ఉభయ గోదావరి జిల్లాల నుంచి 497 అర్జీలు వచ్చాయి
రేపటి నుంచి అర్జీల పరిష్కార ప్రక్రియ ప్రారంభమవుతుంది
భీమవరం మీడియా సమావేశంలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
సామాన్య ప్రజలు (Common Man) పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి (Chief Minister) పట్టించుకోకపోవడంతో జనసేన పార్టీ (Janasena Party) “జనవాణి -జనసేన భరోసా” Janavani Janasena Barosa) కార్యక్రమం చేపట్టిందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ (Political affairs Committee Chairmen) నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) పేర్కొన్నారు. సామాన్యుడు గళం వినిపించేలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశామని నాదెండ్ల తెలిపారు.
ఈ రోజు నిర్వహించిన జనవాణి (Janavani) కార్యక్రమంలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల (Godavari districts) నుంచి 497 అర్జీలు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్వీకరించారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆదివారం భీమవరంలో జనవాణి – జనసేన భరోసా కార్యక్రమం (Janavani in Bhimavaram) నిర్వహించారు. ఉదయం 10గం. నుంచి పవన్ కళ్యాణ్ గారు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పిఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు (Konidela Nagababu) పాల్గొన్నారు.
అర్జీల స్వీకరణ అనంతరం మీడియా సమావేశం (Press meet) నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “జనవాణి కార్యక్రమానికి సామాన్య ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. విజయవాడలో జరిగిన రెండు విడతల్లో దాదాపు 1000 అర్జీలు రావడం జరిగింది అని మనోహర్ అన్నారు.
భీమవరంలో 497 అర్జీలు
ఈ రోజు భీమవరంలో 497 అర్జీలు వచ్చాయి. పంచాయతీ రాజ్, ఆరోగ్య, వ్యవసాయ, రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాఖల నుంచి ఎక్కువ అర్జీలు వచ్చాయి. ముఖ్యంగా భీమవరం పట్టణంలో నెలకొన్న స్థానిక సమస్యలు, డంప్ యార్డ్ గురించి స్థానిక ప్రజలు అర్జీలు ఇచ్చారు. ఈ రోజు తీసుకున్న అర్జీల పరిష్కార ప్రక్రియ రేపటి నుంచి మొదలవుతుంది. వచ్చిన అర్జీలను సంబంధిత ప్రభుత్వ శాఖాధిపతులకు పంపిస్తాము. వాటితో పాటు జనసేన పార్టీ తరఫున లెటర్స్ రాస్తాము. వారం రోజుల తరువాత అర్జీకి సంబంధించిన అప్ డేట్ ను సంబంధిత వ్యక్తికి మెయిల్, వాట్సప్ ద్వారా అందిస్తాము అని మనోహర్ తెలిపారు.
వాతావరణం పరిస్థితులు అనుకూలించకపోయినా ఏజెన్సీ ప్రాంతాల (Agency) నుంచి సైతం చాలా మంది తరలివచ్చి అర్జీలు ఇచ్చారు. వారి నమ్మకాన్ని జనసేన పార్టీ (Janasena Party) తప్పక నిలబెట్టుకుంటుంది. వైసీపీ నాయకుల (YCP Leaders) అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు (False cases) పెట్టి వేధిస్తున్నారు. వాటిపై కూడా పిటీషన్లు వచ్చాయి. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తారు. జనవాణి కార్యక్రమం విజయవంతం అవ్వడానికి పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు చాలా కష్టపడ్డారు. వారందరికీ పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీఏసీ సభ్యులు చేగొండి సూర్య ప్రకాశ్, కనకరాజు సూరి, ముత్తా శశిధర్, విశ్రాంత ఐఏఎస్ అధికారి, జనసేన నాయకులు డి.వరప్రసాద్, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నం, లీగల్ సెల్ ఛైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్, కార్యక్రమాల నిర్వహణ కమిటీ రాష్ట్ర ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ బొమ్మిడి నాయకర్, పార్టీ నేతలు రెడ్డి అప్పలనాయుడు, విడివాడ రామచంద్రరావు, శ్రీమతి ఘంటశాల వెంకటలక్ష్మి, మేకా ఈశ్వరయ్య, చిర్రి బాలరాజు, కరాటం సాయి, చన్నమల్ల చంద్రశేఖర్, ఇళ్ళ శ్రీనివాస్, యిర్రింకి సూర్యారావు, బన్ని వాసు, ధర్మరాజు, మల్నీడి బాబీ, శ్రీమతి కాట్నం విశాలి, శ్రీమతి కడలి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.