Amit Shah at MuchinthalAmit Shah at Muchinthal

ముచ్చింతల్‌ దివ్యక్షేత్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

ముచ్చింతల్‌’లో (Muchintal) కొలువైయున్న సమతా మూర్తిని (State of equality) కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా (Amit Shah) దర్శించుకున్నారు. హైదరాబాద్, శంషాబాద్ సమీపంలో, శ్రీరామనగరంలో జరుగుతున్న రామానుజాచార్యుల సమతా మూర్తి (Samata Murthy) సహస్రాబ్ది ఉత్సవాలకు అమిత్ షా హాజరయ్యారు. ఆయనకు చినజీయర్ స్వామి, మై హోం రామేశ్వరరావు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.

స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చిన షా

సనాతన ధర్మాన్ని (Sanatana Dharma) మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇదే సరైన సమయం. సమతామూర్తి నిర్మాణం జరిగిన సమయంలోనే భవ్యమైన రామమందిర పునర్నిర్మాణం, 650 సంవత్సరాల తర్వాత కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌, కేదార్‌ధామ్‌, బదరీధామ్‌ పునర్నిర్మాణం లాంటివి జరిగాయి. ఇది విధి, విధాత మనకి ఇచ్చిన ఆశీర్వాదం’’ అని అమిత్‌షా అన్నారు.

రామానుజాచార్యుల జీవితమే ఓ సందేశం. అందరూ సమానులే అని వెయ్యేళ్ల క్రితమే రామానుజాచార్యులు చాటారు. ఆలయ ప్రవేశంలో అందరికీ సమాన హక్కు ఉందని చెప్పడమే కాకుండా సంపూర్ణంగా అమలుచేసిన గొప్ప వ్యక్తి రామానుజాచార్యులని అమిత్ షా కొనియాడారు.

రామానుజాచార్యులు విశిష్టాద్వైతమార్గంతో (Visitaadhvaith) సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చారు. ఈ మార్గంతోనే దేశం తూర్పు నుంచి పడమర, ఉత్తరం నుంచి దక్షిణం వరకూ ఏకతాటిపై నిలబడిందని గుర్తు చేశారు. సమతామూర్తి యుగయుగాల వరకూ రామానుజాచార్యుల సందేశాన్ని తెలుపుతుందని, విశిష్టాద్వైతం భూమి ఉన్నంత కాలం ఉంటుందని షా అన్నారు.

జీవితాన్ని అర్పించిన మహాపురుషుల (Legends) విగ్రహాలను చూస్తే.. ఎంతో ఉత్సాహం లభిస్తుంది. మనల్ని మరింత ముందుకు వెళ్లే శక్తిని ఇవి అందిస్తాయని అమిత్ షా అన్నారు. తాను కూడా ఈరోజు అలాంటి శక్తిని, ఉత్సాహాన్ని పొందానని ఆనందంతో చెప్పారు.

ధర్మం, సమాజం కోసం ఏదైనా చేయాలన్న తపన ఉన్న చినజీయర్‌ స్వామి కృషి యుగాల వరకూ సమాజానికి స్ఫూర్తి నింపుతుంది. ఇంత గొప్ప కార్యాన్ని చేపట్టినందుకు సాధువులు, దేశం తరపున చిన జీయర్ స్వామికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అమిత్ షా అన్నారు. సనాతన ధర్మంలోనే అందరి మూలాలూ ఉన్నాయన్న విషయాన్ని తెలిపేందుకు అన్ని మతాలు, సంప్రదాయాలు పాటించే వారిని ఇక్కడికి వచ్చేలా ప్రేరణ కల్పించాలని సూచించారు.

నేను పుట్టింది వైష్ణవుడిగానే

నేను జన్మతః వైష్ణవుడినని, తన తల్లి వల్లభాచార్య సిద్ధాంతాలపైనే జీవితాన్ని గడిపారని అమిత్‌ షా ఈ సందర్భంగా వెల్లడించారు. అహ్మదాబాద్‌కు సమీపంలో తాను పుట్టి పెరిగిన గ్రామము ఉందని. అక్కడ 150 ఏళ్లనాటి గ్రంథాలయంలో రామానుజాచార్యులు రచించిన తొమ్మిది గ్రంథాలు చదివాను అని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు.

అమిత్ షా ఆశ్రమానికి చేరుకున్నక తిరునామం ధరించి, ముచ్చింతల్‌లోని దివ్యక్షేత్రాలను సందర్శించారు. సమతా మూర్తి శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ఆయన దర్శించారు. సుమారు రెండున్నర గంటల పాటు ఆయన సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్నారు. యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం ఆయన ముచ్చింతల్ ఆశ్రమం నుంచి అమిత్ షా బయలు దేరారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అధికారులు ఘన స్వాగతం పలికారు.

రామానుజాచార్యులు భావితరాలకు ప్రేరణ: సీఎం జగన్

Spread the love