నేరం నాది కాదు. నా స్వార్ధానిది అనే ఓ సమాజమా?
ఉత్తిత్తి సాధు పుంగవులకు/మత పెద్దలకు వంగి వంగి వందనాలు.
విధి నిర్వహణలో ఉన్న రక్షక భటులపై భూతు పురాణాలూ?
పన్నీరు సువాసనలు మధ్య ఎప్పుడో వచ్చే మంత్రులు పోయేవరకు
కన్నీరు కారుస్తూ ఓట్లేసిన యజమానులు రోడ్ల పక్కన పడిగాపులు
తప్పు చేసినవాడు దర్జాగా తిరుగుతున్నాడు?
ఇది తప్పు అన్నవాడు చట్టం కౌగిట్లో నలిగిపోతున్నాడు?
ఎమిటీ అంధ రాజ్యం? ఎక్కడున్నది లోపం?
విమర్శకుల విమర్శల్లోనా? లేక పెత్తందారీతనంలోనా?
పార్టీల మత విభజనలు మధ్య మరుగున పడుతున్న సనాతన ధర్మం
అయినా వీటికి బాధ్యులు ఎవ్వరు? తప్పు ఎవ్వరిది?
పాదపూజ చేపించుకొంటున్న ఉత్తిత్తి సాధు పుంగవులు/మత పెద్దలదా?
లేక భటులను తిట్టుకొంటూ పూజలకు వస్తున్న పెద్దలదా?
లేక పెద్దలకు పదవులు కట్టబెడుతున్న ఓటరులదా?
లేక చేవ సచ్చిన సమాజానిదా?
తప్పు అయితే మన్నించండి. ఒప్పు అయితే ఒక్కసారి మీ మనః సాక్షితో
ఆలోచించండి… దుర్మార్గుడి దౌర్జన్యం కంటే మేధావి మౌనం సమాజానికి చాలా చేటు? (Its from Akshara Satyam)
ఏ తప్పు చేసినా ఫలితం అనుకూలంగా వస్టే నేనూ సాధించాను అని, మరియూ ప్రతికూలంగా వస్తె ఎదుటివారు తప్పు అనిచెప్పి తప్పించుకునే స్వార్థపూరిత నాయకులు గురువులు తత్ఫలితం అనుభవించక తప్పదు.