Pawan Kalyan Vs Jagan ReddyPawan Kalyan Vs Jagan Reddy

గ్రామ వాలంటీర్ వ్యవస్థ – ప్రాథమిక వ్యక్తిగత సమాచారము

ప్రజల వద్దకు పాలన క్షేత్ర గ్రామ స్థాయిలో (Village Level) సమర్ధవంతమైన మరియు పారదర్శకమైన పాలనను అందించాలనే లక్ష్యంతో 2019లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో గ్రామ వాలంటీర్ వ్యవస్థను (Volunteers system) ప్రవేశపెట్టారు.

గ్రామ వాలంటీర్లు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు మరియు కార్యక్రమాలలో గ్రామీణ స్థాయిలో పనిచేయడానికి స్థానిక సంఘాల (Grama Panchayats) నుండి ఎంపిక చేయబడిన వ్యక్తులు. వీరంతా సాధారణంగా స్థానికులే .

ఈ వాలంటీర్లు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో మరియు గ్రామీణులకు సేవలను అందించడంలో కీలక పాత్ర పోషించాలి అని ప్రభుత్వం నిర్దేశించింది

ఈ వాలంటీర్లు గ్రామస్తుల అవసరాలను గుర్తించడం మరియు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రభుత్వ సేవలను పొందడంలో వారికి సహాయం చేయడం మరియు వివిధ ప్రభుత్వ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించడం వంటి బాధ్యతలను కలిగి ఉంటారు.

గ్రామ వాలంటీర్ల ముఖ్యమైన విధులు

1. సర్వే మరియు గుర్తింపు: గ్రామ వాలంటీర్లు గృహాలు, సామాజిక-ఆర్థిక పరిస్థితులు మరియు గ్రామస్తుల నిర్దిష్ట అవసరాలపై డేటాను సేకరించేందుకు ఇంటింటికి సర్వేలు నిర్వహిస్తారు. వారు వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తిస్తారు.

2. సమాచార వ్యాప్తి: ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు మరియు అర్హతల గురించి సమాచారాన్ని అందించడం ద్వారా వాలంటీర్లు ప్రభుత్వానికి మరియు గ్రామస్థులకు మధ్య వారధిగా వ్యవహరిస్తారు. వారు ఈ కార్యక్రమాల విధానాలు మరియు ప్రయోజనాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పిస్తారు.

3. దరఖాస్తు సహాయం: గ్రామ వాలంటీర్లు వివిధ ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు ఫారమ్‌లను పూరించడంలో గ్రామస్తులకు సహాయం చేస్తారు మరియు దరఖాస్తులు సరిగ్గా మరియు సమయానికి సమర్పించబడ్డారని నిర్ధారించుకుంటారు. అవసరమైన పత్రాలు మరియు ధృవపత్రాలను పొందడంలో కూడా వారు సహాయం చేస్తారు.

4. ఫిర్యాదుల పరిష్కారం: గ్రామ వాలంటీర్లు తమ ఫిర్యాదులు మరియు సమస్యలను పరిష్కరించడానికి గ్రామస్తులకు సంప్రదింపుల బిందువుగా పనిచేస్తారు. ప్రభుత్వ సేవలు మరియు పథకాలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారాన్ని ఇవి సులభతరం చేస్తాయి.

5. పర్యవేక్షణ మరియు అభిప్రాయ సేకరణ : వాలంటీర్లు ప్రభుత్వ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తారు మరియు ఏవైనా అవకతవకలు లేదా సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించారు. వారు ఈ కార్యక్రమాల ప్రభావం మరియు ప్రభావంపై అభిప్రాయాన్ని అందిస్తారు.

వాలంటీర్ వ్యవస్థ సాధించింది ఏమిటి?

APలో గ్రామ వాలంటీర్ వ్యవస్థ అట్టడుగు స్థాయిలో ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురావడం మరియు అందించడంలో విజయవంతమైంది చెప్పవచ్చు.

ఒక రకంగా ఇది స్థానిక కమ్యూనిటీలకు అధికారాన్ని అందించింది. మరియు నిర్ణయం తీసుకునే ప్రక్రియలలో వారి భాగస్వామ్యాన్ని మెరుగుపరిచింది.

