Nadendla in KakinadaNadendla in Kakinada

మత్సకారుల కష్టాలను గాలికి వదిలేసింది?

ముఖ్యమంత్రే మత్సకారుల (Fishermen) కడుపు కొట్టే విధంగా చేపలు (Fishes) అమ్ముకోవడం ఏమిటని జనసేన పార్టీ (Janasena Party) రాజకీయ వ్యవహారాల కమిటీ (Political affairs Committee) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ప్రశ్నించారు. మత్స్యకారులను ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి (Chief Minister) ఉంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, చేసిన వాగ్ధానాలు ఇప్పుడు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారని నాదెండ్ల ప్రశ్నించారు.

జనసేన పార్టీ (Janasena Party) అధికారంలోకి వస్తే మత్స్యకారుల అభివృద్ధి, అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తుందని మనోహర్ హామీ ఇచ్చారు. వారి సర్వతోముఖాభివృద్ధి జనసేన పార్టీ లక్ష్యమన్నారు. జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం చేపట్టిన మత్స్యకార అభ్యున్నతి యాత్రను ఆదివారం ఉదయం కాకినాడ రూరల్ నియోజకవర్గం, సూర్యారావుపేటలో మనోహర్ ప్రారంభించారు.

మారమ్మతల్లి దేవాలయంలో ప్రత్యేకపూజలు

తొలుత స్థానిక మారమ్మతల్లి దేవాలయంలో (Maramma Talli Temple) ప్రత్యేక పూజలు (Special Poojas) నిర్వహించారు. పార్టీ పి.ఎ.సి. సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్,  పితాని బాలకృష్ణ, మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్  బొమ్మిడి నాయకర్, తూ.గో. జిల్లా అధ్యక్షులు  కందుల దుర్గేశ్, నెల్లూరు జిల్లా అధ్యక్షులు  మనుక్రాంత్ రెడ్డి, కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్  కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. మత్స్యకారుల అభివృద్ధి, అభ్యున్నతి కోసం జనసేనపార్టీలో ప్రత్యేక విభాగాన్ని అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక విభాగం ఏర్పాటైన దగ్గర నుంచి తీర ప్రాంతాల్లో నివసించే మత్స్యకారుల స్థితిగతులు, వారి సమస్యలు, ఇబ్బందులు తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా కృషి చేస్తుంది అని నాదెండ్ల అన్నారు.

కుటుంబాలను ఖాళీ చేయించిన మంత్రి పరిహారం మాట మరిచారు

అభివృద్ధి పేరిట స్థానిక శాసనసభ్యుడు, మంత్రి దగ్గరుండి దాదాపు 200 మత్స్యకార కుటుంబాలను ఖాళీ చేయించి తరలించారు. వారికి తగిన నష్టపరిహారం (Compensation) ఇస్తామని ఆరోజు హామీ ఇచ్చారు. నేడు పరిహారం మాట మరిచినట్లు ఉన్నారు. మంత్రి అయి ఉండి కూడా కూలీ పనులు చేసుకునే మత్స్యకారుల కుటుంబాల్లో ధైర్యం నింపక పోవడం అనేది దురదృష్టకరం. భవిష్యత్తులో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, మహిళల కోసం మరుగుదొడ్లు, పాఠశాలల ఏర్పాటు కోసం మత్స్యకార వికాస విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాం అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

ఇచ్చిన హామీ ఏమైంది ముఖ్యమంత్రి గారు

సముద్రంలో వేటకు వెళ్లి దురదృష్టవశాత్తు మృతి చెందితే కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ (Chief Minisiter Jagan) హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా ఈ రోజు వరకు కేవలం 64 కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున మాత్రమే నష్టపరిహారం అందించారు. గత ఏడాది అయితే ఒక్క కుటుంబానికి కూడా ఎక్స్ గ్రేషియా (Exgratia) అందించలేదు. జనసేన పార్టీ అధికారంలో లేకపోయినా ఈ రోజు ప్రమాదవశాత్తు మృతిచెందిన జనసైనికుల కుటుంబానికి రూ. 5 లక్షల బీమా అందిస్తున్నారు. అధికారంలో లేని జనసేన పార్టీనే అంత చేస్తున్నప్పుడు అధికారంలో ఉండి ప్రభుత్వం ఎందుకు రూ. 10 లక్షలు ఇవ్వలేకపోతుంది అని నాదెండ్ల ప్రశ్నించారు.

వేలాదిగా తరలివచ్చిన మత్స్యకారులు

సూర్యారావుపేటలో మొదలైన మత్సకార అభ్యున్నతి యాత్ర (Matsakara abhyunnathi Yatra) వలసపాకల, గంగరాజు నగర్ మీదుగా సాగింది. వేలాదిగా మత్స్యకారులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, నియోజక వర్గం ఇంచార్జులు, మత్స్యకార వికాస విభాగం సభ్యులు కూడా పాల్గొన్నారు.

సినీ వివాదానికి శుభం కార్డు పడినట్లే: చిరు
నెలాఖరుకు జీవో వస్తుందని భావన!