Pawan Kalyan with VarahiPawan Kalyan with Varahi

నిజానికి రాజకీయాలు (AP Politics) గాని రాజకీయాలు ద్వారా అధికారం సంపాదించడం గాని జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి అవసరం లేదు. ఎందుకంటే ఆయనకున్న ఛరిస్మా, డబ్బు ఆయనకు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం అలానే అయన ద్వారా అధికారం (Power to suppressed classes) పొందడం అనే అవసరం తాడిత, పీడిత, బాధిత అణగారిన వర్గాలకు ఉంది.

ఈ విషయాన్ని ఈ వర్గాలు తెలిసికోవు. పవన్ కళ్యాణ్ తన స్వేదంతో సంపాదించిన డబ్బుతో, అలానే కూలీ, నాలీ చేసికొంటున్న జనసైనికులు ఇస్తున్న ఉడతా పడతా సాయంతో పార్టీ నడుపుతున్నాడు అనే వాస్తవాన్ని కూడా మనం అర్ధం చేసికోము. జనసేనకు వెయ్యి మొదలు లక్ష వరకు చందాగా ఇస్తున్న కూలీ నాలీ కూడా సేనానిని ఈనాడు ప్రశ్నించరు. కానీ జనసేన పార్టీకి కనీస నైతైక మద్దతు కూడా ఇవ్వని, ఒక్క రూపాయి కూడా పార్టీకి సాయం చేయని, అలానే పాలక పార్టీల పెరట్లో సేదతీరుతున్న బానిస వర్గాలు మాత్రం జనసేనాని పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తున్నారు అనేది అక్షర సత్యం కాదంటారా?

ఇంతకీ పాలక పార్టీల ఆరోపణ ఏమిటి?

ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికీ జనసేనాని పవన్ కళ్యాణ్ పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీచేసే స్థితికి పార్టీని తేలేక పోయారు. పొత్తులకు వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి. పొత్తుల్లో కూడా హైదరాబాద్ లేదా మంగళగిరి ఆఫీస్ వదిలి జనసేనాని ప్రజల్లోకి ఎందుకు రాలేక పోతున్నారు. ప్రజల్లోకి వచ్చి పార్టీ క్యాడర్ ని ఎన్నికలకు ఎందుకు సమాయత్తం చేయలేక పోతున్నారు? మనందరి మెదడులను తెలిచి వేస్తున్న ప్రశ్న ఇదే.

అసలు పవన్ కళ్యాణ్ బయటకు రావడం లేదా?

బోడోడి పెళ్ళికి జుట్టు నుండి అన్నీ వెతుక్కోవాల్సిన పరిస్థితి అన్నట్లు ఉంటుంది డబ్బు లేనోడి పార్టీ అంటే…

లక్షల కోట్లు ఉన్న వాడి పార్టీని, రాసిచ్చిన ప్రామిసరీ నోట్లు తప్ప డబ్బు లేనోడి పార్టీని సరి పోల్చడం అనేది మన బలహీనత.

అలానే 24 గంటల్లో వేలకోట్లను చందాలుగా ఇవ్వగల సామజిక వర్గ మద్దతు ఉన్న పార్టీని, కనీసం నైతిక మద్దతు కూడా ఇవ్వడం చేతకాని మన అణగారిన వర్గాల జనసేన పార్టీని పోల్చి చూడడం మన అజ్ఞానం.

దాసరి నారాయణ రావు తెలుగుతల్లి పార్టీలో ఏమి అయ్యింది అంటే?

అందుకే డబ్బులేనోడు పార్టీ పెడితే ఎలా ఉంతుంది అనేదానిపై ఒక వాస్తవ కధనీ చెబుతా…

సుమారు 1998 లో వివిధ కులాలకు (బీసీ, దళిత, కాపు) చెందిన 28 ప్రధాన కుల సంఘాలు సూర్యాపేటలో ఒక భారీ బహిరంగ సమావేశం పెట్టాయి. దానికి దాసరి నారాయణ రావు గారు ముఖ్య అతిధి. ఆ సమావేశంలో దాసరి గారు రాజకీయ పార్టీ పెట్టాలి అని ప్రకటించాలి అని ఆలోచన. దాసరి గారికి పొలిటికల్ సెక్రటరీ గా నేను ఉండేవాడిని.

దాసరి గారి ఆదేశాల మేరకు సుమారు 70 కారులు పెట్టాం. వాటికి డీజిల్ తదితర ఖర్చులకు డబ్బులు కావాలి.

దాసరి అనుచర గానం, వివిధ అగ్ర కాపు తదితర కుల నాయకులూ ఉదయమే 9 గంటల కే కారుల్లో వచ్చి కూర్చొన్నారు. అన్ని కారులు ఫుల్ అయిపోయాయి.

ఉదయం 11 గంటలు కావస్తుంది. దాసరి గారు మాత్రం సూర్యాపేట బయలు దేరడానికి స్టోరీ సిట్టింగ్ వదలి బయటకు రావడం లేదు. మిరియాల వెంకటరావు గారు లాంటి పెద్దలు వచ్చి నా మీద నసగడం మొదలు పెట్టారు. అందుకే నయ్యా సినిమా వాళ్ళని నమ్మి రాజకీయాల్లోకి రాకూడదు అని సూటి పోటీ మాటలు అనడం మొదలు పెట్టారు.

అయితే సూర్యపేట వెళ్ళడానికి అవసరమైన 50 వేలు కూడా లేక దాసరి గారు బయలుదేరడం ఆలస్యం అవుతున్నది అని నాకు తెలిసినా వాళ్లకు చెప్పలేని పరిస్థితి. చివరకు దాసరికి ఇవ్వలిసిన ఒక ప్రముఖ వ్యక్తి ఏడిపించి ఏడిపించి 11 గంటలకి ఇచ్చాడు. దాసరి గారు ఆ యాభై వేలు నాకు ఖర్చులకు గాను ఇవ్వగా మేము సుమారు 11.30 గంటలకు సూర్యాపేట బయలు దేరాము.

దాసరి గారికి ఇవ్వలిసిన డబ్బులను కూడా దాసరికి అందకుండా నాటి ప్రభుత్వం కట్టడి చేసింది. కారులు ఎక్కి కూర్చున్న ఒక్కడు కూడా ఒక్క రూపాయి ఇవ్వడు సరికదా సినిమా వాళ్లకు రాజకీయాలు తెలీదు అని చులకనగా అనేవారు.

ఇంతకీ జనసేనాని పవన్ కళ్యాణ్ పై అక్షర సందేశం?

డబ్బు లేనోడు పార్టీ పెడితే ఎలా ఉండాది అని చెప్పడం కోసం పై కధ అంతా చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి బయటికి రావాలంటే రోజుకి సుమారు 30 లక్షలు అయినా ఖర్చు అవుతాది. మీటింగ్ పెడితే కనీసం ఒక కోటి అయినా అయ్యే రోజులు ఇవి. కళ్యాణ్ గారు డబ్బులు రేక బయటకు రావడం లేదు అని నేను చెప్పడం లేదు. కానీ డబ్బు లేనివాడు పార్టీకి కొన్ని సాధక బాధకాలు ఉంటాయి. అర్ధం చేసికోవాలి అని చెప్పదలచు కొన్నా.

జనసేన అంటే లక్ష్యం తప్ప లక్షలు లేనోడి పార్టీ. మా పవన్ సీఎం అవ్వాలి అనే ఆశ ఉన్నోడు తప్ప ఆదరణ ఇవ్వలేని అనుచర గణం ఉన్న వారి పార్టీ. జనసేన లాంటి తాడిత, పీడిత, బాధిత అణగారిన వర్గాల పార్టీ యొక్క సాధక బాధకాలను అర్ధం చేసికొని సహకరిస్తారు అనే ఆవేదనతో వచ్చింది అక్షర సందేశం తప్ప ఎవ్వరి మనోభావాలను కించ పర్చాలి అని కాదు.

ఆలోచించండి… ఒక డబ్బు ఉన్నవాడు ఒక పెద్ద పాలస్ ని కూడా ఆరు నెలల్లో కట్టేసి కోగలడు. కానీ పేదోడు ఒక చిన్న గూడుని కట్టుకోవడానికి కూడా తరాలకి తరాలే పట్టవచ్చు. జనసేన పార్టీ కూడా పేదోడి గూడి లాంటిది. (It’s from Akshara Satyam)

జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Spread the love