AP employees with CMAP employees with CM

ఈ ప్రభుత్వం ఉద్యోగులది: సీఎం జగన్

సీఎం (CM Jagan) సమస్యని పెద్ద మనస్సుతో పరిష్కరించారు అని ఉద్యోగ సంఘాలు (Employees Unions) ఆనందం వ్యక్తం చేసాయి. ఈ ప్రభుత్వం ఉద్యోగులది. ఉద్యోగుల‌ సహకారంతో ప్రజలకు మంచి చేయగలుగుతున్నాన‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పేర్కొన్నారు. పీఆర్సీ సాధన సమితి ముఖ్యమంత్రి (Chief Minister) వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశం అయ్యింది. మంత్రివర్గ ఉప సంఘంతో రెండు రోజులపాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు ఫలించడంతో పీఆర్సీ సాధన సమితి సమ్మెను ఉపసంహరించుకుంది.

ప్రభుత్వం తమ కోరికలను మన్నించడంతో సమ్మెలోకి వెళ్లడం లేదని పీఆర్సీ సాధన సమితి (PRC Sadhana samithi) నేతలు ప్రకటించారు. చర్చలు సఫలం కావడంతో సీఎం వైయ‌స్ జగన్‌తో ఉద్యోగ సంఘాలు ఆదివారం ప్రత్యేకంగా భేటీ అయ్యాయి. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఇంత మేలు చేసినందుకు సీఎం వైయ‌స్‌ జగన్‌కు ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు.

సీఎంజగన్‌ది చాలా పెద్ద మనసు. ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించారని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. సీపీఎస్‌ (CPS) రద్దు సహా అనేక అంశాల్లో సీఎం స్పష్టత ఇచ్చారని ఉద్యోగ సంఘ నేతలు వివరించారు. ఉద్యోగుల ఆవేదనను సీఎం జగన్‌ అర్థం చేసుకున్నారని, అన్ని అంశాల్లో వెసులుబాటు కల్పించారని పీఆర్సీ నేతలు అన్నారు.

ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

నష్టపోయిన ఉద్యోగులపట్ల జనసేన అండ: పవన్ కళ్యాణ్
ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదు – జనసేనాని