ఈ వాలంటీర్లు సమాజంలోని అట్టడుగు వర్గాలను చేరుకోవడంలో మరియు గ్రామీణ ప్రాంతాల్లో సమ్మిళిత అభివృద్ధిని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషించారు ఒక కోణం లో.

వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ విఫలం అయ్యింది?

వ్యక్తిగత సమాచారము మూడు రకాలు గా ఉంటుంది. ప్రాథమిక,( కుటుంబము, గ్రామం) ద్వితీయ ( జిల్లా) తృతీయ ( క్లౌడ్)

గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రాథమిక సమాచారం ఎక్కువగా దొరుకుతుంది. కావలసిన దానికంటే ఎక్కువ ప్రాథమిక సమాచారం గ్రామ వాలంటీర్ దగ్గర ఉంటుంది.

సమాచార సేకరణకు, సక్రమంగా వినియోగించుకోవడానికి గతంలో రెవెన్యూ శాఖ కేంద్ర బిందువుగా ఉండేది

అదే పని ఇప్పుడు మరో 10 మంది గ్రామ వాలంటీర్లు అదనంగా ప్రతి గ్రామంలోనూ చేస్తూ ఉన్నారు

ఉదాహరణకు 1000 గడపలు ఉన్న గ్రామంలో 10 నుండి 15 గ్రామ వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఇంతకుముందు పంచాయతీ వ్యవస్థలో వీఆర్వో గారు చేస్తూ ఉండేవారు ఒకరు లేక ఇద్దరు సిబ్బందితో.

ఈ గ్రామ వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత అదే పనిని పదిమంది చేస్తున్నారు.

1000 గడపలు ఉన్న గ్రామంలో పది మంది వాలంటీర్లకు కావాల్సినంత పని ఉండదు అని అందరికీ తెలుసు. అప్పుడు పని కల్పించాల్సి వస్తుంది లేదా సరైన పని లేకపోతే గ్రామములో ఈ వాలంటీర్లు ఒకరి సమాచారం ఇంకొకరికి చేరవేయటంలో లేనిపోని విషయాలలో తల దూర్చటంలో కొందరు ఉత్సుకత చూపిస్తారు.

సమాచార అపహరణ నిజమేనా కాదా?

వీరు వారి పరిధిలో ఉన్నటువంటి కుటుంబాల పూర్తి బాధ్యత వహిస్తూ తమకు తెలిసిన ప్రభుత్వ సమాచారం అందిస్తూ దాని ప్రకారం ప్రతి కుటుంబం యొక్క సమాచారం పూర్తిగా తెలుసుకో గలుగుతారు.

ఏ ఇంట్లో ఏం జరుగుతోంది ఎవరు ఏం చేస్తున్నారు అన్న చిన్న చిన్న వివరాలు కూడా గ్రామ వాలంటీర్ల ద్వారా గ్రామ సరిహద్దులు దాటటానికి చాలా ఆస్కారం ఉంది. ఒక రకంగా సూపర్ పోలీసింగ్ జరుగుతూ ఉంటుంది.

ఇలా సేకరించిన సమాచారం ప్రక్కలకు, పైకి వెళ్లే ఆస్కారం ఎంతైనా ఉంది. మానవ నైజం ఒకేలాగా ఉండదు. ఇందులో కొందరు తమకు అందిన సమాచారాన్ని మంచిగా వాడవచ్చు లేదా చెడుకు కూడా వాడవచ్చు. అంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం మరియు ప్రతి ఒక్కరి సమాచారం టెక్నాలజీ చేతికి వెళ్లిపోయింది. తద్వారా మన సమాచారం ప్రతి ఒక్కరికి చేరటానికి ఆస్కారం చాలా ఎక్కువ గా ఉంది అని అర్థం.

గతంలో గ్రామ అధ్యక్షుడు మరియు గ్రామ ప్రతిపక్షాలు మాత్రమే రాజకీయాలు ఆడేవారు ఇప్పుడు గ్రామంతో ఆడుకోవడానికి మరో 10 తలలు వచ్చాయని చాలామంది గ్రామస్తులు చెప్పుకోలేక మదన పడుతున్నారు.

