waltair veerayyawaltair veerayya

సంక్రాంతికి వస్తున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య
టికెట్ ధరలు పెంపు కోసం అనుమతి కోరిన మైత్రీ మూవీ మేకర్స్
రూ.70 పెంచమని కోరితే రూ.45 వరకు పెంచుకోవచ్చన్న ఏపీ సర్కారు
తెలంగాణలో ఆరో షోకి కూడా అనుమతి

ఈ సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు వస్తుండడంతో బాక్సాఫీసు వద్ద కోలాహలం తప్పదనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన వీరసింహారెడ్డి (Veera Simha Reddy) జనవరి 12న విడుదల కానుంది. మరొపక్కన చిరంజీవి (Chiranjeevi) నటించిన వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం (AP Government) సానుకూల నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరలు పెంచుకునేందుకు ఈ రెండు సినిమాలకు అనుమతి నిచ్చింది. టికెట్ ధరలపై గరిష్ఠంగా రూ.45 వరకు పెంచుకునేందుకు పచ్చజెండా ఊపింది. అయితే ధర పెంపుపై జీఎస్టీ అదనం. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

రూ.70 వరకు పెంచుకుంటామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కోరగా, ఏపీ సర్కారు రూ.45 వరకు పెంచుకోవచ్చని స్పష్టం చేసింది.

అటు, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ రెండు సినిమాల పట్ల ఉదారంగా స్పందించింది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలకు స్పెషల్ షోలు ప్రదర్శించేందుకు ఆమోదం తెలిపింది. దాంతో రిలీజ్ నాడు ఉదయం 4 గంటల నుంచి షోలు ప్రదర్శించనున్నారు. మొత్తం 6 షోలు వేయనున్నారు.

T V Govinda Rao, Highcourt Advocate

ప్యాకేజీ ఖర్మ పవన్ కళ్యాణ్’కి ఎందుకు: రఘురామ కృష్ణంరాజు

Spread the love