Sheik Riyaz and KKSheik Riyaz and KK

ఓటమి భయంతోనే పేర్నినాని అనే కు.. మొరుగుతోంది
పేర్ని నాని అనే కు.. కొంపలోనూ – క్యాబినెట్లోనూ పనికి రాడు?
ఆస్తుల కోసం తల్లి, చెల్లిని తరిమేసిన చరిత్ర ఎవరిది?
తండ్రి శవం పక్కనే సంతకాల సేకరణ?
వైఎస్సార్ మరణం కుట్ర అన్న షర్మిల వ్యాఖ్యలకు వివరణ ఎక్కడ?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో YCP ప్రమేయం ఉందా లేదా?
జనసేన నాయకులు షేక్ రియాజ్, కళ్యాణం శివ శ్రీనివాస్

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YCP) 45 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని జనసేన పార్టీ (Janasena Party) అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఈ మాటలకు తాడేపల్లి ప్యాలెస్’లో (Tadepalli Palace) వణుకు పుట్టిందని… అందుకే పెంపుడు కు..లు మొరగడం మొదలు పెట్టాయని జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ (Sheik Riyaz) వ్యాఖ్యానించారు. ఆయన, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ (KK) ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు.

షేక్ రియాజ్ మాట్లాడుతూ “పేర్ని నాని (Perni Nani) అనే కు… పవన్ కళ్యాణ్’పై ఎంత మొరిగినా మళ్లీ మంత్రి పదవి రాదు. చిరంజీవిని (Chiranjeevi) పవన్ కల్యాణ్ వెన్నుపోటు పొడిచారు అని ఈ కు… మొరిగింది. ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో చెప్పాలి. సున్నిత మనసు కలిగిన చిరంజీవి నానిలాంటి చెత్తవారి రాజకీయాలకు ఇబ్బందిపడి పార్టీని విలీనం చేశారు. మీలాంటి చెత్తను ఏరిపారేయడానికే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టాలని తాడేపల్లి ప్యాలెస్, అక్కడి పెంపుడు కు…లు ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదు అంటూ జనసేన నాయకులు (Janasena Leaders) షేక్ రియాజ్ తీవ్రమైన ఆరోపణలు చేసారు.

పదవుల కోసం సొంత తండ్రి, బాబాయ్ లను ఎవరు చంపుకున్నారు. ఆ చరిత్ర ఎవరిదో తెలీదా? ఆస్తుల కోసం తల్లిని, చెల్లిని పక్క రాష్ట్రానికి తరిమేసిన చరిత్ర ఎవరిదో తెలీదా? మీ నాయకులు చంచల్ గూడ జైల్లో ఉంటే ‘జగనన్న విడిచిన బాణాన్ని’ అంటూ ఊరూరా తిరిగిన షర్మిలను (Sharmila) ఎవరు మోసం చేసారో, ఎలా మోసం చేసారో ప్రజలందరికి బాగా తెలుసు అంటూ జనసేన నాయకులూ తీవ్రమైన ఆరోపణలు చేసారు.

* రిలయన్స్ స్టోర్స్ మీద దాడి చేయలేదా?

తన తండ్రి మరణం వెనక కుట్ర ఉందని.. ఇప్పుడు తన హత్యకు కుట్ర చేస్తున్నారు షర్మిలా భయపడుతుంది. వైఎస్ఆర్ మరణానికి, ఇప్పుడు షర్మిలా హత్యకు కుట్ర చేస్తుంది ఎవరో ప్యాలెస్ విశ్వాసులు చెప్పాలి. వైఎస్ఆర్ మరణం వెనుక కుట్ర ఉందనే అనుమాంనంతో ఆ రోజు రిలయన్స్ స్టోర్లు (Reliance stores) ఎవరు పగల గొట్టారు. అది తప్పా కాదా? ఇప్పుడు ఆ కంపెనీకి దగ్గరగా ఉండే వ్యక్తికి తమ పార్టీ నుంచి రాజ్యసభ టికెట్ ఇవ్వడం వెనక ఉన్న కథ ఏమైనా కధ ఉన్నదా? లేదా? ఉంటే అది ఏమిటో కూడా చెప్పాలి అని షేక్ రియాజ్ ఆరోపించారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో జగన్ కుటుంబ సభ్యుల ప్రమేయంపై ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఏమిటో కూడా చెప్పాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్’లో తన ప్రమేయం లేదు అని తెలంగాణ నాయకులు (Telangana Leaders) మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పారు. ఆ ధైర్యం మీకు ఎందుకు లేదు? కోర్టులో తన కేసుకు సంబంధించిన పేపర్లను దొంగతనం చేసిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడం సిగ్గుచేటు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలుస్తామని మీ నాయకుడు చెబుతున్నాడు. అలా గెలవలేని పక్షంలో మీ పార్టీని బంగాళఖాతంలో కలిపేస్తారా? ఇంకోసారి మా నాయకుడు మీద అవాకులు చెవాకులు పేలితే పరిస్థితులు వేరేగా ఉంటాయని” షేక్ రియాజ్ హెచ్చరించారు.

