Chiru at AirportChiru at Airport

సీఎం జగన్’తో భేటీ అనంతరం చిరు చంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా రంగ (Telugu Film Industry) సమస్యలను పరిష్కరించడంలో ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) సానుకూలంగా స్పందించారు అని మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chirajeevi) అన్నారు. సీఎం జగన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు చిరు ప్రత్యేక విమానంలో (Special Flight) వచ్చి సినీ రంగ సమస్యలను సీఎం జగన్’తో చర్చించారు.

నేను ఒక పక్షానే ఉండను. అటు ఇటు అన్ని రకాలుగానూ అందరినీ సమదృష్టితో చూస్తాను. అందరికీ ఆమోదయోగ్యమైన విధివిధానాలను తీసుకుంటాను. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని సీఎం జగన్ భరోసా ఇచ్చారు అని చిరు అన్నారు. దేనితో సమస్యలు సణుక్కులంగా పరిస్కారం అవుతాయి అనే భరోసాతో ధైర్యం వచ్చింది అని మెగాస్టార్ అన్నారు.

ఇండస్ట్రీ సమస్యలపై చర్చించేందుకు సీఎం జగన్‌తో చిరు భేటీ అయ్యారు. గురువారం జరిగిన భేటీలో చిరు గంటకు పైగా జగన్’తో ఈ సమావేశం అయ్యారు. భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయం వద్ద చిరంజీవి (Chiranjeevi) మీడియాతో మాట్లాడారు. జగన్‌ ఆహ్వానం మేరకే ఆయనతో భేటీ అయ్యానని, ఆ భేటీ సంతృఫ్తికరంగా జరిగిందని మెగాస్టార్ తెలిపారు.

సీఎం దంపతుల ఆతిథ్యం ఎంతో బాగుందని చిరు ప్రశంసించారు. ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విభాగాల సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చిరు చెప్పారు. సినిమా టికెట్ ధరలపై (Cinema Ticket Rates) ప్రభుత్వం వేసిన కమిటీతోనూ చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పినట్లు చిరంజీవి వివరించారు. జీవో 35 గురించి పునరాలోచిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు చిరు చెప్పారు.

సమస్య పరిష్కారం అయ్యే వరకు పరిశ్రమ వ్యక్తులు ఎవరూ మీడియాతో మాట్లాడొద్దని మెగాస్టార్ చూచించారు. తాను సినీ పరిశ్రమ పెద్దగా రాలేదని, పరిశ్రమం బిడ్డగా వచ్చానని చిరు చెప్పారు. ఇండస్ట్రీలోని అందరితో చర్చించి, మళ్లీ ఇంకోసారి సీఎం జగన్‌తో భేటీ అవుతానని చిరు చెప్పారు.

సిద్ది సుబ్బరామయ్య కుటుంబానికి పరిహారం చెల్లించాలి: సికా