మూడవ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించిన వైసిపి నేతలు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి (Tadvai) గ్రామంలో అన్న సమారాధన (Anna samaradhana) ఘనంగా సాగుతున్నది. ఇక్కడ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి (Bhadrakali sametha veereswara swamy) స్వయంభుగా వెలిశారు. స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సమాలలో భాగంగా దేవస్థాన ఆవరణలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది.
సోమవారంనాడు మూడవరోజు అన్న సమారాధన కార్యక్రమాన్ని వైసీపీ నేతలు ప్రారంభించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముందుగా మాజీ ఎంపీటీసీ సభ్యులు సత్రం లక్ష్మణరావు, జంగారెడ్డిగూడెం జడ్పిటిసి పోల్నాటి బాబ్జి, దేవస్థాన చైర్మన్ పాపోలు వెంకటేశ్వరరావు, ప్రారంభించారు.
ఎంపీటీసీ పొడపాటి నందిని, సర్పంచ్ యరమాల సత్యవతి, పల్లా గంగాధర్ రావు, కనికళ్ళ ప్రసాద్, వీరంకి సత్యనారాయణ మూర్తి, పాల రామకృష్ణ, పాపోలు రవి, పాపోలు ప్రతాప్, జాస్తి వినయ్ కుమార్, రాసాబత్తుల రాంబాబు, చందా కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం నుంచి గరువు బాబురావు