ఇది ఎవరికి వరం? ఎవరికి శాపం
హోదా ఎవరికి సంజీవిని? ఎవరికి ఎండమావి?
ప్రత్యేక హోదా (Special Status0 నాయకులకా లేక ఆంధ్ర ప్రజలకా? అనేది ఒకసారి విశ్లేషిద్దాం.` ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ (combined andhra pradesh) విభజన సమయంలో ప్రత్యేక హోదా అనే అంశాన్ని తెరపైకి లేపి ఆంధ్రుల్లో (andhrulu0 ఆశలను చిగురింప చేసిన వ్యక్తి వెంకయ్య నాయుడు (venkaiah naidu). నాటి వెంకయ్య నాయుడి నినాదాన్ని బీజేపీ (BJP) సమర్ధించింది. అందుకే బీజేపీ ఒక్కటే ఆంధ్రకు (andhra) న్యాయం చేయగలదు అని ఆంధ్రులు నాడు భావించారు. జనసేనాని (Janasenani) కూడా నాడు బీజేపీని సమర్ధించడానికి ఇది ఒక ప్రధాన కారణం అయి ఉండవచ్చు.
అయితే ఇది కొందరి నాయకుల అదృష్టమో లేక ఆంధ్రుల దురదృష్టమో తెలీదు గాని ప్రత్యేక హోదా అన్న వారి అందరి హోదా పెరుగుతున్నది. గాని ఆంధ్రాకి మాత్రం నేటికీ ప్రత్యేక హోదా రావడం లేదు. ఈ హోదా అనే గోదా రాజకీయ నాయకుల (Political Leaders) హోదాని మార్చే తాయత్తులా తయారు అయ్యింది అని చెప్పడం అక్షర సత్యమేమో?
ఆంధ్రాకి హోదాకావాలి. 5 కాదు 10 సంవత్సరాలు కావాలి అని నాడు గట్టిగా గళం వినిపించిన వెంకయ్య నాయకుడుకి తదనంతరం చక్కటి గుర్తింపు వచ్చింది. దేశం గర్వించతగ్గ పదవిలో ఉన్నారు. కారణాలు ఆ పెరుమాళ్ళకే ఎరుకయినాగాని ఆంధ్రాకి మాత్రం ప్రత్యేక హోదా నేటికీ రానేలేదు.
తిరుపతి వెంకన్న సాక్షిగా మోడీ…
రాష్ట్ర విభజన (ap division) ద్వారా తల్లిని చంపేసి, బిడ్డని బతికించారు. రాష్ట్రానికి 10-15 సంవత్సరాలు అయినా హోదా ఉండాలి అని తిరుపతి వెంకన్న సాక్షిగా మోడీ అన్నారు. తదనంతరం నరేంద్ర మోడీ (Narendra Modi) దేశ ప్రధాని (Prime minister) కూడా అయ్యారు. దేశం గర్హించే స్థాయిలో పాలిస్తున్నారు. హోదాని మాత్రం ఇవ్వలేదు. కారణాలు ఆ పెరుమాళ్ళకే ఎరుకయినాగాని ఆంధ్రాకి మాత్రం ప్రత్యేక హోదా నేటికీ రానేలేదు.
నాకు నలభై వసంతాల అనుభవం ఉంది. నాకు అధికారం ఇస్తే, బీజేపీతో సఖ్యతతో పనిచేసి రాష్ట్రానికి హోదాని తెస్తాను. తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాను అని చంద్రబాబు (chandra babu) 2014 లో వాగ్దానం చేశారు. వాగ్ధానం చేసిన చంద్రబాబు సీఎం అయ్యారు. రాష్ట్రము అభివృద్ధిలో కంటే అప్పుల్లో పరిగెట్టేటట్లు చేయగలిగారు. బాబుకి దక్కిన సీఎం (CM) హోదాతో చక్కగా (కొందరికి మాత్రమే) పాలన పూర్తిచేశారు. హోదా విషయాన్ని మాత్రం మరిచారు. కారణాలు ఆ పెరుమాళ్ళకే ఎరుకయినాగాని ఆంధ్రాకి మాత్రం ప్రత్యేక హోదా నేటికీ రానేలేదు.
