Traffic policeTraffic police

వాహన దారులకు కేంద్రం (Central G0vernment) తీపి కబురు చెప్పింది. కరోనా (corona) వేళలో వాహనదారులకు కేంద్రం ఊరట కల్పించే తీపి కబురు చెప్పింది. మోటార్‌ వాహనాలకు (Motor Vehicles సంబంధించిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ (డీఎల్‌), రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్సీ), ఇతర పర్మిట్లకు సంబంధించిన పత్రాల గడువును ఈ సంవత్సరం సెప్టెంబర్‌ 30 వరకు పెంచింది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (Transport Ministry) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

2020 ఫిబ్రవరి 1తో గడువు ముగిసిన పత్రాలను ఈ సంవత్సరం సెప్టెంబర్‌ 30 వరకు చెలామణిలో ఉంటాయి అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. కరోనా వేళ వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకూడదు అనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు సూచనలు చేసింది. ధ్రువపత్రాల గడువును కేంద్రం ఇప్పటికే పలుమార్లు పొడిగిస్తూ వస్తున్నది. ఈ ఏడాది మార్చిలో కూడా ఇలాంటి ఉత్తర్వులే ఇచ్చినది.

ఇకపై దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు ఏకరీతిన ఒకే పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ జారీ చేయాలని కూడా నిర్ణయించింది.

Satya Nadella as Microsoft Chairmen:

Spread the love