Representation to RDORepresentation to RDO

మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కోకన్వీనర్ విస్సంపల్లి సిద్దు మాదిగ

సర్వే నెంబర్ 338 లో 5 ఎకరాల 8 సెంట్లు స్మశాన భూమి (Burial Ground) అన్యాక్రాంతానికి గురైంది. ఈ భూమి కబ్జా చేసిన వ్యక్తులపై, రెవెన్యూ రికార్డులను (Revenue Records) తారుమారు చేసిన సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విస్సంపల్లి సిద్దు మాదిగ (Siddu Madiga) డిమాండ్ చేశారు.

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ( ఎమ్మార్పీఎస్) మహాజన సోషలిస్ట్ పార్టీ (MSP) సంయుక్తంగా సోమవారం ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాకి బొడ్డపాటి శ్రీను మాదిగ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కో కన్వీనర్ విసంపల్లి సిద్దు మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడినుండి ప్రదర్శనగా నినాదాలు చేస్తూ ఆర్డిఓ ఆఫీస్ కి చేరుకోవడం జరిగింది. ఆర్డీవోని కలిసి వినతి పత్రం అందజేశారు.

అనంతరం ఆర్డీవో ఆఫీసు ముందు జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సర్వేనెంబర్ 338 లో 5 ఎకరాల 8 సెంట్లు స్మశాన భూమి అన్యాక్రాంతానికి గురైందని ఈ భూమి కబ్జా చేసిన వ్యక్తులపై, రెవెన్యూ రికార్డులను తారుమారు చేసిన సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని అయన తెలిపారు.

తాడువాయి గ్రామం నుంచి సుమారు మహిళలు పురుషులు యువకులు 100 మంది పైగా స్మశాన భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు ఈ విషయంలో న్యాయం చేయాలని కోరారు. మహాజన సోషలిస్టు పార్టీ వాసు చౌదరి, ఎం ఎస్ పి పట్టణ అధ్యక్షులు బొడ్డపాటి పండు మాదిగ, ఎండి సలీమా, సెండ్ర రవి కంకిపాటి రామారావు, దానియేలు మాదిగ, సతీష్ మాదిగ, బొడ్డపాటి కృష్ణ, సిహెచ్ ఏసు, కంకిపాటి సాయమ్మ , అక్కమ్మ, చిన్నదుర్గమ్మ క్రాంతి సెండ్ర యేసు, ( పెద్ద యేసు) మాదిగ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

–గురువు బాబురావు

సలహాదారుల వ్యవస్థ రాజ్యాంగబద్ధతపై సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు!