అమ్మ (Mother) ఇష్టంతో పదే పదే పెడుతుంటే నాడు కష్టంగా కనిపించేది
కసురుకొంటూ, విసిరి కొట్టేసేవాళ్ళమి.
నాన్న (Father) కష్టంతో చదివిస్తుంటే నష్టంగా కనిపించేది
విసుక్కొంటూ చదువుతున్నట్లు నటించేవాల్లమి.
అమ్మ ఇష్టం – నాన్న కష్టం నాడు తెలిసేది కాదు
నేడు తెలిసేటప్పటికీ నాన్న (Father) స్థితిలో నేడు మనం ఉన్నాం.
బాధ్యతలు, కష్టాలను కొంత సేపు మరిచిపోయి కడుపునిండా తిందామంటే పెట్టడానికి అమ్మ ఉండదు.
కాస్త విశ్రాంతి తీసికొని ఉందామంటే బిడ్డ కోసం కూర్చోపెట్టి కష్టపడే నాన్న ఉండడు.
నేటి నీ కన్నీళ్లు పోయిన అమ్మ నాన్నలకు స్వాంతన నివ్వవు.
అమ్మా నాన్నలు బతికుండగా మనం చేసిన నిర్లక్ష్యపు
ఆవేదన మనల్ని వీడదు. జీవిన గమనం మనకు తప్పదు.
వాళ్ళ నాన్నని తలచుకొంటూ ఇదే విధంగా
మొన్న మా నాన్న కూడా బాధపడి ఉండవచ్చు.
అమ్మా – నాన్నా అంటూ నేడు నేను బాధపడుతున్నట్లు…
రేపు నా బిడ్డ కూడా మా కష్టాన్ని గుర్తించి బాధ పడవచ్చు.
మరుగున పడిపోతున్న ఈ విలువలను నేటి బిడ్డలకు చెప్పే షరాబు నేడు లేడోయి.
ఇది అక్షర సత్యం ఆవేదన కాదు. వయస్సు మళ్లుతున్న ప్రతీ తల్లీ తండ్రి ఆక్రందన.
ఆలోచించండి… తల్లితండ్రులు అంటే స్టోర్ రూంలో పారేసే పాత వస్తువులు కాదు. లైబ్రరీలో దాచుకొనే విలువైన అనుభవ భాండాగారాలు. అర్ధం చేసికోవడానికి ప్రయతించండి.