Jagan at MuchinthalJagan at Muchinthal

ముచ్చింతల్’లోని (Muchintal) శ్రీరామానుజ సహస్రాబ్ధి వేడుక‌ల్లో ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ (Jagan) మాట్లాడుతూ ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. శ్రీ‌రామానుజచార్యుల‌ (Ramanujacharya) వెయ్యి సంవ‌త్స‌రాల సంద‌ర్భంగా శ్రీ‌ చిన‌జీయ‌ర్ స్వామి (China Jiyar Swamy) ఆధ్వ‌ర్యంలో స‌మ‌తామూర్తి (Samata Murthy) విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించుకోవ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని జగన్ అన్నారు.

“రామానుజాచార్యులు వెయ్యేళ్ల క్రితమే సమానత్వాన్ని భోదించారు. ఆయ‌న బోధ‌న‌లు అనుచరణీయం. రామానుజాచార్యులు భావితరాలకు ప్రేరణగా నిలిచారని” సీఎం వైయ‌స్ జగన్‌ అన్నారు. ఒక గొప్ప భావ‌న‌, సందేశాన్ని మంచి ఉద్దేశంతో నాటి సమాజానికి ఒక మెసేజ్’గా క‌మ్యూనికేట్ చేసిన గొప్ప మ‌నిషిని మ‌నంద‌రం ఈ రోజున స్మ‌రించుకుంటున్నాం అని జగన్ అన్నారు.

ఇంత గొప్ప కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న చిన‌జీయ‌ర్ స్వామికి, ఇందుకు తోడ్పాటును అందించిన రామేశ్వ‌రావుకు ఏపీ సీఎం జగన్ మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. శ్రీ‌ రామానుజ‌చార్యులు బోధించిన విలువ‌లను ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం మన అందరికీ ఉంది. ఈ స‌మాజాన్ని మార్చాలి. ఈ సమాజంలో అంద‌రూ స‌మానులే అని చెప్పే గొప్ప సందేశాన్ని రామానుజాచార్యులు ఇచ్చారు. ఇంత గొప్ప సందేశాన్ని మనకు అందిచడానికే చిన‌జీయ‌ర్ స్వామి శ్రీ‌రామానుజ‌చార్యుల విగ్ర‌హాన్ని స్థాపించారని ఏపీ సీఎం జ‌గ‌న్ అన్నారు.

ముద్రగడ Vs పవన్ కళ్యాణ్: కాపు కాసేది ఎవ్వరిని?