Munugodu won by TRS

మునుగోడు ఉప ఎన్నికలో కూసుకుంట్ల విజయం
10 వేలకు పైచిలుకు ఓట్ల ఆధిక్యం
ఓడిన భాజపా అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి
సిటింగ్‌ స్థానంలో డిపాజిట్‌ కోల్పోయిన కాంగ్రెస్‌
తెరాసకు కలిసొచ్చిన కమ్యూనిస్టుల మద్దతు

మునుగోడు (Munugodu) గడ్డపై తెరాస (TRS) విజయం సాధించింది. ఈ ఉప ఎన్నికలో విజయంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బోణీ కొట్టాలనుకున్న బీజేపీ (BJP) ఆశలకు తెరాస కట్టడి చేసింది. వామపక్షాల (Communist Parties) అండతో తెరాస విజయ కేతనం ఎగరేసింది. సిటింగ్‌ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌కు (Congress) డిపాజిట్‌ కూడా దక్కలేదు. బీఎస్పీ (BSP) మాత్రం నామమాత్రపు ఓట్లకే పరిమితమైంది. కారును పోలిన గుర్తులకు అయిదు వేలకు పైగా ఓట్లు రావడం గమనార్హం.

మునుగోడు ఓటర్ల అందరికీ ధన్యవాదాలు. గెలుపునకు కృషి చేసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు అభినందనలు. విజయానికి సహకరించిన సీపీఐ, సీపీఎం నేతలకు కృతజ్ఞతలు అని కెసిఆర్ (KCR) అన్నారు

ఆదివారం జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది అని చెప్పాలి. హోరాహోరీ తలపడిన తెరాస, భాజపాల మధ్య రౌండ్ల వారీగా ఓట్ల తేడాలు స్వల్పంగా మాత్రమే ఉంటూ వచ్చాయి. క్షణక్షణం నువ్వానేనా అనే పరిస్థితి నెలకొంటూ వచ్చింది. చివరకు గులాబీ వికశించగా కమలం వికసించ లేకపోయింది.

తీవ్ర ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలో తెరాస జోరుని ప్రదర్శించింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఈ ముముగోడు ఎన్నికలో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (Kusukuntla Prabhakar Reddy) తన సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై (Komati Reddy Raja Gopal Reddy) 10,309 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

తెరాసకు 4 శాతానికి పైగా ఓట్ల ఆధిక్యం లభించింది. మునుగోడు ఉప ఎన్నికలోనూ గెలుపొందడం ద్వారా తెలంగాణలో దూసుకెళ్లాలని ప్రయత్నించిన భాజపా ఆశ నెరవేరలేదు అని చెప్పాలి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచి.. ఇటీవల రాజీనామా చేసి ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపా అభ్యర్థిగా గట్టి పోటీ ఇచ్చి ఓటమి చెందారు. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన పాల్వాయి స్రవంతి మూడో స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు. ఆ పార్టీ సిటింగ్‌ స్థానంతో పాటు డిపాజిట్‌ను సైతం కోల్పోయింది.

అక్రమ ప్రహరీలు కూలిస్తే ప్రభుత్వాన్ని కూల్చాలా: వైస్సార్ సీపీ