Janasenani Pawan KalyanJanasenani Pawan Kalyan

పవన్’కి ఒక్కో సినిమాకు రూ.100కోట్లు

పతనం అంచుల్లో ఏపీ పోలీస్ ప్రభుత్వం (AP Government) ఉందని ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishna Raju) జోస్యం చెప్పారు. జీవో 1 రాజ్యాంగ విరుద్ధమని, కోర్టుకు వెళ్తే కొట్టేస్తారని అయన తెలిపారు.

14 ఏళ్లు సీఎంగా చేసిన నాయకుడిని అడ్డుకుంటారా? అని రఘురామ రాజు ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) భేటీతో తమ పార్టీ వాళ్ల ప్యాంట్లు తడిసిపోయాయని ఎద్దేవా చేశారు. వైసీపీకి భయం లేకుంటే సాక్షిలో అంతపెద్ద వార్తలు ఎందుకు? అని రఘురామ ప్రశ్నించారు.

ఎన్నికలపై సర్వే రిపోర్ట్ వచ్చినట్లుందని, అందుకే తమ పార్టీ ముందస్తుకు వెళ్లడం లేదని విమర్శించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే పొత్తు కుదురుతుందన్నారు.

పవన్ ఒక్క సినిమా తీస్తే రూ.100 కోట్లు వస్తుంది. అప్పుడు ఆయనకు అడుక్కునే కర్మ ఏంటి? రఘురామ కృష్ణ రాజు అని ప్రశ్నించారు. పవన్‌ను కాపు సామాజిక వర్గానికే పరిమితం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. కాపుల్లో వైసీపీకి బలం లేదని, బీసీ, ఎస్సీల్లో కూడా ఇబ్బందులు తప్పవని రఘురామకృష్ణరాజు అన్నారు.

–టివి గోవింద రావు, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్

వైస్సారే అసలైన ప్యాకేజీ స్టార్: కాపు ఉద్యమ నేత వేల్పూరి శ్రీనివాసరావు

Spread the love