తిరుమల తిరుపతిలను ముంచెత్తిన కుండపోత
వాగులను తలపిస్తున్న రహదారులు
కడప, నెల్లూరు జిల్లాల్లోనూ బీభత్సం
కుండపోతగా (Heavy rains) కురుస్తున్న వానతో తిరుమల (Tirumala),తిరుపతి (Tirupati) ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తిరుపతిలోని అనేక కాలనీలను వరద చుట్టు ముట్టింది. లోతట్టు ప్రాంతంలోని ఇళ్లన్నీ మునిగిపోయాయి. శ్రీపద్మావతి విశ్వవిద్యాలయం (Padmavathi University) ఇంజినీరింగ్ కళాశాలలోకి (Engineering College) వరద చేరింది. రైల్వే అండర్‌బ్రిడ్జిల (Railway Under Bridge) వద్ద భారీగా నీరు చేరడంతో వాటిని మూసేసి ట్రాఫిక్’ని వేరే దారుల గుండా మళ్లించారు. స్థానిక డీమార్ట్ వద్ద ప్రజలు తాడు సాయంతో రహదారి దాటాల్సి వచ్చింది. పలు కాలనీల్లో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాలేకపోతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి వస్తువులు మునిగాయి.
ప్రజలు తాగడానికి నీరు, తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు. రాత్రికి వరద ఉద్ధృతి (Flood Level) మరింత పెరిగే అవకాశం ఉంది. తిరుపతి (Tirupati) ఎస్వీయూలో భారీ వృక్షాలు కూలడంతో హెచ్‌టీ విద్యుత్తు లైన్లు తెగిపోయాయి. రామచంద్రాపురం- తిరుపతి మధ్య వాగులు భారీగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచాయి. నగరంలోని ప్రజలెవరూ ఇంటినుంచి బయటకు రావద్దని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు.
చిత్తూరు జిల్లాలో వర్షభయం
చిత్తూర్ జిల్లాలోని ఎన్టీఆర్, కల్యాణి డ్యాంలలోకి భారీగా వరద వస్తుండడంతో గేట్లు ఎత్తివేశారు. మూడు దశాబ్దాల తరువాత కల్యాణి డ్యాం మూడో గేటును కూడా తెరిచి 10వేల క్యూసెక్కులను వదిలారు. దీంతో కల్లేటి వాగు, సువర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చిత్తూరు జిల్లావ్యాప్తంగా పలు చెరువులు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి, నగరి, పూతలపట్టు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
నెల్లూరులో పొంగి పొర్లుతున్న వాగులు
నెల్లూరు జిల్లాలోని పంబలేరు, కేతామన్నేరు, బొగ్గేరు, బీరాపెరు, అల్లూరు, సంగం వద్ద కొమ్మలేరు, నక్కల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమశిలలో ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1.35 లక్షల క్యూసెక్కులు ఉంది. దాంతో జలాశయం 10 గేట్లను ఎత్తి లక్ష క్యూసెక్కులను వదిలారు. సూళ్లూరుపేటలో దొండ్ల కాలువ పొంగిపొర్లడంతో దాదాపు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి.
కడప జిల్లాలో భారీ వర్షం
వైస్సార్ కడప జిల్లాలో ప్రధాన నదులు పాపఘ్ని, చెయ్యేరు, బహుద, పెన్నా, బుగ్గవంక నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వెలిగల్లు, పీబీఆర్, అన్నమయ్య, పింఛ, మైలవరం జలాశయాల గేట్లు ఎత్తి నదులకు నీటిని విడుదల చేశారు. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. కల్వర్టులు, రహదారులు కోతకు గురికావడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. రైల్వేకోడూరు మండలం బాలపల్లె సమీపంలో కడప- చెన్నై ప్రధాన రహదారిని వరదనీరు ముంచెత్తింది
AP CM Jagan raises voice on promises given by Center