బిజెపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణతో నాదెండ్ల భేటీ
ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని జగన్ రెడ్డి (AP CM Jagan) ఆయన పార్టీ కలసి అంధకారంలోకి నెట్టేశారు. వైసీపీ (YCP) విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అంతా కలసి పని చేస్తామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) స్పష్టం చేశారు.
బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణతో (Kanna Lakshminarayana) రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులపై చర్చించినట్టు నాదెండ్ల మనోహర్ తెలిపారు. బుధవారం రాత్రి గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణతో నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. సుమారు గంట పాటు ఏకాంత చర్చలు జరిపారు.
కన్నాతో భేటీ అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అంతా కలసికట్టుగా పని చేయాల్సిన అవశ్యకతపై చర్చించినట్టు తెలిపారు. మిగిలిన అంశాలు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్’తో చర్చిస్తామని నాదెండ్ల మనోహర్ అన్నారు.