ఇప్పుడు చాలా తరచుగా తీసుకునే ప్రాథమిక డేటా కుటుంబ స్థాయి నుంచి బయలుదేరి గ్రామ స్థాయి, జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు చేరి, క్రోడీకరించబడుతోంది మరియు వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతోంది.

గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేశారు అని అభయోగించి ఒక రాజకీయ అస్త్రంగా వాడటం కూడా జరిగింది. మరలా ఇప్పుడు అదే పునారవృతం అవుతుంది ఇప్పుడు …

సమస్య యొక్క ప్రధాన అంశం గోప్యత మరియు ప్రాథమిక డేటా వినియోగం. ఈ ప్రాథమిక డేటాను ఎలా సేకరిస్తున్నారు మరియు అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది చర్చించాల్సిన ముఖ్యమైన అంశం

గట్టు దాటుతున్న వ్యక్తిగత సమాచారం

గుట్టుగా ఉండాల్సిన సమాచారం కూడా గట్టు దాటుతూ ఉంది. గోప్యత అనేది తగ్గిపోతూ ఉంది. తగ్గిపోవటానికి కారణం గ్రామ వాలంటీర్ వ్యవస్థ కూడా ఒక కారణం.

ఇంతకుముందు పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా ఇలా సేకరించినటువంటి సమాచారాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి గోప్యంగా ఉంచుతూ ప్రతి జిల్లాలో కలెక్టర్ అనే ఒక రాజ్యాంగ వ్యవస్థ ద్వారా రాజకీయ నాయకులు కు చేరుతూ ఉండేది

కలెక్టర్ వ్యవస్థ నిర్లిప్తకు లోనవుతున్నదా?

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఎంపీ కాన్స్టిట్యూఎన్సీ కి ఒక కలెక్టర్ , అతని యంత్రాంగం ఉండటం వలన, ఖర్చు పెరిగినా కూడా పాలన సౌలభ్యం కొంతవరకు జరుగుతుంది. దానికి తోడు గ్రామ వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రతి సమాచారం ముందుగా రాజకీయ శక్తులకు వెళ్తోంది. దాని ద్వారా కలెక్టర్ వ్యవస్థ సమాచారము విషయంలో వెనుకడుగులో ఉంది. మెల్ల మెల్లగా ప్రాథమిక సమాచారము తమకంటే ఎక్కువ బలీయమైన రాజకీయ మరియు రాజ్యాంగేతర శక్తుల వద్దకు చేరుతుండటంతో, కలెక్టర్ వ్యవస్థ నిర్లిప్తకు లోనవుతున్నది.

ఒకరకంగా జిల్లా అధికారులకు తక్కువ సమాచారంతో రాజకీయ శక్తులకు ఎక్కువ సమాచారంతో జిల్లాలో సమాంతర పాలన జరుగుతోంది.

క్షేత్రస్థాయిలో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, మరి కొంతమంది ఆనందపడుతున్నారు.

కాకపోతే ప్రతి ఒక్కరికి ఒక విషయమైతే స్పష్టంగా తెలుస్తోంది తమ వ్యక్తిగత సమాచారం, ఇకపై వ్యక్తిగతం కాదు అని.

ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమాచారం ప్రతి ఒక్కరికి ప్రపంచ వ్యాప్తంగా చేరుతోంది అని కూడా గ్రహించారు.

క్షేత్రస్థాయిలో ఉన్న గ్రామీణులు ఇవన్నీ అర్థం చేసుకున్నారు. ఇలా తమ వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్ళటం మంచిదా కాదా అన్న విషయం మీద వాళ్లకు కూడా పూర్తి అవగాహన ఉంది. రాబోవు ఒక సంవత్సరం లోపు తమ యొక్క ఆగ్రహం కానీ ఆనందం కానీ తప్పక తెలియచేస్తారు.

దిద్దుబాటు చర్యలు ఎలా ఉండాలి?

