పంజాబ్ రాష్ట్రంలో (Punjab) ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్ర మోదీకి (Narendra Modi) ఎదురైన సంఘటనను దురదృష్ణకరంగా భావిస్తున్నాను అని పవన్ (Pawan Kalyan) అన్నారు. దేశ ప్రధాని ప్రయాణంలో 20 నిమిషాలపాటు ముందుకు వెళ్లలేక రోడ్డుపైనే ఆయన కారు నిలిచిపోయే పరిస్థితి అవాంఛనీయం. ప్రజాస్వామ్యంలో (Democracy) నిరసన వ్యక్తం చేయడం ప్రజల హక్కే అయినప్పటికీ ప్రధాని భద్రతకు ఇబ్బంది కలిగేలా ఆ నిరసన ఉండరాదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎటువంటి పరిస్థితులలోనూ ప్రధాన మంత్రి (Prime Minister) గౌరవానికి భంగకరంగా ఏ పార్టీ ప్రభుత్వమైనా, ఎటువంటి వ్యక్తులైనా ప్రవర్తించరాదు. ప్రధాన మంత్రిని గౌరవించడం అంటే మన జాతిని, మన దేశాన్ని గౌరవించడమే. ఈ దుస్సంఘటన కావాలని చేసినట్లు నేను భావించడం లేదు. అయితే ప్రధాన మంత్రి ఇతర రాష్ట్రాలలో పర్యటనకు వచ్చినప్పుడు ప్రోటోకాల్స్’ను (Protocols) తు.చ. తప్పకుండా పాటించవలసిన బాధ్యత ఆయా రాష్ట్రాలపైనే ఉంటుంది. ఇది సర్వవిదితమే.
మరోసారి ప్రధాన మంత్రికిగానీ, అత్యంత బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారెవరికీ ఇటువంటి పరిస్థితి ఎదురుకాకూడదని పవన్ కోరారు. క్లిష్ట పరిస్థితుల్లో సంయమనం పాటించిన నరేంద్ర మోదీకి (Narendra Modi) గౌరవపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు.