Mudragada Vs Pawan KalyanMudragada Vs Pawan Kalyan

తాబట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనడమే మార్పునా?

పవన్ కళ్యాణ్ – ముద్రగడ వైఖిరిల్లో మార్పు అనివార్యం

నీలం సంజీవ రెడ్డిని (Neelam Sanjiva Reddy) సీఎంగా కాదని కాసు బ్రహ్మానంద రెడ్డిని (Kasu Brahmananda Reddy) సీఎం చేసినప్పుడు దొడ్డలు సర్దుకు పోయారు. నీలం సంజీవరెడ్డి మాత్రమే సీఎంగా ఉండాలని దొడ్డ సోదరులు గొడవలు పెట్టుకోలేదు. ఏ రెడ్డి (Reddy) అయినా గాని మన రెడ్డే కదా అని మద్దతు నిచ్చారు. తమ జాతిలో నాయకత్వ మార్పుకి సహకరించారు. పదవి తమ నుండి జారిపోకుండా చూసుకొన్నారు.

కాసు బ్రహ్మానంద రెడ్డిని కాదని పీవీ నరసింహారావుని (P V Narasimha Rao) సీఎం (CM) చేసినప్పుడు కూడా గొడవ పెట్టుకోలేదు. అలాని సీఎం పదవి కోసం ప్రయత్నాలు మానుకోలేదు. మర్రి చెన్నారెడ్డి (Marri Chenna Reddy) సీఎంగా వచ్చేవరకు వాళ్ళ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతేగాని నీలం సంజీవ రెడ్డి కోసమే కొట్టుకు చావలేదు. తమ జాతిలో నాయకత్వ మార్పుకి సహకరించారు. పదవి తమ నుండి జారిపోకుండా చూసుకొన్నారు.

మర్రి చెన్నారెడ్డిని కాదని సీఎం పదవి కాపు కాసేవారికి ఇస్తున్నారు అన్నప్పుడు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసికొని అంజయ్యకి (Anjaiah) సీఎం పదవి వచ్చేటట్లు చేసికొన్నారు. అంతే గాని నీలం సంజీవరెడ్డినో లేక కాసు బ్రహ్మానంద రెడ్డినో సీఎం చెయ్యాలి అని కొట్టుకు చావలేదు. తమ జాతిలో నాయకత్వ మార్పుకి సహకరించారు. పదవి తమ నుండి జారిపోకుండా చూసుకొన్నారు.

మర్రి చెన్నారెడ్డి నుండి భవనం వెంకట రామి రెడ్డికి (Bhavanam Venkata Rami Reddy) సీఎం పదవి వచ్చినప్పుడు దాన్ని అంగీకరించారు గాని చెన్నారెడ్డినే సీఎంగా ఉండాలి అని దొడ్డలు (Doddalu) కొట్టుకు చావలేదు. మార్పుని ఆస్వాదించారు. పదవి వాళ్ళ నుండి జారకుండా జాగ్రత్త పడ్డారు.

భవనం నుండి సీఎం పదవి కోట్ల విజయ భాస్కర రెడ్డికి

భవనం వెంకటరామి రెడ్డి నుండి సీఎం పదవి కోట్ల విజయ భాస్కర రెడ్డికి (Kotla Vijaya Bhaskara Reddy) వెళ్ళినప్పుడు విజయ భాస్కర రెడ్డి కోసం, వెంకటరామి రెడ్డి కోసం దొడ్డలు కొట్టుకు చావలేదు. తమ జాతిలో నాయకత్వ మార్పుకి సహకరించారు. పదవి తమ నుండి జారిపోకుండా చూసుకొన్నారు.

రెండవ సారి చెన్నారెడ్డి నుండి సీఎం పదవి మారుతున్నప్పుడు చెన్నారెడ్డి కోసం కొట్టుకు చావలేదు. సీఎం పదవి జనార్ధన రెడ్డికి (Janardhana Reddy) వచ్చినప్పుడు మార్పుని అంగీకరించారు. తమ జాతిలో నాయకత్వ మార్పుకి సహకరించారు. పదవి తమ నుండి జారిపోకుండా చూసుకొన్నారు.

జనార్ధనరెడ్డి నుండి సీఎం పదవి మారేటప్పుడు విజయ భాస్కర రెడ్డికి వచ్చేటట్లు చేసికొన్నారు గాని జనార్ధన రెడ్డి వర్గం, విజయ భాస్కర రెడ్డి వర్గం అని కొట్టుకు చావలేదు. దొడ్డలు నాయకత్వ మార్పుని ఆస్వాదించారు. పదవి తమ వర్గం నుండి జార కుండా చుసుకొన్నారు.

వైస్సార్ అధిపత్యంపై

వైస్ రాజశేఖర్ రెడ్డి (Y S Rajasekhar Reddy) ఎందరో రెడ్డిలను అణచివేసినప్పుడు కూడా దొడ్డలు కొట్టుకు చావలేదు. తమలో నాయకత్వ మార్పుకి అంగీకరించారు. సీఎం (CM) పదవి తమ వర్గం నుండి జారకుండా మాత్రమే చూసుకొన్నారు.

రోశయ్య (Rosaiah) తరువాత సీఎం పదవిలోకి చిరంజీవి (Chiranjeevi) రాకుండా జాగ్రత్త పడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డికి (Kiran Kumar Reddy) వచ్చేటట్లు చేసికొన్నారు గాని జగన్ రెడ్డి (Jagan Reddy) కోసం కొట్టుకు చావలేదు. సీఎం పదవి తమ వర్గంలోనే ఉండేటట్లు చేసికొన్నారు.

మరల జగన్ రెడ్డికి అవకాశం వచ్చినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కోసం కొట్టుకు చావలేదు. లేదా తిట్టుకు చావలేదు.