వ్యక్తిగత డేటాను రక్షించే హక్కు చట్టాలచే గుర్తించబడిన ప్రాథమిక మానవ హక్కు. ఆ హక్కును పరిరక్షించుకోవడానికి చట్టం కల్పించిన వసతులు

1. సమ్మతి : వ్యక్తులు తమ వ్యక్తిగత డేటాను ఎవరైనా సేకరించి ప్రాసెస్ చేయడానికి ముందు సమ్మతిని ఇచ్చే హక్కును కలిగి ఉంటారు. సంస్థలు తప్పనిసరిగా స్పష్టమైన సమ్మతిని పొందాలి . డేటా ఎలా ఉపయోగించబడుతుందనే దాని గురించి స్పష్టమైన సమాచారాన్ని అందించాలి.

కానీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు అనే విధానంకు వ్యక్తిగత సమాచారం కావాలని సేకరణ జరుగుతుంది అని ఒక అభివాదము.

2. పర్పస్ పరిమితి: వ్యక్తిగత డేటా నిర్దిష్ట, స్పష్టమైన మరియు చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం మాత్రమే సేకరించబడాలి. వ్యక్తి అనుమతి లేకుండా ఇతర ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగించకూడదు.

3. డేటా కనిష్టీకరణ: సంస్థలు పేర్కొన్న ప్రయోజనాలను నెరవేర్చడానికి అవసరమైన కనీస వ్యక్తిగత డేటాను మాత్రమే సేకరించి, ప్రాసెస్ చేయాలి. అనవసరమైన లేదా అధిక డేటా సేకరణ అనుమతించబడదు.

4. ఖచ్చితత్వం : వ్యక్తులు తమ వ్యక్తిగత డేటా ఖచ్చితంగా మరియు తాజాగా ఉండేలా చూసుకునే హక్కును కలిగి ఉంటారు. సంస్థలు సరికాని లేదా అసంపూర్ణ డేటాను సరిచేయడానికి లేదా తొలగించడానికి సహేతుకమైన చర్యలు తీసుకోవాలి.

5. భద్రత : అనధికార ప్రాప్యత, మార్పు, బహిర్గతం లేదా విధ్వంసం నుండి వ్యక్తిగత డేటాను రక్షించడానికి తగిన సాంకేతిక మరియు సంస్థాగత చర్యలను అమలు చేయడానికి సంస్థలు బాధ్యత వహిస్తాయి.

6. పారదర్శకత : వ్యక్తులు తమ వ్యక్తిగత డేటా సేకరణ, వినియోగం మరియు భాగస్వామ్యం గురించి తెలియజేయడానికి హక్కు కలిగి ఉంటారు. సంస్థలు స్పష్టంగా మరియు సులభంగా అర్థమయ్యేలా గోప్యతా నోటీసులు మరియు విధానాలను అందించాలి.

7. జవాబుదారీతనం : డేటా రక్షణ చట్టాలను పాటించడానికి సంస్థలు బాధ్యత వహిస్తాయి మరియు తగిన విధానాలు, విధానాలు మరియు రికార్డుల ద్వారా తమ సమ్మతిని ప్రదర్శించగలగాలి.

చట్టబద్ధంగా ఇన్ని వసతులు ఉన్నా….

రాష్ట్రంలో గ్రామీణ మరియు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యక్తిగత సమాచారం ఎల్లలు దాటుతోంది అనేటటువంటి విషయంలో ప్రస్తుతము రాష్ట్రంలో తేనె తుట్టు కదిపినట్లు అయ్యింది.

రాబోవు కాలంలో ఇది ఎటు దారితీస్తుందో చూడాలి. గ్రామా వాలంటీర్ వ్యవస్థపై ఆంధ్ర ప్రజలు ఎలా తీర్పు నిస్తారో వేచి చూడాలి.

వాలంటీర్ వ్యవస్థ వల్ల సమాచార అపహరణ అవుతున్నదా లేదా అనే దృక్కోణంలోనే ఈ వ్యాసం రాయడం జరిగింది. అసలు వాలంటీర్ వ్యవస్థ రాజ్యాంగేతర శక్తిగా పనిచేస్తున్నదా లేదా అనే విషయాన్ని మరో వ్యాసంలో చర్చిద్దాం.

వ్యాసకర్త: ఒక ప్రముఖ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఢిల్లీ నుండి

ఎర్రిపప్ప ప్రభుత్వం అంటూ తణుకులో చెలరేగిన జనసేనాని

Spread the love