Pawan and JaganPawan and Jagan

హాని చేసే కాలుష్య కారక పరిశ్రమలను గుర్తించండి

వైసీపీ ప్రభుత్వం (YCP Government) ప్లాస్టిక్ ఫ్లెక్సీలు  (Plastic Flexies) బ్యాన్ చేస్తున్నాం అని తీసికొన్న నిర్ణయం చిలికి చిలికి గాలివానలా మరేటట్లు ఉన్నది. ఎంకి పెళ్లి సుబ్బు చావుకి వచ్చినట్లు ఉంది అన్నట్లుగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై తీసికొన్న నిర్ణయం జగన్ ప్రభుత్వానికే (Jagan Government) చుట్టుకొనేటట్లు కనిపిస్తున్నది.

మీ చుట్టుపక్కల ఏమైనా కాలుష్య వ్యర్ధాలు (Pollution) ఉన్నాయా? వాటిపై ప్రభుత్వం (Government) చర్యలు తీసికోవడంలేదా? అయితే వాటిని ప్రభుత్వ దృష్టికి తీసికొద్దాం అని జనసేనాని (Janasenani) జనసైనికులకు  (Janasainiks) పిలుపునిచ్చారు. దీనిపై జనసేన పార్టీ (Janasena Party) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన ప్రకటనను ఒకసారి పరిశీలిద్దాం.

కాలుష్య కారక వ్యర్ధాలు, పరిశ్రమలపై జనసేనాని ప్రకటన సారాంశం:

“మీ చుట్టు పక్కల పారిశ్రామిక వ్యర్థాలను ఏ మాత్రం శుద్ధి చేయకుండా వదిలేస్తున్నారా? ఫలితంగా మీ ప్రాంతంలో జల వనరులు (Water resources), భూగర్భ జలాలు (Ground water) కలుషితం అవుతున్నాయా? పరిశ్రమలే కాదు నగరపాలక సంస్థలు (Municipal Corporations) సైతం మురుగునీటి శుద్ధి ప్లాంట్లను (Water treatment Plants) సక్రమంగా నిర్వహిస్తున్నాయా? వాయు, జల కాలుష్యాలకు (water Pollution) సంబంధించిన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి?

వీటన్నింటిపై ప్రతి జన సైనికుడు (Janasainik), జనసేన నాయకుడు (Janasena Leader), వీర మహిళ (Veera Mahila) దృష్టిపెట్టాలి. ఇందుకు సంబంధించిన సమాచారం, వివరాలు బయటకు తీయండి.

రాష్ట్ర ప్రభుత్వానికి (State Government) పర్యావరణంపై ఉన్న పళంగా ప్రేమ కలిగింది. కాబట్టి కాలుష్యాన్ని వెదజల్లుతూ జల వనరులను, పంట పొలాలను, మత్స్య సంపదను (Sea foods) నాశనం చేస్తున్న సిమెంట్ కంపెనీలు (Cement Companies), ఫార్మా సంస్థలు (Pharma companies), రసాయన పరిశ్రమల్లాంటి (Chemical Plants) వివరాలు సేకరించాలి.

అడవుల్లో సైతం పచ్చదనాన్ని నాశనం చేస్తూ అక్కడి సంపదను దోచేస్తూ పర్యావరణానికి (Atmosphere) హాని చేసే మైనింగ్ సంస్థల (Mining Companies) వివరాలను, అడ్డగోలుగా కొండలను తొలిచేస్తూ, పచ్చదనాన్ని హరించే ప్రభుత్వ శాఖల వ్యవహారాలను కూడా రికార్డు చేద్దాం.

మీమీ పరిధిలో ఉన్న కాలుష్యకారక ప్రాజెక్టులు, వాటి మూలంగా కలుగుతున్న హాని, మీ ఆరోగ్యాలకు ఎంత నష్టం కలుగుతుందో చెప్పండి. సదరు పారిశ్రామిక సంస్థలు ఏర్పాటు దశలో ప్రజాభిప్రాయ సేకరణను ఎంత ప్రహసనంగా మార్చి, ప్రభుత్వ బలగాలతో ఏ విధంగా ఆందోళనలను అణచి వేస్తున్నారో కూడా వెల్లడించే సమయం వచ్చింది.

అకస్మాత్తుగా పర్యావరణ ప్రేమికులుగా మారిన పాలకుల దగ్గర ఈ వివరాలు ఉన్నాయో? లేదో? రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఏ మేరకు ఈ వివరాలను పొందుపరిచిందో? అయినా మన వంతు బాధ్యతగా అన్ని వివరాలూ బయటకు తీసుకువద్దాం.

మన జనసేన పార్టీ (Janasena Party) మూల సిద్ధాంతాల్లో (Principles) ఒకటైన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం గురించి చెబుతూ రాష్ట్రంలో ఉన్న ఈ కాలుష్య కారక పరిశ్రమలు, మైనింగ్ సంస్థలు వాటి మూలంగా కలుగుతున్న హానిని ప్రజా క్షేత్రంలో వెల్లడిద్దాం” అని జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒక సుదీర్ఘ ప్రకటనని జారీ చేశారు. దేనితో జనసైనికులు, జనసేన నాయకులూ రంగంలోకి దిగారు.

దీనిపై జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో? ఆంధ్ర ప్రదేశ్ లోని కాలుష్య నివారణకు ఏవిధమైన చర్యలు తీసికొంటుందో చూడాలి.

‘నా సేన కోసం నా వంతు’ జనసేన కార్యక్రమం

Spread the love