంచిది కాదేమో. ఆలోచించండి

ఆలోచించండి… తరతరాలుగా కొట్టుకుచావడమేనా? ఎన్నాళ్లీ మీ ఇగోలు? ఎన్నాళ్లని జాతిని నాశనం చేస్తారు. (Its from Akshara Satyam)

కొత్త రాజకీయ పార్టీ దిశగా ముద్రగడ సరికొత్త అడుగులు?

One thought on “ముద్రగడని శాంత పరచడానికి చిరు రంగంలోకి?”
  1. రక రకాల వార్తలు వస్తున్నాయి కావున గౌరవనీయులైన శ్రీ ముద్రగడ గారు ఇప్పటికి అయినా పెదవి విప్పి ఆ వార్తలలో నిజం లేదు అని ఖండించాలి లేదా వారి మనసులోని అభిప్రాయాన్ని తెలియచేయ్యాలి ఎందుకంటె మీడియా మనమీద ఎన్నో కాదనాలు అల్లి కాపు ఐక్యతకి చిచ్చు పెడుతున్నారు

Comments are closed.