AP CM jaganAP CM jagan

జగన్ (Jagan) నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం (YCP Government) కాపు (Kapu), తెలగ (Telaga), బలిజ (Balija), ఒంటరి (Ontari), తదిదర కులాలను మోసగిస్తున్నది. కాపులకు అన్యాయం చేస్తున్నది అని రాష్ట్ర బీజేపీ నాయకులు (BJP Leaders) కరణం భాస్కర్ (Karanam Bhaskar) ఆరోపించారు.

ఎన్నికల సమయంలో విదేశీ విద్యకు సహాయం చేస్తానని మీ పిల్లలు ఎంత దూరమైనా పోయి చదువు కోవడానికి ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతానని సీఎం జగన్ హామీలు ఇచ్చారు. కానీ నేడు తాను ఇచ్చిన హామీలనే మరచి కాపు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సీఎం జగన్ (CM Jagan) మోసం చేస్తున్నారు.

కాపుల విదేశీ విద్యకు సాయం నో:

పోయిన ప్రభుత్వంలో కాపు నేస్తం (Kapu Nestham) ద్వారా విదేశీ విద్యకు (foreign Study) అర్హులైన పిల్లలకు 15 లక్షల వరకు దఫాలవారీగా చెల్లించేవారు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం (YCP Government) వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా ఆపేసింది. ఉదాహరణకు 2016 ,2017, 2018 సంవత్సరంలో విదేశీ విద్యకు అర్హులై విదేశాలకు పోయి చదువుకుంటున్న పిల్లలకు గత ప్రభుత్వం అప్పటివరకు ఫీజు కట్టింది. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఆ పిల్లలకు విదేశీ విద్యా పథకం కింద మిగతా ఫీజు ప్రభుత్వం కట్టడడం ఆపేసింది. ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఆ విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు .

వారు మధ్యలో చదువు ఆపేసి రాలేరు. రావడానికి వారి మనసం అంగీకరించదు. అలా చేయడానికి వారు చేరిన యూనివర్సిటీలు ఒప్పుకోవు. అక్కడే ఉంటే ప్రభుత్వ సహాయం చేయక వారు ఫీజు కట్టుకునే స్తోమత లేక నరకయాతన అనుభవిస్తున్నారు.

హామీ ఆకాశాన – చేసింది పాతాళన!

జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ఎన్నికల ముందు కాపులకు ప్రత్యేకంగా సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు లెక్కన ఐదు సంవత్సరాలకి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని ఎన్నికల వాగ్దానంలో చెప్పారు. కానీ ఇంతవరకు ఈ మూడు సంవత్సరాలలో ఆయన ఖర్చు పెట్టింది 1490 కోట్లు మాత్రమే.

పోయిన ప్రభుత్వంలో కాపులకు వ్యాపార అభివృద్ధి కోసం బీసీ కార్పొరేషన్ (BC corporation) ద్వారా లక్ష రూపాయలు వరకు ఆర్ధిక సాయం చేసేది. కాపులు అర్జీ పెట్టుకుంటే లక్ష రూపాయలు వరకు కాపు నేస్తం కింద ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేవారు. ఆ డబ్బుతో వారు వ్యాపార అభివృద్ధి చేసుకొని జీవన సాగించేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక దానిని తొలగించారు.

కాపు కార్పొరేషన్ ద్వారా చేసింది సూన్యం

అయితే మొన్న ముఖ్యమంత్రి జగన్ కాకినాడ (Kakinada) జిల్లా గొల్లప్రోలు (Gollaprolu) లో కాపు నేస్తం మీటింగ్ లో మాట్లాడుతూ ఈ మూడేళ్లలో 32,296 కోట్లు కాపులకు లబ్ధి చేకూరిందని చెప్పారు. జగన్ ప్రభుత్వం (Jagan Government) అన్ని కులాలకు నవరత్నాల అనే అన్ని స్కీములలో ఇచ్చినట్టుగానే కాపులకు కూడా ఇచ్చి ఉంటారు. ప్రభుత్వం దానిని కేవలం కాపులకు మాత్రమే 32,296 కోట్లు ఖర్చుపెట్టినట్టుగా చెప్పడమనేది ప్రజలను, ముఖ్యంగా కాపులను మోసం చేయడమే?

కాపు రిజర్వేషన్లపై (Kapu Reservations) మొండి చేయి

కేంద్ర ప్రభుత్వం 10% ఈ బీసీ రిజర్వేషన్ (BC Reservation) కల్పిస్తే అందులో 5%ను పోయిన ప్రభుత్వం కేవలం కాపులకు మాత్రమే కల్పించింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక దానిని కూడా రద్దు చేశారు. సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) పత్తిపాడు (Prathipadu) నియోజకవర్గంలో ఎన్నికల సభలో మాట్లాడుతూ కాపులకు కాపు రిజర్వేషన్ అనేది రాష్ట్రానికి సంబంధించినది కాదు కేంద్రం చేయాలి అని మాట్లాడారు.

కానీ మూడు నెలల క్రితం రాజ్యసభలో జీవీఎల్ నరసింహారావు (G V L Narasimha Rao) కాపుల రిజర్వేషన్ గురించి మాట్లాడితే అది కేంద్ర పరిధిలో లేదు. ఏ కులానికి అయినా రిజర్వేషన్ రాష్ట్రం ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు అని సమాధానం ఇచ్చారు. ఈ విధంగా ప్రతి సందర్భంలోనూ వైసీపీ ప్రభుత్వం (YCP Government) హయాంలోగాని వారి తండ్రి వైస్సార్ (YSR) హయాంలో గాని కాపులను మోసగిస్తూ అన్యాయం చేస్తూనే ఉన్నారు.

దీనికి పరిష్కారం ఒక్కటే. రాబోయే రోజులలో బిజెపి (BJP), జనసేన (Janasena) అభ్యర్థులను గెలిపించి అధికారంలోకి తెస్తే ఇటువంటి జాతుల సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ప్రజల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేకత మొదలు అయ్యింది. కాబట్టి మనము కూడా మార్పుకి అనుకూలంగా ప్రయాణం చేస్తే మంచిదేమో. ఒక్కసారి ఆలోచించండి.

వ్యాసకర్త: కరణం భాస్కర్ (Karanam Bhaskar), బిజెపి రాష్ట్ర నాయకులు,
మొబైల్ నెంబర్ 7386128877