* పేర్ని నానిని మహిళలు వెంటపడి కొట్టడం ఖాయం?

జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ (KK) మాట్లాడుతూ రాష్ట్రంలో నడుస్తోన్న రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడి పవన్ కళ్యాణ్’ని ముఖ్యమంత్రిని (Chief Minister) చేయడం తథ్యమని అన్నారు. ఆయన మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక్క మాట మాట్లాడితే పేర్ని నాని (Perni Nani) అనే పెద్ద కు.. తోక ఊపుకొంటూ మెరుగుతుంది. కాపు సామాజిక వర్గంలో (Kapu Community) ఇలాంటి వ్యక్తి పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం. కాపు సామాజికవర్గాన్ని వైసీపీ ప్రభుత్వానికి తాకట్టు పెట్టిన వ్యక్తి పేర్ని నాని. కొంపలోకి పనికిరాడు… క్యాబినెట్’కు పనికిరాని బోడి లింగం అతను. జగన్ పక్కన పెట్టేసినా… మొరగడం మాత్రం ఆపడం లేదు. పేర్ని నాని తండ్రి బతికి ఉంటే … కాపు సామాజిక వర్గానికి ఈ పెద్ద కు.. చేసిన అన్యాయం చూసి వెంటనే గుండె ఆగి మృతి చెందేవాడు? పవన్ కళ్యాణ్’పై ఇంకోసారి అవాకులు చెవాకులు పేలితే మీ నియోజకవర్గంలోని మహిళలే మిమ్మల్ని చీపుర్లు, చేటలతో తరిమికొట్టే పరిస్థితి వస్తుంది అని వైసీపీపై విరుచుకు పడ్డారు.

కాపు సామాజికవర్గానికి (Kapu Community) చేసిన మేలు ఏంటి?

ఇసుక, మట్టి, మద్యం ఇలా ప్రతిదానిలో దోచుకోవడం… దాచుకోవడం తప్ప కాపు సామాజికవర్గానికి మీ ప్రభుత్వం చేసిన మేలు ఏంటి? ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీలు ఏంటి? ఈ మూడున్నరేళ్లలో మీరు ఏం చేశారో శ్వేత పత్రం (white Paper) విడుదల చేసే దమ్ముందా? ముఖ్యమంత్రి కావాలనే ఆశతో తండ్రి శవం దగ్గర సంతకాలు సేకరించిన మాట వాస్తవం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో (Congress Government) ఉన్నప్పుడు జగన్’కు తిట్టిన వాళ్లు… ఇప్పుడు వైసీపీలో మంత్రి పదవులు అనుభవిస్తున్న మాట వాస్తవం కాదా? రాష్ట్రంలో దాదాపు 3వేల మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడితే… వాటిని పవన్ కళ్యాణ్ బయటపెట్టే వరకు మీకు తెలియదు? ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతులకు జనసేన (Janasena) అధ్యక్షులు అండగా నిలబడితే మీరు చూసి ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మీ పార్టీకి 45 సీట్లు కాదు కనీసం 25 సీట్లు కూడా రావని” జనసేన నాయకులూ శ్రీనివాస్ ఆరోపించారు.

జనసేన పార్టీ నాయకులూ చేసిన ఈ ఆరోపణలపై వైసీపీ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

పుంజుకొంటున్న జనసేన – ఓటమి అంచులో వైసీపీ
జనసేనాని సంచలన వ్యాఖ్యలు

Spread the love