మహాభారతంలో (Mahabharat) అధికారం కోసం (Political Power)
నిరంతరం ప్రయత్నం చేసిన కౌరవులు (Kauravas) మాత్రమే
సుదీర్ఘ కాలం పాటు అధికారం అనుభవించారు.
అలానే అధికారం కోసం ఇష్టం లేకపోయినా
“ఆర్యావర్తనంలో మార్పు” అనే కృష్ణుని మాట విని
అధికారం కోసం యుద్ధం చేసిన పాండవులు (Pandavas)
అధికారాన్ని సాధించారు. మార్పు తీసికొచ్చారు.
మార్పు, అణచివేతలు, ధర్మం
అన్న భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు
లాంటి వారు మార్పు తేలేక పోయారు
సరి కదా వినాశనానికి మూలా కారకులు అయ్యారు.
అధికారాన్ని త్యాగం చేసిన భీష్ముడుగాని
వ్యక్తిగత కక్షతో అధర్మం పంచన చేరిన కర్ణుడి గాని
కొడుకు మీద ప్రేమతో అధర్మ యుద్ధం చేసిన ద్రోణుడు లాంటివాళ్లు
అధికారాన్ని సాధించలేదు సరి కదా
కురుక్షేత్ర సంగ్రామానికి కారకులయ్యారు
చరిత్రలో మాయని మచ్చగా మిగిలారు.
రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
మాకు అధికారమే ముఖ్యం కాదు అనే
పదాలు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి
కానీ పార్టీని నిలబెట్ట లేవు. ప్రజలకు కావాల్సిన మార్పుని తెలేవు.
పవర్ షేరింగ్ ఉంటుంది అని కూడా చెప్ప్పుకోవడానికి
ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతుంటే
మనల్ని నమ్మేది ఎలా? మార్పు సాధించేది ఎలా?
ఒక పార్టీ నిలబడాలన్నా, వ్యవస్థల్లో మార్పు తేవాలన్న
అధికార తక్షణ అవసరం. అణగారిన వర్గాల మనుగడకు
కూడా మీరు అధికారంలోకి రావడం ముఖ్యం.
ముమ్మాటికీ పొత్తులు అవసరమే. అధికార షేరింగ్ ఉంటుంది అని మీరు చెప్పింది వాస్తవమే. కానీ అధికార షేరింగ్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం అవుతున్నామా?
ఆలోచించండి…. వంచనతోనైనా యుద్ధం చేసిన పాండవుల వలెనే మార్పు సంభవించింది తప్ప, అధికారాన్ని త్యాగం చేసిన భీష్ముడు, కర్ణుడు లాంటి వారి వళ్ళ కాదు. అధికార షేరింగ్ పై స్పష్టత నివ్వండి (It’s from Akshara Satyam)