విజయవాడ పశ్చిమ (Vijayawada West), జగ్గయ్యపేటలలో (Jaggayyapeta) జనసేన పార్టీ జెండా (Janasena Party Flag) ఆవిష్కరణలను వై.సి.పి. వర్గాలు (YCP) అడ్డుకున్న తీరు అప్రజాస్వామ్యం. ఇది వారిలోని ఓటమి భయాన్ని తేటతెల్లం చేస్తోంది అని జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విమర్శించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ (Pothina venkata Mahesh) శుక్రవారం జనసేన జెండా ఆవిష్కరణ చేయకుండా వై.సి.పి. నేతలు, పోలీసులు (AP Police) అడ్డుపడిన వైనం, మహేష్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేయడానికి చేసిన ప్రయత్నాలను పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు.
అదే విధంగా జగ్గయ్యపేటలో జనసేన పతాక ఆవిష్కరణ కోసం పార్టీ శ్రేణులు నిర్మించుకున్న జెండా దిమ్మెను బుధవారం అర్థరాత్రి వై.సి.పి. దౌర్జన్యకారులు జె.సి.బి.తో కూల్చివేసిన సంఘటనలో దోషులపై కేసు నమోదు చేయడానికి బదులు ప్రశ్నించిన జనసేన నాయకులపై (Janasena Leaders) కేసులు (Police cases) పెట్టడం ఎంతవరకు న్యాయబద్ధమో పోలీస్ అధికారులు ఆలోచించాలని జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రశించారు.
జనసేన శ్రేణులు తలపెడుతున్న ప్రతి కార్యక్రమాన్ని అనుమతి లేదన్న (Police Permission) సాకుతో పోలీసులు అడ్డుపడడం అధికార పార్టీకి వత్తాసు పలకడంగానే భావిస్తున్నాం. అధికార పార్టీ అన్ని కార్యక్రమాలను ముందస్తు అనుమతితోనే చేస్తున్నారా? వారు వాడవాడల్లో పెట్టిన విగ్రహాలకు, జెండా దిమ్మలు, వారు వేస్తున్న రంగులకు ముందుగా మున్సిపల్, పంచాయితీల అనుమతి తీసుకుంటున్నారా? అన్నిటికీ అనుమతులు ఉన్నాయని పోలీసులు ప్రకటించగలరా? అనుమతులు లేకపోతే వాటిని తొలగిస్తారా అని పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశించించారు?
పోలీసులు ధర్మాన్ని పాటించాలి
జనసేన ఉనికిని తీసిపారేయడం ఎవరి తరం కాదు. ప్రజలే పార్టీని కాపాడు కుంటారు. శాంతి భద్రతలకు (Law and order) ఇబ్బంది కలగచేయకూడదనే సదుద్దేశ్యంతోనే నిన్న, మొన్న ఇంత జరుగుతున్నా నేను రోడ్ మీదకు రానిది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే నేను రోడ్డెక్కడం తప్పదు. పోతిన మహేష్ కు, జగ్గయ్యపేట సంఘటనలో అక్రమ కేసులకు గురైన బండ్రెడ్డి రామకృష్ణ.. ఇతర నాయకులు, కార్యకర్తలకు జనసేన అండగా ఉంటుంది. పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరారు.
ప్రభుత్వంలోని పెద్దలు, ఈ శాసనసభ్యులు ఈ రోజు ఉంటారు.. రేపు పదవి ఊడితే ఇంటికి పోతారు. కానీ పోలీసులు మాత్రం మీ సర్వీస్ కాలమంతా డ్యూటీలోనే గడుపుతారు. మరో పార్టీ ప్రభుత్వం వస్తే మీరు తలదించుకునే పరిస్థితి రాకూడని కోరుకుంటున్నాను. అందువల్ల ధర్మాన్ని పాటించమని పోలీస్ అధికారులను (Police officers) కోరుతున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.