హోదాపై మూడో కృషుడు…
చంద్రబాబు హోదాని ఢిల్లీకి తాకట్టు పెట్టారు. నాకు ఎక్కువ సంఖ్యలో ఎంపీలు ఇవ్వండి. నన్ను సీఎంని చేయండి. కేంద్రం మెడలు వంచి ఆంధ్రాకి ప్రత్యక హోదాను తెస్తాను అని జగన్ (Jagan) నిన్న వాగ్ధానాలు చేశారు. పాపం ఆంధ్రులు జగన్’కి కూడా హోదాని కట్టబెట్టారు. సీఎంని చేశారు. జగన్’కి వచ్చిన సీఎం హోదాతో మెడలు వంచి చక్కటి (కొందరికి మాత్రమే ) పాలన సాగిస్తున్నారు. హోదా విషయాన్ని మరిచారు. కారణాలు ఆ పెరుమాళ్ళకే ఎరుకయినాగాని ఆంధ్రాకి మాత్రం ప్రత్యేక హోదా నేటికీ రానేలేదు.
వాగ్దానాల చరిత్ర పునరావృతం?
2019 లో వైసీపీ ఏవిధమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందో అదే మాటలను నేడు బాబు చెప్పడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. హోదాని తేవడంలో జగన్ ప్రభుత్వం విఫలం అయ్యారు. మా ఎంపీలు రాజీనామాకు సిద్ధం. నాకు అధికారం మరొక్కసారి ఇస్తే హోదా తెస్తాను అన్నట్లు బాబు సరికొత్త నినాదాలు మొదలు పెట్టారు. వీరు ఇద్దరు ఎలా ఎప్పటివరకు హోదా నినాదంతో అధికారాన్ని దక్కించుకొంటారో ఆ పెరుమాళ్ళకే ఎరుక?
కొసమెరుపు ఏమిటంటే?
హోదా అన్న వెంకయ్యజీకి, మోడీకి, బాబుకి, జగన్ అన్నకి పదవులు వచ్చినాయి. వారి హోదాలు పెరిగినాయి. కానీ రాష్ట్రానికి మాత్రం హోదా ఎండమావి గానే మిగిలిపోతున్నది. కారణాలు ఆ పెరుమాళ్ళకే ఎరుక?
హోదాని నేను తెస్తాను అని ప్రజలను నమ్మించడం చేతగాని సత్తెకాలపు జనసేనాని (janasenani) మాత్రం పాచిపోయిన లడ్డులు అంటూ చెప్పారు గాని ప్రజలను నమ్మించడంలో విఫలం అయ్యారు. అందుకేనేమో రాజకీయ మాయా పాచికల ఆటలో ఓడి, శ్లేష్మంలో పడ్డ ఈగలా బయటపడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
సేనాని (senani) బయటపడేది ఎప్పడు? హోదాని తెచ్చేది ఎప్పడు? అయినా తాయిలాల ఊబిలో చిక్కుకొని హోదానే మర్చిపోతున్న ఓటరులకి హోదా వస్తే ఏమిటి? రాక పోతే ఏమిటి?
ఆలోచించండి… “ఆ నాయకులకు” ప్రత్యక హోదా అనేది ఒక వరం? కానీ ప్రజలకు మాత్రం ఇది ఒక శాపం గా మారిందా? హోదా అనేది ఎండమావిగానే మిగలనుందా?
నా ఆవేదనలో తప్పు ఉంటే మన్నించండి… లేకపోతే ప్రత్యేక హోదాపై ఒక్క సారి ఆలోచించండి
–Its from Akshara Satyam
Correct analysis.