కొవిడ్‌తో (Covid) పోరాడుతున్న భారతిని (bharathi) కాపాడలేక పోయా అని బాలీవుడ్ నటుడు సోనూసూద్ (Sonu sood) ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. కరోనాతో (Carona) పోరాడుతున్న భారతి అనే యువతిని కాపాడడానికి ఎంతో ప్రయత్నించినప్పటికీ చివరికీ విషాదమే మిగిలిందని సోను సూద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ట్వీట్ చేశారు.
‘కొవిడ్‌తో తీవ్ర పోరాటం చేస్తోన్న భారతి అనే యువతిని నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌లో తీసుకువచ్చి ఆసుపత్రిలో సోను సూద్ చేర్పించిన విషయం అందరికీ తెలిసిందే. శుక్రవారం రాత్రి ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. సుమారు ౩౦ నెల రోజులపాటు ఆసుపత్రిలో భారతి జీవితంతో పోరాటం చేసింది. ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నేను ఆమెను బతికిస్తాననుకున్నాను. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించలేం. నా హృదయం ముక్కలైంది’’ అని సోనూసూద్ విచారం వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు (Nagapur) చెందిన భారతి అనే యువతి ఇటీవల కరోనా బారిన పడింది. వైరస్ కారణంగా ఆమె ఊపిరితిత్తులు (Lungs) 85 శాతం వరకూ దెబ్బతిన్నాయి. ఊపిరితిత్తుల మార్పిడి లేదా మెరుగైన చికిత్స అందించాలని వైద్యుల సూచించారు. ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్ భారతి కోసం ఓ ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ (Air Ambulance) ఏర్పాటు చేయించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు (Hyderabad) తీసుకువచ్చారు.