ఒక రెడ్డి నుండి మరొక రెడ్డికి సీఎం పదవి మారుతున్నప్పడు పాత రెడ్డి గారు కొత్త రెడ్డి గారికి సహకరించారు లేదా మౌనం వహించారు. అంతే గాని నేనే ఉంటాను అని మంకుపట్టుకు పోలేదు. మార్పుకి సహకరించారు.

మార్పుతో కమ్మని వర్గం

ఎన్టీరామారావుని (N T Rama Rao) దించేసి చంద్రబాబు (Chandra babu) సీఎం అయినప్పుడు కమ్మలు తిట్టుకు చావలేదు. రామారావు నుండి బాబుకి నాయకత్వ మార్పుకి సహకరించారు. సీఎం పదవి తమనుండి జారకుండా జాగ్రత్త పడ్డారు.

పాలక వర్గాలు (Ruling Classes కాలానుగుణంగా నాయకత్వ మార్పుకి అంగీకరిస్తూ వచ్చారు. పదవి మాత్రం తమ వర్గం నుండి జారకుండా చూసుకొనే వారు. ఎందుకంటే దశాబ్దాలుగా పాలిస్తునే ఉండడానికి ఇదీ ఒక ప్రధాన కారణం.

మరి కాపు కాసేవారి పరిస్థితి ఏమిటి?

నేడు కాపు (Kapu) కాసేవారి పరిస్థితి ఏమిటి. ముద్రగడ వర్గం (Mudragada), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వర్గం అంటూ తిట్టుకు చస్తున్నారు. పాలకుల నుండి ఈ కాపు కాసేవారు ఏమి నేర్చుకొంటున్నారు. ఎప్పుడు నేర్చుకొంటారు. కాలానుగుణంగా నాయకత్వ మార్పు అనివార్యం అని కాపు కాసేవారు ఎప్పుడు గ్రహిస్తారు. కుల పెద్దలు కూడా నేను విఫలం అయ్యాను. కొత్త తరానికి అవకాశం ఇస్తాను. అతనితో కలిసి పయనిస్తాను అని ఎప్పుడు గ్రహిస్తారు.

నేను విఫలం అయ్యాను అని చిరంజీవి తప్పుకున్నారు. అలానే ముద్రగడ కూడా విఫల నాయకుడు అనేది తెలిసికొని అయన తప్పుకోవాలి. అయన అభిమానులు కూడా మౌనం వహించాలి. అలానే కొత్త నాయకుడు (పవన్ కళ్యాణ్) వచ్చినప్పుడు చిరుని ముద్రగడని గౌరవించాలి. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసికోవాలి. వారిని కలుపుకొని వెళ్ళాలి. పవన్ అభిమానులు కూడా ముద్రగడ నిజాయితీని, జాతికి అయన చేసిన సేవలను, అనుభవాన్ని గౌరవించాలి. ముద్రగడని విమర్శ చేయడం మానుకోవాలి.

జాతి కోసం, అణగారిన వర్గాలకు కావలిసిన రాజ్యాధికారం కోసం అయినా ముద్రగడ పవన్ కళ్యాణ్’కి అవకాశం ఇవ్వాలి. జాతిలోంచి వచ్చిన పార్టీతో కలిసి పనిచేయాలి. ఇష్టం లేకపోతే మౌనం వహించాలి. అంతే గాని పాలక పార్టీలకు లబ్ది చేకూరేటట్లు నడుచుకోరాదు.

ఇక్కడ జనసేనానికి (Janasenani) కొంత సమయం ఇవ్వడం అవసరం. రేపు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా విఫలం అయితే ఆయన్ని కూడా తప్పించడం తప్పు కాదు. సేనాని Senani) ప్రయత్నాల్లో నిజాయితీ లేదని భావించినప్పుడు, సేనాని కూడా ముద్రగడ వలే విఫలం అవుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తప్పుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు. అప్పుడు మరొకరి కోసం ప్రయత్నాలు చేయాలి. కాలానుగుణంగా నాయకుడు మారాలి. అప్పటివరకు సేనానికి జాతి పెద్దలు, మేధావులు, కుల సంఘాలు, కుల నాయకులు సహకరిస్తే తప్ప రాజ్యాధికారం (Rajyadhikaram) కోసం జాతి పోరాటం కొనసాగదు.

మనలో అవగాహనా స్థాయి పెరగాలి. నాయకత్వ మార్పుకి (Change of Leadership) సిద్ధంగా ఉండాలి. అప్పుడే ఈ వర్గాలు రాజ్యాధికారం సాధించడం వీలు అవుతుంది. తాబట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనే రాజకీయ పరిజ్ఞానం లేని ఈ వర్గ నాయకులు వారి అనుచర గణం ఇప్పటికైనా మారాలి. ముద్రగడ వర్గం-పవన్ వర్గం అనే తిట్టులాటలు, కుమ్ములాటలు విరమించుకోవాలి. చిరుని, ముద్రగడని గౌరవిద్దాం. పూజిద్దాం. అలానే పవన్ కళ్యాణ్’ నాయకత్వాన్ని సమర్ధిద్దాం. రాజ్యాధికారం సాధిద్దాం అనే పోరాట గళం వినిపిద్దాం అన్న రోజునే ఈ వర్గాలకు అధికారం దక్కుతుంది. శుభం భూయాత్.

ఆలోచంచండి… కాలానుగుణంగా జాతి నాయకత్వ మార్పు అనివార్యం అని భావించి ఐక్యంగా పయనించడం తక్షణ కర్తవ్యం.

–Its from Akshara Satyam

సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాల్లో పవన్ కళ్యాణ్
సమతామూర్తి ఆశీస్సుల మధ్య సేనాని క్రేజ్

Spread the love