ఎట్టకేలకు నడిగర్ సంఘం (Nadigar Sangam) ఎన్నికల ఫలితాలను (Results) ఎట్టకేలకు ప్రకటించారు. దక్షిణ భారత నటీనటులు సంఘం (నడిగర్) అధ్యక్షుడుగా నాజర్ ఎన్నికయ్యినట్లు ప్రకటించారు. 2019లో నడిగర్ సంఘం ఎన్నికలు జరిగాయి. ఒక ప్యానల్ నుంచి నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ సెక్రటరీగా పోటీ చేశారు. ఇంకొక ప్యానల్ నుంచి భాగ్యరాజ్ అధ్యక్షుడిగా, గణేశన్ సెక్రటరీగా బరిలోకి దిగారు. విశాల్ ఓటింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డారంటూ అప్పట్లో ఫిర్యాదు చేయడంతో మద్రాస్ కోర్టు (Madras High Court) కౌంటింగ్‌ను నిలిపేసింది.
తాజాగా విశ్రాంత జడ్జి సమక్షంలో కౌంటింగ్ (Counting) జరిపి ఫలితాలను ఆదివారం విడుదల చేశారు. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్ మరోసారి విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా విశాల్, ట్రెజరర్‌గా కార్తీ విజయం సాధించినట్లు ప్రకటించారు.