జనసేనాని (Janasenani) స్వేదంతో, జనసైనికుల (Janasainiks) ఆశలతో
నిర్మిస్తున్న చీమల పుట్టలను (Anthills)
ధ్వంశం చేయాలనీ రాక్షస మూకలు చూస్తున్నాయి.
ఆక్రమించుకోవాలని పచ్చ విష సర్పాలు చూస్తున్నాయి.
కప్పాలకు అలవాటు పడ్డ పువ్వునాధులు వీరికి మద్దతునిస్తున్నారు అనే అనుమానాలు అణగారిన వర్గాల్లో నాటుకుపోయింది.
ఇవి చీమల పుట్టలు కాదు. ఇది జనసేన పార్టీ. ఇది సేనాని కష్టార్జితం. జనసైనికుల విశ్వాసం. మన అణగారివర్గాల ఆశలసౌధం.
మన చీమల పుట్టలను కాదు కాదు జనసేన పార్టీ అనే మన ఆశల సౌధాన్ని ఆ పచ్చ-నీలి విష సర్పాల పాలు కాకుండా కాపాడు కోవాలి. ఆధిపత్య పార్టీలు చేసే విష ప్రచారాలను తిప్పి కొడదాం అనే చైతన్యం జనాల్లో రోజురోజుకీ పెరగాలి. జనాల్లో ఆ చైతన్యం తీసికొని రావడం కోసం ప్రతీ జనసైనికుడు కృషి చేయాలి.
జనసేన పార్టీని అణచివేయడం ద్వారా అణగారిన వర్గాలను ఉంచుకొందాం. వాడుకొందాం అనే ఆధిపత్య పార్టీల కుట్రలను తిప్పికొట్టాలి. అప్పుడే అణగారిన వర్గాలకు శ్రీరామరక్ష. లేకపోతే ఆధిపత్య వర్గాల కుట్రల్లో చేతిలో అణగారిన వర్గాల భక్షణ తధ్యం. ఇదే అక్షర సత్యం.
ఆలోచించండి… చీమల పుట్టలు విష సర్పాల వశం కావడమా? ఇంకెన్నాళ్లు? బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ అనే అక్షర సత్యాన్ని తెలిసికోండి. (It’s from Akshara Satyam).