Tadepalli IncidentTadepalli Incident

జనసేన నాయకులు అండగా నిలిచారు
అక్రమ కేసులో అరెస్ట్ అయిన వాలంటీర్ ని విడిపించారు

ఆమె జనసేనానిని (Janasenani) కలసిందని జైల్లో పెట్టారు అనే ఆరోపణలు ఒక్కసారే గుప్పుమన్నాయి. ముఖ్యమంత్రి (Chief Minister) భద్రత నెపంతో దశాబ్దాలుగా ఉంటున్న ఇళ్లను బలవంతంగా ఖాళీ చేయమన్నారు. పరిహారం ఇచ్చిన తర్వాతే ఖాళీ చేస్తామన్నందుకు వేధింపులు మొదలు పెట్టారు. విషయాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దృష్టికి తీసుకువచ్చినందుకు మహిళా వాలంటీర్ మీద కక్ష కట్టారు. అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారు. తాడేపల్లి అమరారెడ్డి కాలనీలో ముఖ్యమంత్రి నివాసం సమీపంలో అధికార పార్టీ చేస్తున్న ఆకృత్యాలు ఇవి. తమకు జరిగిన అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టిందన్న నెపంతో శ్రీమతి శివశ్రీ అనే వాలంటీర్ పై అక్రమ కేసు బనాయించి తాడేపల్లి పోలీస్ స్టేషన్ (Tadepalli Police Station) లో నిర్భంధించారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు ఆమెకు, బాధితులకు అండగా నిలిచారు. పోలీసులతో మాట్లాడి ఆమెను విడిపించారు.

జనసేన పార్టీ (Janasena Party) రాష్ట్ర కార్యదర్శి మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంఛార్జ్  చిల్లపల్లి శ్రీనివాస్, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు  గాదె వెంకటేశ్వరావు, రాష్ట్ర కార్యదర్శి  అమ్మిశెట్టి వాసు తదితరులు విషయాన్ని జిల్లా కలెక్టర్  వివేక్ యాదవ్ ముందు ఉంచారు. వెంటనే ఆమెను విడిపించడంతో పాటు బాధితులకు న్యాయం చేయడం కోసం మూడు డిమాండ్లను ఆయన ముందు ఉంచారు. అమరారెడ్డి నగర్ లో బాధిత కుటుంబాల వ్యవహారంలో విచారణ జరిపి న్యాయం చేయాలి. పరిహారం వ్యవహారంలో పార్టీలకతీతంగా అందరికీ న్యాయం చేయాలి. ప్రజలు వారికి కేటాయించిన స్థలాల్లోకి వెళ్లడానికి నాలుగు నెలల సమయం ఇవ్వాలని కలెక్టర్ ను కోరారు.

బాధితులకు న్యాయం చేయని పక్షంలో జనసేన పార్టీ వారికి అండగా నిలబడుతుందని, వారి తరఫున పోరాడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీ బేతపూడి విజయశేఖర్, వీర మహిళలు శ్రీమతి రావి రమ, శ్రీమతి పాకనాటి రమాదేవి, శ్రీమతి అమృత కళ, శ్రీమతి వరుదు రమాదేవి, పార్టీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు శ్రీ అంబటి తిరుపతిరావు, మండల అధ్యక్షులు శ్రీ దాసరి శివనాగేంద్రం, మంగళగిరి మండలాధ్యక్షులు శ్రీ వాసా శ్రీనివాసరావు, శ్రీ చవ్వాకుల కోటేష్ బాబు, శ్రీ సామల నాగేశ్వరరావు, శ్రీ శెట్టి రామకృష్ణ, శ్రీ ఎద్దు శివమణి, శ్రీ షేక్ వజీర్ భాషా తదితరులు పాల్గొన్నారు.