Thota Chandra SekharThota Chandra Sekhar

కాపునాడు మేధావుల విభాగం కన్వీనర్ డాక్టర్ గనిశెట్టి

కేసీఆర్ విజన్, నిబద్ధత కారణంగా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా రైతులు, బలహీన వర్గాలు అనేక సంక్షేమ ఫలాలు పొందుతున్నారన్నారని కాపునాడు మేధావుల విభాగం కన్వీనర్ డాక్టర్ గనిశెట్టి వెంకట శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. తాజాగా సీనియర్ ఐఎఎస్ అధికారి తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్’లో చేరికపై ఆయన స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు.

ఏపీలో రాష్ట్ర రాజధానిపై స్పష్టత లేదని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇలాంటి సమయంలో ఏపీకి తోట లాంటి నాయకుడు కావాలని గనిశెట్టి చెప్పుకొచ్చారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు కావాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యనించారు.

తెలంగాణలో వ్యవసాయ రంగంతో పాటు విద్యుత్, పరిశ్రమలు, ఐటీ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. దళిత బంధు, రైతు బంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలతో పాటు రైతులకు మేలు చేసేలా 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారన్నారు. గత ఎనిమిదేళ్లలో రైతుల అభివృద్ధి కోసం అనేక నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చారు.

ఏపీ మాత్రం అందుకు విరుద్ధంగా అనేక సమస్యలతో సతమతమవుతోందని, సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ లోని నాయకులు తమ వ్యక్తిగత అభివృద్ధిపై ఎక్కువ దృష్టి సారించారని. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించడంలో జగన్ విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీని స్వాగతించడం చారిత్రక అవసరమని వ్యాఖ్యనించారు. సీనియర్ ఐ.ఎ.ఎస్. అధికారి తోట చంద్రశేఖర్ బిఆర్ ఎస్ లో చేరి ఎపి పగ్గాలు చేపట్టడం ఆనందదాయకమన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలను కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అలాంటి నాయకుడే ఇప్పుడు ఏపీకి కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు తోట చంద్రశేఖర్ లాంటి నాయకుడు కావాలని ఆయన తెలిపారు.

ఇదిలా ఉండగా భారత రాష్ట్ర సమితి విధానాలతో ఆకర్షితులై కర్ణాటకలో పార్టీలకతీతంగా పలువురు నేతలు పార్టీలో చేరుతున్నారు. బీదర్ జిల్లా చిల్లర్గి గ్రామంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన దాదాపు 200 మంది బీఆర్‌ఎస్‌లో చేరినట్లు ఆయన తెలిపారు.

— టివి గోవింద రావు, హైకొర్టు అడ్వకేట్, హైదరాబాద్

బిఆర్ఎస్ పార్టీ లో చేరనున్న తోట చంద్రశేఖర్

Spread the love