Jaggayyapeta JanasenaJaggayyapeta Janasena

జగ్గయ్యపేటలో జనసేన జెండా దిమ్మెను కూల్చివేత

జనసేన పార్టీ (Janasena Party) పేరు విన్నా, జనసేన జండాను (Janasena Janda) చూసినా వైసీపీకి (YCP) భయం పట్టుకొన్నది అని జనసేన (Janasena) పీఏసీ ఛైర్మెన్ (PAC Chairmen) నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆరోపించారు. సైద్ధాంతిక బలంతో…. జన క్షేమం కోసం జనసేన పార్టీ ప్రజల్లో ఉంటున్నది. అటువంటి జనసేన పేరు చెప్పినా, జనసేన జెండా ఎగురుతున్నా వైసీపీ వాళ్ళు ఓర్చుకోలేక పోతున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇచ్చిన స్ఫూర్తితోనే నాయకులు, కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో ప్రజల తరఫున నిలబడు తున్నారు. రెపరెపలాడుతున్న జనసేన జెండా చూస్తే అధికార పక్షంవాళ్లు భయపడుతున్నారు అని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

కాబట్టే జగ్గయ్యపేట (Jaggayyapeta) నియోజకవర్గ కేంద్రంలో జనసేన నాయకులు, పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన జెండా దిమ్మెను అర్థరాత్రి సమయంలో జేసీబీతో కూల్చి వేశారు. ప్రజాస్వామ్యంలో పార్టీ శ్రేణులు జెండాలు ఎగురవేసి, తమ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియ చేస్తుంటాయి. రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానాలు అమలవుతున్నాయనడానికి జగ్గయ్యపేటలో జనసేన జెండా దిమ్మెను దౌర్జన్యంగా కూల్చివేయడమే ఒక నిదర్శనం అని నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

జనసేన అంటే వైసీపీకి ఎంత భయం ఉందో స్థానిక శాసనసభ్యుడు, ఆయన అనుచరుల తీరుతో బయటపడింది. ఈ ఘటనపై నిరసన తెలిపిన జనసేన పార్టీ నేతలపైనే కేసులు నమోదు చేపించి తమ తప్పును కప్పిపుచ్చుకొనేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోంది. కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, పార్టీ నేతలు బొలియాశెట్టి శ్రీకాంత్, శ్రీమతి రావి సౌజన్య, ఈమని కిషోర్, బాడిస మురళీకృష్ణలపై కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నాం అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

పార్టీ ఆదేశాల మేరకు జనసేన నాయకులు పోతిన వెంకట మహేష్, అమ్మిశెట్టి వాసు, అక్కల గాంధీ, పి.ఆర్.కె.కిరణ్, గరికపాటి ప్రసాద్, కాకాని లోకేష్, స్టాలిన్ శంకర్ తదితరులు జగ్గయ్యపేట జనసేన శ్రేణులకు అండగా నిలిచారు.ఈ ఘటనపై ఇప్పటికే కృష్ణా జిల్లా, విజయవాడ నగర నాయకులతో చర్చించాం. ధైర్యంగా నిలవాలని, జగ్గయ్యపేట నాయకులు, కార్యకర్తలకు అవసరమైన అండదండలను పార్టీ ఇస్తుందని తెలియచేశాం అని నాదెండ్ల మనోహర్ వివరించారు.

పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను (Birthday Celebrations) పురస్కరించుకొని పార్టీ శ్రేణులు (Party cadre) ఎక్కడికక్కడ జెండాలు ఆవిష్కరిస్తూ, సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటికి అధికార పక్షం ఆటంకాలు కల్పించే ప్రయత్నాలు చేస్తే ప్రజాస్వామిక పద్ధతిలో ఎదుర్కోండని జనసేన పార్టీ కార్యకర్తలకు నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.

రాజ్యాధికార సాధనలో మెగా బలహీనతలు?
మెగా ప్రత్యామ్న్యాయం ఏమిటంటే?

ఏపీలోని హానికర కాలుష్యంపై జనసేనాని పోరాటం!

Spread the love