Modi at MucchinthalModi at Mucchinthal

ముచ్చింతల్’లో (Muchintal) గల రామానుజ సమతామూర్తి (Statue of Equality) విగ్రహాన్ని ప్రధాని మోదీ (Prime Minister Modi) ఆవిష్కరించారు. ఇది శంషాబాద్ (Shamshabad) సమీపంలో ఉంది. రామానుజాచార్యుల సహస్రాబ్ధి వేడుకల్లో మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. ప్రధాని మోదీ సమతామూర్తి కేంద్రంలో ప్రత్యేక పూజలు చేశారు. 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ రోజు రాత్రి 8 గం.కు రామానుజాచార్యుల సహస్రాబ్ధి వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. అనంతరం ప్రధాని మోదీ ఢిల్లీకి (Delhi) తిరుగు ప్రయాణం అవుతారు. గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చినజీయర్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముచ్చింతల్’లోని సమతా కేంద్రంలో ప్రధాని మోదీ లేజర్‌ షోను తెలికించారు. త్రీడి విధానంలో సాంస్కృతిక కార్యాక్రమాల ప్రదర్శన సాగింది.

సమాజంలోని అందరికీ సమాన అవకాశాలు (Equal opportunities) దక్కాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. సమానంగా అందరూ అభివృద్ధి చెందాలని ప్రధాని అన్నారు. ‘దేశ ఏకతకు రామానుజాచార్యులు స్ఫూర్తి ప్రదాత అన్నారు. దేశమంతటా రామానుజాచార్యులు పర్యటించారు.

స్వతంత్ర పోరాటం (Freedom Struggle) కేవలం దేశ ప్రజల అధికారం కోసమే కాదు. తెలుగు సంస్కృతి దేశ భిన్నత్వాన్ని బలోపేతం చేస్తోంది అని మోడీ అన్నారు. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర రాజులు తెలుగు సంస్కృతిని పోషించారు. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది అని ప్రధాని తెలిపారు. పోచంపల్లికి ప్రంచ వారసత్వ గ్రామంగా ఘనత దక్కింది అని ప్రధాని వివరించారు.

ఇక్రిశాట్’లో ఆకట్టుకున్న మోడీ ప్రసంగం