తెలంగాణ (Telangana) దుబ్బాకలో (Dubbaka) జరిగిన ఉప ఎన్నికలో భాజాపా (BJP) విజయ కేతనం ఎగురవేసింది. దుబ్బాక ఉప ఎన్నిక (Dubbaka Bye Elections) తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపింది. భాజపా జయకేతనం ఆ పార్టీ శ్రేణుల్లో అంతులేని ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ పార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు (Raghunandan Rao) తన సమీప ప్రత్యర్థి తెరాసకు (TRS) చెందిన సోలిపేట సుజాతపై విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచీ ఆధిక్యం ప్రదర్శించిన BJP మధ్యలో కాస్త తడబడినప్పటికీ చివరిలో పుంజుకుని అంతిమంగా విజయాన్ని సాధించారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా భాజపా శ్రేణులు (BJP) సంబరాల్లో మునిగి తేలాయి.
మొత్తం 23 రౌండ్లలో జరిగిన లెక్కింపు ప్రక్రియ ఎంతో ఉత్కంఠతో సాగింది. రౌండ్ రౌండ్‌కూ తెరాస, భాజపా మధ్య విజయం దోబూచులాడింది. మొదటి ఐదు రౌండ్లతో పాటు 8, 9, 11, 20, 22, 23 రౌండ్లలో భాజపా ఆధిక్యం ప్రదర్శించగా..6, 7, 10, 13, 14, 15, 16, 17, 18, 19 రౌండ్లలో అధికార తెరాస హవా కొనసాగింది. 12వ రౌండ్‌లో కాంగ్రెస్ ముందంజలో నిలిచింది. మొత్తం 23 రౌండ్లు. భాజపా 12 రౌండ్లలో ఆధిక్యం కనబరిచింది. తెరాస 10 రౌండ్లలో గెలిచింది. ఒక రౌండ్‌లో కాంగ్రెస్ ముందుంది. అయితే భాజపా, తెరాస మధ్య స్వల్వ ఆధిక్యమే ఉండటంతో ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న దానిపై చివరి వరకు స్పష్టత రాలేదు.
23వ రౌండ్‌లో భాజపా 412 ఓట్లు ఆధిక్యం సాధించడంతో అప్పటికే 1058 మెజార్టీతో ఉన్న ఆ పార్టీ అభ్యర్థి రఘునందర్‌రావు 1470 ఓట్ల ఆధిక్యంతో విజయ గంటా మోగించారు.