పదవులు కోసమే నేను రాజకీయాల్లోకి రాలేదు. నాకు పదవులు అవసరం లేదు అన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి వేదాంత ధోరణి మాటలు వింటుంటే నాకు వ్యాస మహర్షి పాండవులకు చెప్పిన ఒక్క గొప్ప సందేశం గుర్తుకి వచ్చింది.
ద్రౌపతీ స్వయంవరం అనంతరం పాండవులు అందరు కూడా మాకు రాజ్యం వద్దు. అధికారం వద్దు. అధికారంలో సమ వాటా వద్దు. సన్యాసం తీసికొని శేష జీవితాన్ని గడిపేస్తాం అని నిర్ణయించుకొంటారు.
మాకు అధికారం వద్దు. సన్యాసం తీసికొంటాం అని నిర్ణయించుకొన్న పాండవుల వద్దకు వ్యాస మహర్షి వచ్చి పాండవులకు కర్తవ్య భోదన చేయడం మొదలు పెడతాడు.
“నాయనా పాండు పుత్రులారా!
“దేవుడు మిమ్ములను ఒక ప్రత్యేక కార్యం కోసం పుట్టించాడు. కానీ మీరు ఆ ఈశ్వర నిర్ణయానికి వ్యతిరేకంగా నేడు మీకు అధికారం వద్దు అంటున్నారు. మీరు అధికారం వద్దు అని సన్యాసం తీసికొంటే సమస్త ఆర్యావర్తనాన్ని పట్టి పీడిస్తున్న దుర్యోధనుడు లాంటి రాక్షస పాలనకు అంతం చేసేది ఎవ్వరు.
మీ మీద ఆ దేవుడుతో పాటు ఆర్యావర్తనంలోని ప్రజలు అందరూ కోటి ఆశలు పెట్టుకొన్నారు. మీరు దుర్యోధనుడి, ధృతరాష్ట్రులను ఓడించి, సమస్త ఆర్యావర్తనంలో సమూల మార్పులు తేవాలి. సన్యాసం తీసికోవడం అనే మీ నిర్ణయం అధర్మం. మీ నిర్ణయం మార్చుకొని, వెళ్లి అధికారం కోసం మీ పోరాటం మొదలు పెట్టండి. మార్పు తీసికురండి ” అని వ్యాస మహర్షి పాండవులను కోరతాడు.
వ్యాసమహర్షి చెప్పిన ఆ గొప్ప గొప్ప మాటలను విని పాండవులు అధికారం కోసం పోరాటం మొదలు పెడతారు. వ్యాస మహర్షి ఆ నాడు కర్తవ్య బోధన చేయక పోయినా, పాండవులు వ్యాస సందేశాన్ని వినకపోయిన మహాభారత గాధ మరోలా ఉండేది.
పవన్ కళ్యాణ్ కి వ్యాస మహర్షి సందేశం
అంజనీపుత్రుడా!
మిమ్ములను ఆ పరమేశ్వరుడు ఒక ప్రత్యేక కార్యం కోసం సృష్టించాడు. మీ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ధృత రాష్ట్ర, దుర్యోధనాదుల పాలనకు వ్యతిరేకంగా పోరాడామని దేవుడు మిమ్ములను సృష్టించాడు. అధికారం మీకు అవసరం లేకపోవచ్చు. కానీ పదవుల ద్వారా మీరు అధికారం తీసికొని మార్పు తీసికొని వస్తావని ఆ దేవుడుతో పాటు సమస్త ప్రజలు కోరుకొంటున్నారు. పదవులు నాకు వద్దు అనే మీ నిర్ణయం అధర్మం. ఇది ప్రజాభీష్టానికి, దైవ నిర్ణయానికి వ్యతిరేకం.
జనసేన పార్టీ అధినేతగా మీరు అధికారం కోసం పోరాడాలి. దానికోసం పార్టీని బలిష్ఠం చేయాలి. అప్పుడే రాబోయే యుద్ధంలో రాక్షస పాలకులను, పుత్ర వాత్సల్య ధృతరాష్టులను ఓడించగలరు. మీ గెలుపు, మీరు సీఎం అవ్వడం మీకు అవసరం లేక పోయిన ఈ సమాజానికి అవసరం. వెళ్లి పార్టీని బలోపేతం చేసి, అధికారాన్ని సాధించి, మార్పుని తీసికొని రావాలి అని వ్యాస మహర్షి ఉండి ఉంటే చెప్పి ఉండేవారు.
పవనేశ్వరా! దైవ నిర్ణయాన్ని, ప్రజల ఆకాంక్షను మన్నించి, పార్టీని పటిష్టం చేసి, అధికారం దక్కించుకో. వ్యవస్థల్లో మార్పు తీసికొని రావాలి. అప్పుడే ఆ దైవ నిర్ణయానికి సార్ధకత చేకూరుతుంది. ఆలోచించండి