Pawan kalyan at Magalagiri officePawan kalyan at Magalagiri office

జనసేన పార్టీ (Janasena Party) పెట్టింది ప్రజలను పల్లకీలు ఎక్కించడానికి. వాల్ల పల్లకీలు లేదా వీళ్ళ పల్లకీలు మోయడానికి కాదు అని జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పొత్తులపై స్పష్టం (Clarity on alliances) చేశారు. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలు సందేహాలను నివృత్తి చేశారు. తెలుగుదేశం పార్టీతో (Telugudesam Party) పొత్తు ఉండబోదు. జనసేన పార్టీని అధికారంలోకి రాబోతున్నది అని పవన్ కళ్యాణ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దేనితో పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో ఉన్నారు.

చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడం కోసం 5 కోట్ల రూపాయిల విరాళాన్ని జనసేనాని ప్రటించారు. ప్రజల కోసం రైతుల కోసం సొంత నిధుల నుండి సాయం చేస్తున్న ఏమైక నాయకుడుగా పవన్ కళ్యాణ్’ని చెప్పక తప్పదు. ఇదీ పవన్ కళ్యాణ్ దాతృత్వానికి ఒక మచ్చు తునక అని చెప్పాలి.

పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ ప్రసంగ అంశాలు:

నేను ఇచ్చే లక్ష రూపాయలు రైతుల కుటుంబాలకు ఏదో చేస్తుందని ఇవ్వడం లేదు. కనీసం వారి కోసం మనం ఉన్నాం. వారి కన్నీరు తుడుస్తాం అనే నమ్మకం ఇవ్వడానికే ప్రకటించాను.

కౌలు రైతులలో అన్ని కులాల వారు ఉన్నారు. ఒక్క కులం వారు కాదు. అన్నం పెట్టే రైతులకు కులం ఉండదు. కానీ వైసీపీ పార్టీ రైతులకు కూడా కులాన్ని అంటగట్టింది.

కౌలు రైతులు అంటే ఎవరూ అనే విషయం కూడా తెలియడం లేదు. వారిని పట్టించుకోకుండా వారి ఆత్మహత్యలకు కారణం అయింది ఈ వైసీపీ ప్రభుత్వం.

బాదుడే బాదుడు అని ఆరోజు వైసీపీ నాయకులే చెప్పారు కదా. పాపం ప్రజల సమస్యలపై వేదన ఉంది అనుకుంటే, అధికారంలోకి వచ్చి చెత్త పన్ను, కరెంట్ బిల్లు ఇలా ప్రతీ విషయంలో రెట్లు పెంచుకుంటూ పోయింది ఈ వైసీపీ ప్రభుత్వం.

వైసీపీ నాయకులు (YCP Leaders) చెప్పే మాయమాటలు నమ్మడానికి ఇది పాత తరం కాదు. కొత్తతరం, మీరు చేసే ప్రతీ తప్పుడు పనిని గమనిస్తున్నారు.

మద్యపాన నిషేదం (madyapana nishedam) చేస్తామని అధికారంలోకి వచ్చి, ఇప్పుడు నాణ్యత లేని మద్యాన్ని ప్రత్యేక రేట్లకు అమ్ముతూ, రెట్లు పెంచడం వలన మద్యం తాగేవారు తగ్గుతారు అని ఈ వైసీపీ నాయకులు తప్పుడు లాజిక్ చెప్తున్నారు.

జనసైనికులపై వైసీపీ నాయకులకు అంత ప్రేమ అక్కర్లేదు. మీకు అంత ప్రేమ ఉంటే మొన్న మా సభకు వచ్చిన జనాలను తరువాతి రోజు పోలీసులను ఇళ్లకు పంపించి ఎందుకు బెదిరించారు.

వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చనివ్వను అని నేను ఎంతో ఆలోచించి అన్నాను. వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని వల్ల పాలసీల ద్వారా శ్రీలంకలా మార్చేస్తుంటే వారి నుండి రాష్ట్రాన్ని రక్షించడానికి ఆ మాట అన్నాను.

ఎంతోమంది మహానుభావులు త్యాగాలు చేస్తేనే స్వాతంత్య్రం వచ్చింది. అలాంటి వారిని గుర్తుచేసుకోవాలి. వారి స్ఫూర్తిని తీసుకుంటూ ముందుకు వెళుతున్నాం. ఓట్లు పడతాయో లేదో తరవాత సంగతి అని పవన్ కళ్యాణ్ అన్నారు.

కౌలు రైతుల కుటుంబాలకు అండగా జనసేన