Janasenani with JP Nadda Janasenani with JP Nadda

వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూస్తాం
వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ అనేది జనసేన బీజేపీఅజెండా
ఇందుకు సంబంధించిన అంశాలపై లోతుగా చర్చించాం
జె.పి.నడ్డాతో అనంతరం ఢిల్లీ మీడియాతో పవన్ కళ్యాణ్

వైసీపీ (YCP) విముక్త ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అనేది జనసేన (Janasena) అజెండా. భారతీయ జనతా పార్టీది కూడా అదే అజెండా అని జనసేన పార్టీ (Janasena Party) అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు. వైసీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి అన్ని కోణాల నుంచి లోతుగా చర్చించామని అన్నారు.

రెండు రోజుల ఢిల్లీ పర్యటన చాలా బలమైన సత్ఫలితాలను ఇస్తుందనే నమ్ముకం ఉందని తెలిపారు. మంగళవారం రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాని ఆయన నివాసంలో పవన్ కళ్యాణ్ కలిశారు. దాదాపు 45 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్’తోపాటు బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జి, కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వి. మురళీధరన్ కూడా పాల్గొన్నారు.

సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ “ఏపీకి సంబంధించి స్థిరత్వం ఉండాలని మొదటి నుంచీ కోరుకుంటున్నాం. వైసీపీ నాయకుల అవినీతి, అరాచకాలపై చర్చించాం. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తాం. పొత్తుల గురించి సమావేశంలో చర్చకు రాలేదు. రెండు పార్టీలు క్షేత్రస్థాయిలో ఎలా బలోపేతం అవ్వాలి, అధికారం ఎలా సాధించాలి అనే అంశాలపై మాత్రమే చర్చించాం” అని అన్నారు.

రానున్న రోజుల్లో రాష్ట్రానికి మంచి జరుగుతుంది: నాదెండ్ల మనోహర్

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “రాజకీయ కోణం నుంచి కాకుండా అభివృద్ధి కోణం నుంచి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం సహకరించుకొని పని చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇది చాలా మంచి పరిణామం. రానున్న రోజుల్లో రాష్ట్రానికి మంచి జరుగుతుందనే నమ్మకం ఈ రెండు రోజుల ఢిల్లీ పర్యటన వల్ల కలిగింది. జేపీ నడ్డాతోపాటు అనేక మంది బీజేపీ పెద్దలను కలిసి మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా ఈ విషయం అర్ధమైందని నాదెండ్ల మనోహర్ అన్నారు.

కులం పేరుతో దాడులు చేయడం సిగ్గు చేటు: కందుల దుర్గేష్